barrage
-
టీడీపీ రాక్షసానందం
-
డేంజర్ లో ప్రకాష్ బ్యారేజ్..
-
కాళేశ్వరంలో నీటినిల్వకు సన్నద్ధం!
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బ్యారేజీలో త్వరగా మరమ్మతు పనులు పూర్తి చేసి నీటిని నిల్వ చేయడానికి ఇంజనీరింగ్‌శాఖ అధికారులు సన్నద్ధం అవుతున్నట్టు తెలిసింది. అన్నారం బ్యారేజీలోని సీపేజీ లీకేజీలకు గ్రౌటింగ్ పనులను ఆదివారం అ«ధికారులు ప్రారంభించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ఇంజనీరింగ్ అధికారులు సీసీ బ్లాక్‌లు తొలగించి మళ్లీ అమర్చుతున్నారు. బ్యారేజీ క్రస్ట్‌గేట్ల ముందు, వెనుకాల ఉన్న ఇసుక మేటలు తొలగించారు. అక్కడి సీపేజీ లీకేజీలను సిమెంట్, ఇసుక మిశ్రమాన్ని 38వ పియర్ వెంట్ వద్ద గ్రౌటింగ్ ద్వారా నింపుతున్నారు.వర్షాకాలంలో అన్నారం బ్యారేజీ నింపి ఎగువన సుందిళ్ల పంపుహౌస్ ద్వారా ఎత్తిపోసి నీటిని తరలించడానికి ఈఎన్సీ జనరల్ అనిల్‌కుమార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అన్నారం బ్యారేజీకి ఎగువన పెద్దవాగు, మానేరు, గ్రావిటీ ద్వారా వచ్చే వరద నీరు కూడా వాడుకునే వీలుందని, ఈ నీటిని ఎగువన సుందిళ్లను తరలించడానికి యత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ 7వ బ్లాక్‌లో కుంగిన పియర్లు 19, 20, 21ల దిగువన సీసీ బ్లాక్‌ల అమరిక, షీట్‌ఫైల్స్ దింపుతున్నారు. కాగా, ఆదివారం కురిసిన వర్షానికి అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో పనులు నిలిచాయి. కొద్దిపాటి వర్షానికే అన్నారం బ్యారేజీగేట్ల ముందు భాగంలోకి నీరు చేరుతుందని ఇంజనీరింగ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
అన్నారం బ్యారేజీకి ముప్పు...
-
నేడు రాష్ట్రానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం
-
అన్నారం బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి అన్నారం(సరస్వతీ) బ్యారేజీలో మరమ్మతుల కోసం ఇంజనీరింగ్ అధికారులు గేట్లు ఎత్తి నీటిని ఖాళీ చేశారు. బ్యారేజీ సమగ్ర సర్వే కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఆదివారం వరకు బ్యారేజీలోని 10–15 గేట్లు ఎత్తి పూర్తి నీటిని రెండువేల క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తున్నారు. నీటిని పూర్తిగా ఖాళీ చేయడంతో బ్యారేజీ పొడవునా 1.6 కిలోమీటర్ల దూరం వరకు లక్ష క్యూబిక్ మీటర్ల మేర గేట్ల వద్ద అర మీటరు ఎత్తులో ఇసుక పేరుకుంది. దీంతో బ్యారేజీలో సమగ్ర సర్వే చేసేందుకు వీలవుతుందా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక తీయకపోతే ఫౌండేషన్, పియర్, ర్యాప్్టల కింద ఖాళీ ప్రాంతం ఎక్కడ ఎంత మేర ఉందనేది తెలియదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఇసుక తొలగించిన తరువాతనే సీపేజీ లీకేజీపై విశ్లేషణ సాధ్యం అవుతుందని అంటున్నారు. గేట్లు కూడా పాడైపోయినట్లు సమాచారం. తడి ఆరిన తర్వాతే సర్వే: నీటిని పూర్తిగా తొలగించిన అధికారులు బ్యారేజీ దిగువన తడి ఇసుక, రేగడి మట్టితో దిగబడుతున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎండిన తరువాతనే సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీలోని 2.01 టీఎంసీలు నీటి నుంచి 10–15 గేట్లు ఎత్తగా 2వేల క్యూసెక్కుల నీరు దిగువకు తరలించారు. నీరు ఖాళీ కావడంతో ర్యాప్్ట, పియర్లు దిగువ వేసిన సీకెంట్ ఫైల్స్ కింది భాగంలో ఏమైనా లీకేజీలు ఉన్నాయా.. ఫౌండేషన్ ఎగువ నుంచి ప్రారంభమై దిగువన ఎక్కడకు వెళ్తుంది.. కింద ఖాళీ ఉందా.. తెలుసుకోవడానికి సర్వే చేపట్టనున్నారు. ఒప్పందం మేరకు పార్సన్ అనే సంస్థ గ్రౌండ్ పెనట్రేషన్టెస్ట్ కోసం సర్వే చేయనుంది. ఈ సర్వే పూర్తయ్యాక ప్రత్యేక రసాయనాలతో తిరిగి మరమ్మతులు చేపట్టనున్నారు. -
రాడార్ టెక్నాలజీతో నిర్ధారించాలి
సాక్షి, హైదరాబాద్: గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడా ర్స్ (జీపీఆర్) వంటి సాంకేతిక లేదా ఇతర పద్ధతులను వినియోగించి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని నేషనల్ డ్యా మ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసి న నిపుణుల కమిటీ సూచించింది. కటాఫ్ వా ల్స్‌కి లేదా కటాఫ్ వాల్స్–ర్యాఫ్ట్ (పునాదులు) మధ్య పగుళ్లు ఎక్కడ వచ్చాయో నిర్ధారించాల ని తెలిపింది. పగుళ్లను పూడ్చి వేయడానికి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని, పునాదుల కింద బుంగలు ఏర్పడి ఉంటే ఆ ప్రాంతాల్లో తవ్వి వాటిని పూడ్చివేయాలని, సమస్యలకు మూలకారణాన్ని గుర్తించి నివారణ చర్యలు తీసుకునే వరకు బ్యారేజీలో నీళ్లను నిల్వ చేయరాదని స్పష్టం చేసింది. అన్నారం బ్యారేజీకి లీకేజీలను నిర్ధారించేందుకు ఈ నెల 2న ఎన్డీఎస్ఏ బృందం అన్నారం బ్యారేజీని సందర్శించింది. ఇటీవల ఎన్డీఎస్ఏకు నివేదిక సమర్పించింది. ఆ నివేదికను ఎన్డీఎస్ఏ రాష్ట్ర నీటిపారుదల శాఖకు పంపించింది. లీకేజీలు పునరావృతం కావడంతో స్పష్టత రాఫ్ట్ కింద భూగర్భంలో నిర్మించిన కటాఫ్ వాల్స్ (బ్యారేజీ గేట్లను మూసివేశాక నీటి ఉధృతితో పీడనం పెరిగి బ్యారేజీ పునాదుల కింద నుంచి నీళ్లు బయటకు ప్రవహించే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా బ్యారేజీ పునాదుల కింద రెండు వైపులా కటాఫ్ వాల్ నిర్మిస్తారు)కు పగుళ్లు వచ్చి ఉంటాయనడంలో సందేహాలు లేవని ఎన్డీఎస్ఏ దక్షిణాది ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.తంగమణి, సీడబ్ల్యూసీ హైదరాబాద్ డైరెక్టర్లు ఎం.రమేశ్‌కుమార్, పి.దేవేందర్‌రావులతో కూడిన కమిటీ తన నివేదికలో తెలిపింది. లీకేజీలు పునరావృతం కావడాన్ని బట్టి కటాఫ్ వాల్స్లలో ఏదో ఒకదానికి లేదా రెండింటికీ పగుళ్లు వచ్చి ఉంటాయని స్పష్టమవుతోందని పేర్కొంది. చెప్పుకోదగిన రీతిలో నీళ్లు లీక్ ‘బ్యారేజీ 28, 38 గేట్లకు ముందు ప్రాంతం నుంచి చెప్పుకోదగిన రీతిలో నీళ్లు లీక్ అవుతున్నాయి. తాత్కాలికంగా లీకేజీని నివారణకు ఇసుక బస్తాలు, బౌల్డర్లను వేసి రింగ్ బండ్ నిర్మించారు. బ్యారేజీ గేట్ల ముందు భాగంలో కాంక్రీట్ బ్లాకులతో అప్రాన్ నిర్మించగా, దాదాపు బ్లాకులన్నీ కొట్టుకుపోయి చెల్లాచెదురయ్యాయి. కాంక్రీట్ బ్లాకులకు దిగువన నిర్మించిన ఇన్వర్టెడ్ ఫిల్టర్ సైతం కొట్టుకుపోయింది. బ్యారేజీకి 2020/21లో సైతం ఇదే తరహాలో లీకేజీలు చోటుచేసుకున్నట్టు బ్యారేజీ అధికారులు నివేదించారు. 3, 4 బ్లాకులతో పాటు 44వ గేటు ఎదుట అప్పట్లో బుంగలు ఏర్పడగా, ఇసుక బస్తాలు, బౌల్డర్లతో రింగ్‌బండ్‌ను ఏర్పాటు చేసి పూడ్చివేశారు. అనంతరం పాలీమర్ ఆధారిత సీలంట్ అనే రసాయన మిశ్రమంతో లీకేజీని నివారించారు. స్టీల్‌తో కూడిన (స్టీల్ రీఎన్ఫోర్స్డ్), సీŠట్ల్ లేని కాంక్రీట్ పిల్లర్లను ఒకదాని పక్కన మరొకటి పేర్చడం ద్వారా బ్యారేజీల పునాదులకు రెండు వైపులా భూగర్భంలో కటాఫ్ వాల్స్ నిర్మిస్తారు. స్టీల్‌తో రీఎన్‌ఫోర్స్ చేయని పిల్లర్లకు పగుళ్లు వచ్చి ఎగువ, దిగువ కటాఫ్ వాల్స్‌కు సైతం పగుళ్లు వచ్చి ఉండే అవకాశం ఉంది. సీŠట్ల్ కలిగి ఉన్న, స్టీల్ లేని పిల్లర్ల మధ్య దృఢత్వంలో వ్యత్యాసంతో కటాఫ్ వాల్స్కి నిలువునా పగుళ్లు వచ్చి ఉండే అవకాశం కూడా ఉంది..’అని కమిటీ తెలిపింది. -
కల్వకుంట్ల ‘స్కామేశ్వరం’లో మరో మైలురాయి: రేవంత్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: అన్నారం బ్యారేజీ వద్ద నెలకొన్న పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కల్వకుంట్ల ‘స్కామేశ్వరం’లో మరో మైలురాయి అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ నిన్న మేడిగడ్డ.. నేడు అన్నారం అంటూ ‘ఎక్స్’వేదికగా వ్యాఖ్యానించారు. అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు అని విమర్శించారు. ‘ప్రాజెక్టు అంటే నీ ఫామ్ హౌస్‌కు ప్రహరీ గోడనుకున్నావో.. నీ మనవళ్లు ఆడుకునే ఇసుక గూళ్లు అనుకున్నావో.. రూ. లక్ష కోట్ల ప్రజల సొమ్మును మింగేసి, నాలుగు కోట్ల జనం నోట్లో మట్టిగొట్టావు’అని సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ‘వందేళ్లకు పైగా ఉండాల్సిన నిర్మాణాలు, ఇలా కండ్లముందే కొట్టుకుపోవడానికి కారణం.. మందేసి నువ్వు గీసిన ఆ పనికిమాలిన డిజైన్లు.. రూ. లక్ష కోట్ల అవినీతి’అని తీవ్రస్థాయిలో విమర్శించారు. కల్వకుంట్ల 'స్కామేశ్వరం'లో మరో మైలు రాయి.. నిన్న మేడిగడ్డ .. నేడు అన్నారం.. అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు.. ప్రాజెక్టు అంటే నీ ఫామ్ హౌజ్ కు ప్రహరీ గోడనుకున్నావో.. నీ మనవళ్ళు ఆడుకునే ఇసుక గూళ్లు అనుకున్నావో.. రూ.లక్ష కోట్ల ప్రజల… pic.twitter.com/JC5NKgKaC4 — Revanth Reddy (@revanth_anumula) November 1, 2023 -
అన్నారం బ్యారేజీకి ప్రమాదమేం లేదు!
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం (సరస్వతి) బ్యారేజీలో నీటి లీకేజీ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని బ్యారేజీ ఈఈ యాదగిరి తెలిపారు. బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని, పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలో ఈ బ్యారేజీని నిర్మించిన విషయం తెలిసిందే. దీని నుంచి నీళ్లు లీకవుతున్నట్టుగా బుధవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై ఈఈ యాదగిరి వివరణ ఇచ్చారు. బ్యారేజీ వద్ద 1,275 మీటర్లతో పొడవుతో సీపేజ్ ఉంటుందని.. దీనికి వార్షిక నిర్వహణ (ఓఅండ్ఎం)లో భాగంగానే పనులు చేస్తున్నామని తెలిపారు. ఏటా సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఉంటుందని, సీపేజ్ తగ్గినప్పుడు మెటల్, ఇసుక వేస్తున్నామన్నారు. పూర్తి నిర్వహణ బాధ్యత అఫ్కాన్ సంస్థదేనని తెలిపారు. ప్రాజెక్టును ఇలాంటి సమస్యలను తట్టుకునే విధంగానే డిజైన్ చేశామన్నా రు. అవసరమైతే కెమికల్ గ్రౌటింగ్ కూడా చేస్తామన్నారు. కాగా బ్యారేజీ పూర్తి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 5.75 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. -
అన్నారం సరస్వతి బ్యారేజీకి లీకేజీలు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఘటన మరిచిపోక ముందే.. మరొకటి వార్తల్లోకి ఎక్కింది. అన్నారం సరస్వతి బ్యారేజీకి లీకేజీలు చోటు చేసుకోవడంతో అధికార యంత్రాగం అప్రమత్తమైంది. బ్యారేజీలో 28, 38 నంబర్ గల రెండు గేట్ల వద్ద లీకేజీతో నీరు ఉబికి వచ్చింది. అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు ఇసుక సంచులు వేసి ఊటలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలో 5.71 టిఎంసీల నీరు ఉండగా.. ఒక గేటు ఎత్తి 2,357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 10.87 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో అన్నారం సరస్వతి బ్యారేజ్ నిర్మించారు. -
స్తబ్దుగా గోదావరి
సాక్షి, అమలాపురం: గలగలా గోదావరి... స్తబ్దుగా ఉంది. ‘నైరుతి’ ముఖం చాటేయడంతో ఈ ఏడాది గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో పెద్దగా వర్షాలు పడలేదు. ఆ ప్రభావం ఇన్‌ఫ్లోపై పడింది. నైరుతి ముగియడం, వరదల సీజన్ కూడా అయిపోవడంతో జలాల రాక క్రమేణా తగ్గిపోయి ఇన్‌ఫ్లో తక్కువ స్థాయిలో నమోదవుతోంది. గడచిన రెండురోజులుగా బ్యారేజ్ నుంచి దిగువునకు నీటి విడుదల ఆగిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభావం వచ్చే రబీపై పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆశాజనకం గతేడాది జూలైలో చరిత్రలో రెండో అతి పెద్ద వరద రాగా, ఆగస్టు, సెప్టెంబరుల్లో కూడా అది కొనసాగింది. అక్టోబరు ఇదే సమయానికి బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 6,231 టీఎంసీలు నమోదవ్వగా, ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు విస్తృతంగా పడే ఆగస్టు, సెప్టెంబరుల్లో కూడా వరద జాడ లేదు. గతంలో అంటే... 2016లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆ ఏడాది బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 2,750.944 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. రబీ మొత్తం ఆయకట్టుకు అనుమతి ఇచ్చినా తరువాత కొంత అనధికారికంగా కోత విధించాల్సి వచ్చింది. తగ్గిన ఇన్‌ఫ్లో ధవళేళ్వరం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో గణనీయంగా పడిపోవడంతో రెండు రోజులుగా గేట్లు మూసివేసి సముద్రంలోకి నీటి విడుదల నిలిపివేశారు. ప్రస్తుత ఇన్‌ఫ్లో 14,700 క్యూసెక్కులు మాత్రమే ఉంది. దీనిలో సీలేరు పవర్ జనరేషన్ నుంచి వచ్చింది 3,765 క్యూసెక్కులు. అంటే సహజ జలాలు కేవలం 10,935 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. ఈ నీటిని తూర్పు డెల్టాకు 4,900, మధ్యడెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు 7,200 చొప్పున మొత్తం 14,700 క్యూసెక్కులు వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదిలేస్తున్నారు. -
పనులు వేగిరం.. పరిహారం దూరం!
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు మద్దూరి శ్రీనివాసరావు. చర్ల మండలం కుదునూరు గ్రామపంచాయతీ పరిధిలో 36 గుంటల భూమే ఈయనకు జీవనాధారం. ఈ స్థలం సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతోంది. దీంతో పరిహారంగా రూ.7.20 లక్షలు అందిస్తామని ప్రకటించారు. కానీ నేటికీ ఒక్క పైసా అందలేదు. సదరు భూమి శ్రీనివాసరావు తల్లి పేరు మీద ఉండటం, ఆమె గతేడాది చనిపోవడంతో.. పట్టాపై ఉన్న భూయజమాని లేరనే కారణంతో పరిహారం నిలిపేశారు. ఈయన చీకటి కిశోర్. సీతమ్మసాగర్ కింద ఇతని కుటుంబానికి సంబంధించిన భూమి ముంపునకు గురవుతోంది. దీంతో ఏడాది క్రితమే రూ.3.50 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. కానీ ఆ స్థలం పట్టా కిశోర్ తండ్రి శాంతయ్య పేరిట ఉంది. ఆయన ఇటీవల మరణించారు. శాంతయ్య లేడనే కారణంతో ఆ కుటుంబానికి నేటికీ పరిహారం అందించలేదు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వడంతో పాటు 320 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సీతమ్మ సాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఇందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం, అశ్వాపురం మండలాల మధ్య గోదావరి నదిపై బ్యారేజీ నిర్మిస్తోంది. దీనివల్ల ఇటు దుమ్ముగూడెం, చర్ల, అటు మణుగూరు, అశ్వాపురం మండలాల్లో సుమారు 3,267 ఎకరాలు మంపునకు గురయ్యే అవకాశం ఉందని గుర్తించారు. నిర్వాసితులకు పరిహారం అందించేందుకు రూ.160 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే కోర్టు వివాదాలు, పట్టా పుస్తకం ఎవరి పేరుతో ఉందో ఆ భూ యజమానులు మరణించడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల సుమారు 100 మంది రైతులకు నేటికీ పరిహారం అందలేదు. సమస్యలు పరిష్కరించి ముంపు బాధితులకు పరిహారం అందజేయాల్సిన రెవెన్యూ అధికారులు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ముప్పు తిప్పలు పెడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు పనులు మొదలు కావడంతో భూమి సాగు చేసేందుకు వీలుకాక, మరోవైపు పరిహారం అందక నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆందోళనలకు దిగుతున్నారు. ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా.. ఇటీవల సీతమ్మసాగర్ బ్యారేజీ, ఫ్లడ్‌బ్యాంక్, వరద కాలువ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. పరిహారం చెల్లించిన భూముల్లో జోరుగా కొనసాగుతున్నాయి. భారీ యంత్రాలు తిరిగేందుకు వీలుగా పొలాల్లో తాత్కాలిక రోడ్లు వేస్తున్నారు. ఎక్కడిక్కడ కందకాలు తీశారు. దీంతో చాలా పొలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పరిహారం అందని రైతుల భూములు కూడా ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌ను రైతులు నష్టపోగా ఇప్పుడు రబీ సీజన్లో అదే పరిస్థితి నెలకొంది. దీంతో ముంపు రైతులు తమకు వెంటనే పరిహారం చెల్లించాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే బుధవారం చర్లలో బ్యారేజీ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఆందోళనకు దిగారు. తమ తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు, అలాగే సంబంధిత వారసత్వ ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా నేటికి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయలేదని ముంపు బాధితులు వాపోతున్నారు. పరిహారం అందకపోయినా ఇన్నాళ్లూ భూములు సాగు చేస్తూ జీవించామని, ఇప్పుడు పనులు మొదలు కావడంతో సాగుకు అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఉన్న ఒక్క జీవనాధారం కోల్పోవడంతో కడుపు నింపుకునేందుకు కూలీ పనులకు వెళుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిక్కుతోచనిస్థితిలో కొందరు రైతులు పట్టణాలకు వలస వెళ్తుంటే, ఆసరా కోల్పోయిన వృద్ధులు ఆదుకునే హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. రెండు వారాల్లో నష్ట పరిహారం పెండింగ్‌లో ఉన్న పరిహారం ఫైళ్లు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ముంపు బాధితులకు రెండు వారాల్లో పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – భరణిబాబు, తహసీల్దార్, చర్ల -
నెల్లూరుకు నగిషీ.. వందేళ్ల కల సాకారం
(నెల్లూరు బ్యారేజ్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల స్వప్నం నెల్లూరు బ్యారేజ్ సాకారమవుతోంది. జలయజ్ఞంలో భాగంగా దివంగత వైఎస్సార్ చేపట్టిన నెల్లూరు బ్యారేజ్ పనులను ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారు. ఈ బ్యారేజ్‌ను ఈనెల 6వ తేదీన జాతికి అంకితం చేయనున్నారు. బ్యారేజ్ ద్వారా సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువల కింద సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలోని ముత్తుకూరు, టీపీ గూడూరు, వెంకటాచలం, ఇందుకూరుపేట, నెల్లూరు మండలాల్లోని 77 గ్రామాల్లో 99,525 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందనుంది. బ్యారేజ్‌ను పూర్తి చేసి నిత్యం 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా నెల్లూరుతోపాటు 77 గ్రామాల్లో తాగునీటి సమస్యను సీఎం జగన్ శాశ్వతంగా పరిష్కరించారు. వరద నియంత్రణ ద్వారా ముంపు ముప్పు నుంచి తప్పించారు. నెల్లూరు బ్యారేజ్ కమ్ 2 వరసల రోడ్డు బ్రిడ్జిని పూర్తి చేయడంతో నెల్లూరు–కోవూరు మధ్య రవాణా ఇబ్బందులు శాశ్వతంగా పరిష్కారమయ్యాయి. దీంతోపాటు మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని కూడా సీఎం జగన్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆంగ్లేయుల కాలంలో... 1854–55లో ఆంగ్లేయుల హయాంలో నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదికి అడ్డంగా 481.89 మీటర్ల వెడల్పుతో ఆనకట్ట నిర్మించి అరకొరగా మాత్రమే ఆయకట్టుకు నీళ్లందించారు. 