అన్నారం బ్యారేజీలో గ్రౌటింగ్ పనులు ప్రారంభం
మేడిగడ్డ బ్యారేజీలో కొనసాగుతున్న మరమ్మతులు
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బ్యారేజీలో త్వరగా మరమ్మతు పనులు పూర్తి చేసి నీటిని నిల్వ చేయడానికి ఇంజనీరింగ్‌శాఖ అధికారులు సన్నద్ధం అవుతున్నట్టు తెలిసింది. అన్నారం బ్యారేజీలోని సీపేజీ లీకేజీలకు గ్రౌటింగ్ పనులను ఆదివారం అ«ధికారులు ప్రారంభించారు. ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు ఇంజనీరింగ్ అధికారులు సీసీ బ్లాక్‌లు తొలగించి మళ్లీ అమర్చుతున్నారు. బ్యారేజీ క్రస్ట్‌గేట్ల ముందు, వెనుకాల ఉన్న ఇసుక మేటలు తొలగించారు. అక్కడి సీపేజీ లీకేజీలను సిమెంట్, ఇసుక మిశ్రమాన్ని 38వ పియర్ వెంట్ వద్ద గ్రౌటింగ్ ద్వారా నింపుతున్నారు.
వర్షాకాలంలో అన్నారం బ్యారేజీ నింపి ఎగువన సుందిళ్ల పంపుహౌస్ ద్వారా ఎత్తిపోసి నీటిని తరలించడానికి ఈఎన్‌సీ జనరల్ అనిల్‌కుమార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అన్నారం బ్యారేజీకి ఎగువన పెద్దవాగు, మానేరు, గ్రావిటీ ద్వారా వచ్చే వరద నీరు కూడా వాడుకునే వీలుందని, ఈ నీటిని ఎగువన సుందిళ్లను తరలించడానికి యత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ 7వ బ్లాక్‌లో కుంగిన పియర్‌లు 19, 20, 21ల దిగువన సీసీ బ్లాక్‌ల అమరిక, షీట్‌ఫైల్స్ దింపుతున్నారు. కాగా, ఆదివారం కురిసిన వర్షానికి అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో పనులు నిలిచాయి. కొద్దిపాటి వర్షానికే అన్నారం బ్యారేజీగేట్ల ముందు భాగంలోకి నీరు చేరుతుందని ఇంజనీరింగ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment