ఆకట్టుకున్న ‘సంఘం.. శరణం.. గచ్ఛామి’ నృత్యరూపకం | sangam saranam gachami drama | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ‘సంఘం.. శరణం.. గచ్ఛామి’ నృత్యరూపకం

Published Tue, Apr 25 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

ఆకట్టుకున్న ‘సంఘం.. శరణం.. గచ్ఛామి’ నృత్యరూపకం

ఆకట్టుకున్న ‘సంఘం.. శరణం.. గచ్ఛామి’ నృత్యరూపకం

కాకినాడ కల్చరల్‌ : స్థానిక సూర్యకళామందిర్‌లో సీపీఎం నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం అభ్యుదయ ఆర్ట్స్‌ అకాడమీ  బ్యానర్‌పై టి.శివప్రసా«ద్‌ దర్శకత్వంలో ప్రదర్శించిన సంఘం.. శరణం.. గచ్ఛామి నృత్యరూపకం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 126వ జయంతి పురస్కరించుకొని ప్రదర్శన ఏర్పాటు చేశారు. ముందుగా సీపీఎం నాయకులు అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సుందరయ్య  చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.   అంబేడ్కర్‌ అందరి వాడని తెలిపే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని నాయకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో అంబేడ్కర్‌ జీవిత లక్ష్యాలు, బాల్యంలో ఆయన కులవివక్షత కారణంగా అనుభవించిన కష్టాలు, రామాబాయ్‌తో అంబేడ్కర్‌ వివాహా ఘట్టాలను, ఎర్రవాడ జైలులో అంబేడ్కర్‌ అనుభవించిన బాధలను చక్కగా ప్రదర్శించారు. కుల వివక్షతపై అంబేడ్కర్‌ చేసిన పోరాట దృశ్యాలు ప్రేక్షకుల హృదయాలను తడిపేశాయి. అంబేడ్కర్‌ ఆశయాల సాధనలో ప్రజాప్రతినిధులు విఫలయ్యారనే విషయాన్ని చాలా చక్కగా ప్రదర్శించారు. అలాగే సమాజం నుంచి యువత ముందుకు వచ్చి అంబేడ్కర్‌ ఆశయాల సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందనే భావం ప్రదర్శనలో కనిపించింది. ఈ ప్రదర్శనలో బాల అంబేడ్కర్‌గా మనోహార్, యువ అంబేడ్కర్‌గా సజీవన్, ప్రధాన అంబేడ్కర్‌గా ఎం.జగ్గరాజు నటించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.శేషుబాబ్జీ, నగర కార్యదర్శి పి.వీరబాబు, నాయకులు జి.బేబిరాణి, అయితాబత్తుల రామేశ్వరావు, కె. కోటీశ్వరావు, డాక్టర్‌ స్టాలిన్, గుడాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement