Penna
-
రామాపురంలో టీడీపీ నేత ఇసుక తవ్వకం
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం రామాపురంలో టీడీపీ నేతలు ఇసుక అక్రమ తవ్వకాలు మళ్లీ మొదలుపెట్టారు. పార్టీ నాయకుడు పెన్నానది పరిధిలో ఏర్పాటుచేసిన ఇసుక డంప్‌పై ఆదివారం బ్లూకోట్ పోలీసులు దాడి చేశారు. పెన్నానదిలో జేసీబీ ఏర్పాటు చేసి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంప్ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాక్టర్లను వెంబడించడంతోపాటు పెన్నానదిలోకి వెళ్లారు.టీడీపీ అధికారంలోకి వచి్చన వారం రోజుల్లోనే ప్రొద్దుటూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇసుక అక్రమ తవ్వకాలు మొదలుపెట్టారు. పలు గ్రామాల్లో ఇసుక తవ్వుతుండటంతో రెవెన్యూ అధికారులు పెన్నానది పరిసర ప్రాంతాల్లో గోతులు తవ్వారు. దీంతో వారం రోజులుగా ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రామాపురం వద్ద ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారు. చాలాకాలంగా రామాపురానికి ఇసుక అక్రమ తవ్వకాల అడ్డాగా పేరుంది. గతంలో గ్రామ టీడీపీ నేతలు ఏకంగా తహసీల్దార్ భాస్కర్‌రెడ్డిని నడిరోడ్డుపై బెదిరించారు. -
పెన్నాలో అన్ని నీళ్లా?
సాక్షి, అమరావతి: వర్షఛాయ (రెయిన్ షాడో) ప్రాంతంలో పురుడుపోసుకుని ప్రవహించే పెన్నానదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏటా 210.12 టీఎంసీల నీటి ప్రవాహం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. 1985 నుంచి 2015 వరకు పెన్నానది పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఏటా పెన్నా బేసిన్లో కురిసే వర్షపాతం పరిమాణం 1,412.58 టీఎంసీలని లెక్కగట్టింది.వరద జలాలతో కలుపుకొంటే ఏటా 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. కానీ.. పెన్నాలో ఆ స్థాయిలో నీటిలభ్యత లేదని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్లో 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటిలభ్యతను లెక్కగట్టడం శాస్త్రీయం కాదంటున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా చేసే అధ్యయనానికే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఇదీ తేడా..పెన్నాలో నీటిలభ్యతపై 1993లో సీడబ్ల్యూసీ తొలిసారి అధ్యయనం చేసింది. 1944–45 సంవత్సరం నుంచి 1983–84 వరకు బేసిన్లో 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా అప్పట్లో నీటిలభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే పెన్నాలో 223.18 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పెన్నా బేసిన్ 55,213 చదరపు కిలోమీటర్లుగా పేర్కొంది. తాజాగా సీడబ్ల్యూసీ పెన్నా బేసిన్లో 1985–2015 మధ్య అంటే 30 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలిపితే 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది.75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే నదిలో 210.12 టీఎంసీలు ఉంటుందని పేర్కొంది. కానీ బేసిన్ మాత్రం 54,905 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు గుర్తించింది. 1993తో పోలిస్తే బేసిన్ విస్తీర్ణం 308 చదరపు కిలోమీటర్లు తగ్గింది. పెన్నా బేసిన్లో 1944–84తో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం అధికంగా ఉండటంవల్లే నీటిలభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీన్ని సాగునీటిరంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కేవలం 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాలను ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. అధ్యయనం పరిధిని తగ్గించుకోవడం వల్లే నీటిలభ్యత పెరిగిందని, ఇది అశాస్త్రీయమని స్పష్టం చేస్తున్నారు. పెన్నా బేసిన్ ఇదీ..కర్ణాటకలో వర్షఛాయ ప్రాంతమైన చిక్‌బళ్లాపూర్ జిల్లా నందికొండల్లోని చెన్నకేశవ పర్వతశ్రేణుల్లో పుట్టిన పెన్నానది.. రాష్ట్రంలో వర్షాభావ ప్రాంతాలైన శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల మీదుగా 597 కిలోమీటర్లు ప్రవహించి ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమవైపు నుంచి జయమంగళ, కుందేరు, కుడివైపు నుంచి సగిలేరు, చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు ఉపనదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్లో 400 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఈ బేసిన్ విస్టీర్ణం 54,905 చదరపు కిలోమీటర్లని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. -
AP: గోదావరి–పెన్నా అనుసంధానమే అజెండా
సాక్షి, అమరావతి: గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం వర్చువల్ విధానంలో నిర్వహించే జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశంలో నదుల అనుసంధాన పనులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొంటారు. తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జున సాగర్‌లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి సోమశిలకు తరలించి.. కావేరి గ్రాండ్ ఆనకట్టలోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ నదులను అనుసంధానం చేసేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)ను ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించింది. ఈ డీపీఆర్‌పై ఆ నదీ పరీవాహక రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. గోదావరిలో మిగులు జలాలే లేవని.. ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీర్చాక మిగిలిన నీటినే కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. గోదావరిలో నీటి లభ్యతపై ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ(కేంద్ర జల సంఘం) లెక్కలకు పొంతన లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ.. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలని సూచించింది. గోదావరి నుంచి తరలించే నీటిని రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఆయకట్టుకు నీళ్లందిస్తారో స్పష్టంగా చెప్పాలని సూచిస్తూ కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఎన్‌డబ్ల్యూడీఏ పాలకమండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని అధికారులు మరోసారి కేంద్రానికి వివరించనున్నారు. -
గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానం!
