2017 నాటికి బ్యారేజ్‌లు పూర్తి
చీఫ్ ఇంజనీరు సుధాకర్‌బాబు
సంగం : 2017 మార్చి నాటికి నెల్లూరు, సంగం బ్యారేజీ నిర్మాణాలను పూర్తిచేసి జిల్లా రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీరు ఇచ్చి ఆదుకుంటామని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చీఫ్ ఇంజనీరు సుధాకర్‌బాబు తెలిపారు. మండల కేంద్రమైన సంగం పెన్నానదిలో నిర్మాణం జరుగుతున్న సంగం బ్యారేజీ, కనుపూరుకాలువ హెడ్‌రెగ్యులేటర్‌ను మంగళవారం ఆయన జిల్లా ఎస్‌ఈ కోటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యారేజీ మ్యాప్‌ను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట ఈఈ రమణ, బ్యారేజ్ ఇంజనీరు బాలాజీ సింగ్ ఉన్నారు.