వసతిగహాలను పున:ప్రారంభించాలి
అనుమసముద్రంపేట : సంక్షేమ వసతిగహాలను మూసివేయడం తగదని వెంటనే పున:ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండల కేంద్రంలోని ఉన్నతపాఠశాలలు, కళాశాలలును మూసివేయించి బంద్ నిర్వహించారు. ఈసందర్బంగా బస్టాండు సెంటర్‌లో మానవహారం ఏర్పాటుచేశారు. ప్రభుత్వం మెస్ చార్జీలను రూ.1,050కి పెంచాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిఫ్‌ల బకాయిలు విడుదల చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ ఉపాధ్యక్షుడు ఆసిఫ్, మండలాధ్యక్ష, కార్యదర్శులు నాగూర్, రాహిల్, నాయకులు ఫహిమ్, వంశీ, చైతన్య, బాబు, జహిర్, మహిళా నాయకులు సుహన, సాలెహ షర్మిల పాల్గొన్నారు.
సంగం : విద్యార్థులకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌లు సంగంలో సోమవారం విద్యాసంస్థలను మూయించి బంద్ చేశాయి. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండలాధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతిగహాల్లో చదువుకునే విద్యార్థులను చిన్నచూపు చూస్తోందన్నారు. ఏఐఎస్‌ఎఫ్ మంఢలాధ్యక్షుడు ఖాదర్‌బాష మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు సరిగాలేవని, వెంటనే కల్పించాలని కోరారు. నాయకులు వెంకటరమణ, హరి పాల్గొన్నారు.