సాక్షి, అమరావతి: గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకుని కృష్ణా, పెన్నా పరీవాహక ప్రాంతాల దాహార్తి తీర్చి రాష్ట్రాన్ని కరువనేది ఎరుగని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. గోదావరి–కృష్ణా–పెన్నా నదుల అనుసంధానానికి డిసెంబర్ 26వ తేదీన సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఆలోగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక, అంచనాలు (ఎస్టిమేట్లు) రూపొందించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు నదుల అనుసంధానం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారు. గోదావరి–పెన్నా అనుసంధానంపై వ్యాప్కోస్ నివేదికను తుంగలో తొక్కిన టీడీపీ సర్కారు ఎన్నికల ముందు కమీషన్ల కోసం చింతలపూడి ఎత్తిపోతల ఆయకట్టుకు అందించాల్సిన నీటినే నాగార్జునసాగర్ కుడి కాలువకు తరలించే పనులను ‘గోదావరి–పెన్నా’ అనుసంధానం తొలిదశ కింద రూ.6,020 కోట్లతో చేపట్టింది. పర్యావరణ, హైడ్రలాజికల్ తదితర అనుమతులు లేకుండా చేపట్టిన ఈ పనులను రద్దు చేయాలని నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. గోదావరి వరద జలాలను రోజుకు కనీసం నాలుగు టీఎంసీల చొప్పున కృష్ణా, పెన్నా పరీవాహక ప్రాంతాలకు తరలించి మూడు నదుల అనుసంధానం పనులను చేపట్టాలని జలవనరులశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. సమగ్ర డీపీఆర్‌పై కసరత్తు.. గత సర్కారు హయాంలో రూ.8.59 కోట్లతో తయారు చేసిన డీపీఆర్ అసమగ్రంగా ఉన్నందున గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానంపై తాజా ప్రతిపాదనల మేరకు గతంలో చెల్లించిన బిల్లులతోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక అందజేయాలని వ్యాప్కోస్ను జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. అక్టోబర్ నెలాఖరు నాటికి డీపీఆర్ ఇవ్వాలని నిర్దేశించారు. దీని ఆధారంగా నవంబర్ 15 నాటికి పనులు చేపట్టేందుకు ఎస్టిమేట్లు, పరిపాలన అనుమతులు పూర్తి చేయాలని నిర్ణయించారు. వెంటనే టెండర్లు పిలిచి డిసెంబర్ 15 నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించనున్నారు. డిసెంబర్ 26న గోదావరి–కృష్ణా–పెన్నా నదుల అనుసంధానం పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. -
ఆ గడ్డపై ఎన్నో సమరాలు.. తెగిపడిన తలలు
ఆ గడ్డపై ఎన్నో సమరాలు.. పెల్లుబుకిన ఆవేశాలు.. పౌరుషాలు...మార్మోగిన రణతూర్యాలు.. ప్రతిధ్వనించిన యుద్ధభేరీలు..ఎగిసిన ఖడ్గాలు...తెగిపడిన తలలు..విజయ నాదాలు...వీర సైనికుల రక్తపుటేర్లు, రాచరికపు జిత్తులు... రణతంత్రపుటెత్తులతో గొప్పగా విలసిల్లిన క్షేత్రం సిద్దవటం కోట. 18 రాజవంశాలు.. హిందూ, ముస్లిం పాలకుల కాలంలో చవిచూసిన వైభవానికి నిదర్శనంగా ఆ కోట నేటికీ పర్యాటకులను అలరిస్తోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఈ సంవత్సరం ఇక్కడ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దవటం కోట గురించి ప్రత్యేక కథనం సాక్షి, కడప : ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి సిద్దవటం దక్షిణ ద్వారంగా పేరుగాంచింది. తూర్పు వాహినిగా ఉన్న పెన్నానదికి ఉత్తరాన చుట్టూ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలోఉంది సిద్దవటం. బ్రిటీషర్ల హయాంలో సిద్దవటం జిల్లా కేంద్రంగా గొప్ప వైభవాన్ని చూసింది. పెన్నాలో ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగుల రాకపోకలకు తరుచూ అంతరాయం కలుగుతోంది. దీంతో జిల్లా కేంద్రాన్ని కడపకు మార్చారని తెలుస్తోంది. ఒకప్పుడు ఆ ప్రాంతంలో వట (మర్రి) వృక్షాలు ఎక్కువగా ఉండేవని పెన్నాలో స్నానం చేసిన సిద్దులు ఆ చెట్ల కింద తపస్సు చేసుకునే వారని, అందుకే ఆ ఊరికి సిద్దవటం పేరు వచ్చిందని జనంలో ప్రచారంలో ఉంది. 18 రాజవంశాలు సిద్దవటాన్ని దాదాపు 18 రాజవంశాలు పాలించాయి. వీటిలో మట్లిరాజులు ముఖ్యపాత్ర పోషించారు. 12వ శతాబ్దం నుంచి వారి పాలన ఈ ప్రాంతంలో సాగిందని చరిత్రకారుల సమాచారం. తొలుత కాకతీయులు, తర్వాత విజయనగర మహారాజులకు మట్లిరాజులు సామంతులుగా ఉండేవారని కూడా తెలుస్తోంది. సిద్దవటం జిల్లాలోని అన్ని కోటల కంటే ప్రాచీనమైనదని చరిత్రకారులు పేర్కొంటున్నారు. 11వ శతాబ్దానికి ముందే ఈ కోట నిర్మితమైందని, నాటి నందన చక్రవర్తి ఇక్కడ మట్టి కోటను నిర్మించాడని తెలుస్తోంది. తర్వాత తెలుగు చోళులు మట్టి కోటను ఇంకా పటిష్టం చేశారని, 14వ శతాబ్దంలో వచ్చిన మట్లిరాజులు (మట్లి అనంతరాజు) కోటను బలిష్టమైన రాతి కోటగా పునర్నిర్మించారని శాసనాధారాలతోపాటు కడప కైఫీయత్తుల ద్వారా తెలుస్తోంది. 1648లో మట్టిదేవ చోళ వెంకటరాజు నుంచి ఈ రాజ్యం ముస్లిం పాలకుడు మీర్‌జుమ్లా ఆధీనంలోకి వచ్చిందని, 1717లో ఆర్కాట్ నవాబుల వశమైందని, ఆర్కాట్ పాలకుడు పత్తేసింగ్ నుంచి కడప నవాబు నబీఖాన్, అతని నుంచి నిజాం నవాబు, 1800వ సంవత్సరం అక్టోబరు 12న నైజాం నవాబు నుంచి దీన్ని బ్రిటీషర్లు స్వాధీనం చేసుకున్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు. పాలనా క్రమం సిద్దవటం ప్రాంతాన్ని కలకడ వైదుంభులు కూడా పాలించినట్లు చారిత్రక సమాచారం. 1595 ప్రాంతంలో కొండ్రాజు తిరుపతిరాజు, వెంకటపతిరాజులకు రాజంపేట ఊటుకూరు వద్ద జరిగిన యుద్ధంలో మట్లిరాజులకు సిద్దవటం అమర నాయకంగా వచ్చింది. మట్లి వారి తర్వాత ఆర్కాట్ నవాబుల కాలంలో సిద్దవటం కోటను మైసూరు పాలకుడు హైదర్అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ పాలించాడు. మట్లి రాజులు ఈ ప్రాంతంలోని పలు గ్రామాలను అభివృద్ధి చేసి సస్యశ్యామలంగా మార్చినట్లు సమాచారం. జిల్లాలోని కోటల్లో సగానికి పైగా మట్లిరాజులు నిర్మించినవే. వీరి ఏలుబడిలోని ప్రాంతాలను రాజువారి సీమగా పిలిచేవారు. వారి కాలంలోని అనంతరాజు బద్వేలు, యల్లమరాజు చిట్వేలి చెరువులను నిర్మించినట్లు తెలుస్తోంది. విశిష్ట స్థానం.. జిల్లాలోని కోటల్లో సిద్దవటానికి విశిష్ట స్థానం ఉంది. కోటకు దక్షిణం వైపున పెన్నానది సహజమైన, విశాలమైన కందకంగా ఉండగా, మిగతా మూడు వైపుల బలమైన రాతి గోడలు, బురుజులు ఉన్నాయి. 35 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట నిర్మితమై ఉంది. కోట ముఖ ద్వారంలోనూ, లోపల సభా మండపం తదితర చోట్ల కనువిందు చేసే శిల్ప సోయగాన్ని తిలకించవచ్చు. కోటలో ప్రాచీన సిద్దేశ్వరస్వామి ఆలయం నేడు శిథిలమై ఉంది. గ్రామం మొదట్లో పెన్నా ఒడ్డున శ్రీ రంగనాయకస్వామి పురాతన ఆలయం ఉంది. కోటలో పలుచోట్ల శివాలయాలు బయల్పడుతున్నాయి. ఒకప్పుడు కోటలో పలు శివాలయాలు ఉండినట్లు దీని ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కోట కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. వారి ఆధ్వర్యంలో కోటలో ఆకర్షణ కోసం పచ్చిక బయళ్లు పెంచారు. కోట నిత్యం పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది. పరిశోధకులు కోటలోని తెలుగు, కన్నడ, సంస్కృత శాసనాలను అధ్యయనం చేసేందుకు వస్తుంటారు. ఈ కోట హిందూ, ముస్లింల సమ్మిళత శైలికి నిదర్శనంగా కనిపిస్తుంది. కోటలో మసీదు కూడా ఉంది. 1802 ప్రాంతంలో ఈ కోటను సందర్శించిన బ్రిటీషు చిత్రకారుడు థామస్ ఫ్రీజర్ ఈ కోట గురించి రెండు అద్బుతమైన వర్ణ చిత్రాలు గీశారు. అవి నేటికీ లండన్ ప్రధాన మ్యూజియంలో ఉన్నాయి. కళాపోషణ.. మట్లిరాజులు యుద్ద పిపాసులేగాక కళలకు కూడా పెద్దపీట వేశారు. మట్లి యల్లమరాజు కుమారుడు ఆనందరాజు ఆస్థానంలో నాటి ప్రముఖ కవి ఉప్పుగుండూరు వెంకట కవి ఉండేవారు. ఒంటిమిట్ట దశరథరామ చరిత్ర రాసింది ఆయనే. అనంతరాజు కూడా రాయలవారిలాగా మంచి కవి. ఆయన స్వయంగా కకుత్స విజయం కావ్యం రాశారు. కవి చౌడప్ప కూడా అనంతరాజు అస్థానంలోని వారే. రాయల కొలువులో లాగానే మట్లి అనంతరాజు కొలువులో కూడా అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఆయన రాజ్యపాలనలో రాయలంతటి పేరు గడించారు. ఒంటిమిట్ట ఆలయాన్ని పటిష్టం చేశారు. -
విహారం..విషాదం
- పెన్నా నదిలో మునిగిన ముగ్గురు యువకులు - ఇద్దరిని కాపాడిన మరో యువకుడు - ఒకరు గల్లంతు - గల్లంతైన వ్యక్తి ఆదోని వాసి చెన్నూరు : విహారం విషాదం నింపింది. పొట్టకూటి కోసం వలస వచ్చి బేల్దారి పని చేసుకుంటూ జీవించే వారికి విందు.. వేదనను మిగిల్చింది. పెన్నా నదిలో అందరూ చూస్తుండగానే ముగ్గురు మునిగిపోగా.. ఇద్దరిని ఓ యువకుడు కాపాడాడు. ఒకరు గల్లంతైన సంఘటన ఆదివారం చెన్నూరు సమీపంలోని కొండపేట వంతెన వద్ద చోటు చేసుకొంది. వారి బంధువులు, ఎస్ఐ వినోద్‌కుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచగేరి గ్రామానికి చెందిన వడ్డె రామయ్య కుమారుడు రాముడు అలియాస్ బజారి(25) బేల్దారి పని చేస్తూ జీవించే వాడు. అతని కుటుంబంతోపాటు అదే మండలానికి చెందిన కొందరు యువకులు కడప రవీంద్రనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని బేల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నూరులోని ఏటిగడ్డ వీధిలో మస్తాన్ ఇంటి నిర్మాణాన్ని అదే మండలానికి చెందిన 12 మంది యువకులు ఇటీవల పూర్తి చేశారు. వారికి ఆదివారం మధ్యాహ్నం మస్తాన్ విందు ఏర్పాటు చేశాడు. విందు అయ్యాక అందరూ కలిసి సరదాగా పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వారిలో రాముడుతోపాటు రంగేష్, సురేష్ అనే యువకులు నది లోపలికి వెళ్లడంతో కొట్టుకుపోతుండగా.. అక్కడే ఉన్న సురేష్‌కుమార్ ఇద్దరిని కాపాడాడు. రాముడును కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. వేగంగా వస్తున్న జల ప్రవాహానికి మునిగిపోయి గల్లంతయ్యాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, బందువులు సంఘటనా స్థలానికి చేరుకుకున్నారు. వారు తెలపడంతో పోలీసులు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో ఇప్పుడు సాధ్యం కాదని, సోమవారం జాలర్లను పిలిపించి గాలింపు చర్యలు తిరిగి చేపడతామని ఎస్ఐ వినోద్‌కుమార్ తెలిపారు. రోదిస్తున్న బంధువులు, స్నేహితులు గల్లంతైన రాముడుకి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోగా భార్య జానకి(22) ప్రస్తుతం గర్భవతి. ‘కూలి పనులు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చి మృత్యువాత పడ్డావా నాయనా’ అంటూ తల్లిదండ్రులు, అక్క, బంధువులు, స్నేహితులు నది వద్ద రోదించడం అందరిని కలిచి వేసింది. -
