పెన్నా ఇసుక డంప్‌పై పోలీసుల దాడి
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం రామాపురంలో టీడీపీ నేతలు ఇసుక అక్రమ తవ్వకాలు మళ్లీ మొదలుపెట్టారు. పార్టీ నాయకుడు పెన్నానది పరిధిలో ఏర్పాటుచేసిన ఇసుక డంప్‌పై ఆదివారం బ్లూకోట్ పోలీసులు దాడి చేశారు. పెన్నానదిలో జేసీబీ ఏర్పాటు చేసి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంప్ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాక్టర్లను వెంబడించడంతోపాటు పెన్నానదిలోకి వెళ్లారు.
టీడీపీ అధికారంలోకి వచి్చన వారం రోజుల్లోనే ప్రొద్దుటూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇసుక అక్రమ తవ్వకాలు మొదలుపెట్టారు. పలు గ్రామాల్లో ఇసుక తవ్వుతుండటంతో రెవెన్యూ అధికారులు పెన్నానది పరిసర ప్రాంతాల్లో గోతులు తవ్వారు. దీంతో వారం రోజులుగా ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రామాపురం వద్ద ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు. చాలాకాలంగా రామాపురానికి ఇసుక అక్రమ తవ్వకాల అడ్డాగా పేరుంది. గతంలో గ్రామ టీడీపీ నేతలు ఏకంగా తహసీల్దార్ భాస్కర్‌రెడ్డిని నడిరోడ్డుపై బెదిరించారు.
Comments
Please login to add a commentAdd a comment