వరద కాలువ టెండర్లు రద్దు
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లాలో కుందూ–పెన్నా వరద కాలువ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు శుక్రవారం చివరి నిమిషంలో రద్దయ్యాయి. రూ.112 కోట్ల విలువైన ఈ పనుల టెండర్ల నిర్వహణలో జరిగిన లోటుపాట్లపై సర్వత్రా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారులు టెండర్‌ను రద్దు చేశారు. టెండర్ నోటిఫికేషన్లో జరిగిన తప్పులను సరిదిద్ది త్వరలో మళ్లీ జారీ చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వివరాలిలా వున్నాయి. ప్రొద్దుటూరు పట్టణానికి మంచినీరు అందించేందుకు మొత్తం రూ.183కోట్ల వరద కాలువ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం రూ.112కోట్లతో పనులు చేపట్టేందుకు అధికారులు టెండర్లు నిర్వహించారు. భూసేకరణకు సంబంధించి అభ్యంతరం లేనిచోట పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. అయితే టెండర్ నిబంధనల తీరుపై పలువురు కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ అధికారుల వ్యవహారశైలిని విమర్శించారు. టెండర్లు నిర్వహిస్తే కోర్టును ఆశ్రయించేందుకు కూడా కొందరు కాంట్రాక్టర్లు, నేతలు సిద్ధమయ్యారు. అలాగే పలువురు నేతలు కూడా ఈ నిబంధనల పట్ల అధికారులను ప్రశ్నించారు. అలాగే ఈ పనులను ఎలాగైనా దక్కించుకునేందుకు స్థానికంగా అధికారపార్టీ నేతలు తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. చివరి రోజు కావడంతో శుక్రవారం హైదరాబాద్‌లోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి వెళ్లారు. విమర్శలు వెల్లువెత్తడంతో టెండర్లో పొరపాట్లను గమనించిన ఇంజనీరింగ్ అధికారులు శుక్రవారం సాయంత్రం 3.30 ప్రాంతంలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ టెండర్‌కు పోటీపడిన తెలుగు తమ్ముళ్లు నిరాశతో వెనుదిరికి వచ్చారు. మార్పులు చేయాల్సి ఉంది: ఎస్ఈ ఈ విషయంపై చిన్ననీటిపారుదల శాఖ జిల్లా ఎస్ఈ శంకర్‌రెడ్డిని సాక్షి వివరణ కోరగా కమిషనర్ ఆఫ్ టెండర్స్ నిబంధనల ప్రకారం జాయింట్ వెంచర్లు టెండర్లో పాల్గొనకూడదన్నారు. తమకు ఈ విషయం తెలియకపోవడంతో జాయింట్ వెంచర్లను కూడా ఆహ్వానించామన్నారు. అలాగే సర్ఫేస్ డ్యాం నిబంధనల్లో కూడా మార్పులు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రద్దయిన వరద కాలువ పనులకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుని వీలైనంత త్వరలో తిరిగి టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. -
2017 నాటికి బ్యారేజ్‌లు పూర్తి
చీఫ్ ఇంజనీరు సుధాకర్‌బాబు సంగం : 2017 మార్చి నాటికి నెల్లూరు, సంగం బ్యారేజీ నిర్మాణాలను పూర్తిచేసి జిల్లా రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీరు ఇచ్చి ఆదుకుంటామని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చీఫ్ ఇంజనీరు సుధాకర్‌బాబు తెలిపారు. మండల కేంద్రమైన సంగం పెన్నానదిలో నిర్మాణం జరుగుతున్న సంగం బ్యారేజీ, కనుపూరుకాలువ హెడ్‌రెగ్యులేటర్‌ను మంగళవారం ఆయన జిల్లా ఎస్ఈ కోటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యారేజీ మ్యాప్‌ను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట ఈఈ రమణ, బ్యారేజ్ ఇంజనీరు బాలాజీ సింగ్ ఉన్నారు. -
పెన్నా బ్యారేజీ పనులను పరిశీలించిన మంత్రి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ ఆదివారం పెన్నాబ్యారేజీ పనులను పరిశీలించారు. అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించిన మేరకు వచ్చే మార్చి నెలలోగా సంగం, పెన్నా బ్యారేజీల పనులను పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట అధికారపార్టీ నాయకులు, ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు, పలువురు అధికారులు ఉన్నారు. -
పెన్నానదిలో మునిగి ముగ్గురి మృతి
మృతుల్లో ఇద్దరు బెంగళూరుకు చెందిన దంపతులు మరొకరు ఉప్పలపాడుకు చెందిన చిన్నారి సోమశిల, న్యూస్‌లైన్: బంధువుల ఇంట జరిగిన శుభకార్యానికి విచ్చేసి అందరితో సంతోషంగా గడిపారు ఆ దంపతులు. ఎటూ ఊరికి వచ్చాం కదా..అని సోమశిల జలాశయం వద్ద సరదాగా గడుపుదామని భావించారు. కొంద రు బంధువులు కూడా వస్తామని ముందుకు రావడంతో 10 మంది బృందంగా సోమశిల జలాశయం వద్దకు వెళ్లారు. ఆనందంగా నీటిలో కేరింతలు కొడుతుండగా దంపతులైన శ్రీనివాసులు (30), నాగరత్నమ్మ(28)తో పాటు వారి మేనకోడలు స్వాతి (13)ని మృత్యువు కబళించింది. సోమశిల జలాశయం వద్ద ఆదివారం జరిగిన ఈ సంఘటన ఇటు సోమశిలతో పాటు అటు ఉప్పలపాడులో విషాదం నింపింది. బెంగళూరులోని శేషాద్రిపురంలో ఉండే కలువాయి శ్రీనివాసులు, నాగరత్నమ్మ బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు అనంతసాగరం మండలంలోని ఉప్పలపాడుకు వచ్చా రు. మూడు రోజుల క్రితం జరిగిన వివాహ వేడుకలో బంధువులందరితో కలిసి సరదాగా గడిపారు. గ్రామానికి వచ్చినప్పుడ ల్లా సోమశిల జలాశయం వద్దకు విహారయాత్రకు వెళ్లే అలవాటు వీరికి ఉంది. అం దులో భాగంగా ఉప్పలపాడులోని బంధువులు 10 మందితో కలిసి సోమశిల జలాయశం వద్దకు వెళ్లారు. వీరికి మేనకోడలైన స్వాతి (చెరుకూరు యానాదయ్య, అచ్చమ్మ కుమార్తె) కూడా జలాశయంలో ఈతకు వె ళ్లింది. అందరూ కలిసి జలాశయం కింది భాగంగా పెన్నానదిలో కేరింతలు కొట్టసాగారు. ఇంతలో నాగరత్నమ్మ దిగిన చోట పాచి ఎక్కువగా ఉండడంతో ఆమె లోతులోకి జారిపోయింది. గమనించిన వెంకటేశ్వర్లు కాపాడే ప్రయత్నంలో తానూ మునిగి పోయాడు. వీరిద్దరిని రక్షించాలనే ప్రయత్నంలో స్వాతి తన చేతిని అందిచ్చింది. ఈ ప్రయత్నంలో ముగ్గురూ నీటిలో మునిగిపోయారు. గమనించిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక మామిడిచెట్ల సెంటర్లో ఉండే జాలర్లు నీ టిలో దిగి మృతదేహాలను వెలికితీశారు. సం ఘటన స్థలాన్ని ఆత్మకూరు సీఐ అల్తాఫ్హుస్సేన్, అనంతసాగరం ఎస్సై పుల్లారావు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనాథైన చిన్నారి శ్రీనివాసులు, నాగరత్నమ్మ నీటిలో మునిగి చనిపోవడంతో వీరి కుమారుడు నానేష్(5) అనాథగా మారాడు. తల్లిదండ్రులిద్దరూ నీళ్ల లో మునిగిపోవడం చూసిన నానేష్ ‘మా అమ్మా..నాన్న నీళ్లలో మునుగుతూ పోయా రు’ అని చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది. ఉప్పలపాడులో విషాదం గ్రామానికి మంగళ రవికుమార్ వివాహం మూడు రోజుల క్రితం జరిగింది. ఈ వేడుక కు హాజరయ్యేందుకు వచ్చిన భార్యాభర్తలతో పాటు వారి మేనకోడలైన గ్రామానికి చెందిన చిన్నారి మృతి చెందడంతో ఉప్పల పాడులో విషాదఛాయలు అలుముకున్నాయి.