1862లో భారీ వరదలకు ఆనకట్ట దెబ్బతినడంతో 621.79 మీటర్ల వెడల్పుతో 0.7 మీటర్ల ఎత్తుతో కొత్త ఆనకట్ట నిర్మించారు. పూడిక పేరుకుపోవడం, శిథిలం కావడంతో ఆయకట్టుకు నీళ్లందించడం 1904 నాటికే సవాల్‌గా మారింది. నెల్లూరు తాగునీటికి తల్లడిల్లింది. ఆనకట్టకు దిగువన ఉన్న రోడ్డు ద్వారా నెల్లూరు–కోవూరు మధ్య రాకపోకలు సాగించేవారు. పెన్నా నదికి కాస్త వరద వచ్చినా రాకపోకలు స్తంభించిపోయేవి. ఆనకట్ట వల్ల వరద వెనక్కి ఎగదన్ని నెల్లూరును ముంచెత్తేది. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మించాలని 1904 నాటి నుంచి నెల్లూరు ప్రజలు కోరుతున్నా 2004 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయ/æ్ఞంలో భాగంగా నెల్లూరు బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మాణాన్ని రూ.147.20 కోట్లతో 2008 ఏప్రిల్ 24న చేపట్టారు. ఆయన హయాంలో బ్యారేజ్ పనులు పరుగులెత్తాయి. రూ.86.62 కోట్లను ఖర్చు చేశారు. మహానేత హఠాన్మరణం నెల్లూరు బ్యారేజ్‌కు శాపంగా మారింది. నాడు కాలయాపన.. కమీషన్లకే ప్రాధాన్యం రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ నెల్లూరు బ్యారేజ్ పనులను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. బ్రిటీష్ సర్కార్ నిర్మించిన పాత ఆనకట్టకు పది మీటర్ల ఎగువన 10.9 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా 640 మీటర్ల వెడల్పుతో నెల్లూరు బ్యారేజ్ నిర్మాణాన్ని చేపట్టారు. పాత ఆనకట్ట వల్ల వరద ప్రవాహం వెనక్కి ఎగదన్నడం బ్యారేజ్ నిర్మాణానికి సమస్యగా మారింది. పాత ఆనకట్టను పూర్తిగా తొలగించి బ్యారేజ్ నిర్మిస్తున్న ప్రాంతానికి 20 మీటర్ల ఎగువన కాఫర్ డ్యామ్ నిర్మించి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్ నిర్మించాలని 2014లో ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. 2016 వరకూ టీడీపీ సర్కార్ దీన్ని పరిశీలించకుండా జాప్యం చేసింది. ఆ తరువాత డిజైన్లలో మార్పులు చేసి అంచనా వ్యయాన్ని రూ.274.83 కోట్లకు సవరించింది. కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు రాబట్టుకునే పనులకే ప్రాధాన్యం ఇచ్చింది. 2016 నుంచి 2019 మే 29 వరకూ రూ.71.54 కోట్లు ఖర్చు చేసినా బ్యారేజ్‌లో 57 ఫియర్లను (కాంక్రీట్ దిమ్మెలు) పునాది కంటే ఒక మీటర్ ఎత్తు వరకు మాత్రమే చేయగలిగింది. నేడు ప్రతికూల పరిస్థితుల్లోనూ పూర్తి.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నెల్లూరు బ్యారేజ్‌ను ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 2020 మార్చి నుంచి 2021 చివరిదాకా కరోనా మహమ్మారి మూడు దఫాలు విజృంభించింది. పెన్నా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 2019–20, 2020–21, 2021–22లో వరుసగా భారీ వరదలు వచ్చాయి. నెల్లూరు బ్యారేజ్ నుంచి 2019–20లో 45.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలిశాయంటే ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్చిందో అంచనా వేయవచ్చు. వరద ఉద్ధృతికి బ్యారేజ్‌కు ఎగువన ఆయకట్టుకు నీళ్లందించడం కోసం తాత్కాలికంగా నిర్మించిన కాఫర్ డ్యామ్ (మట్టికట్ట) దెబ్బతిన్నది. వరదలు తగ్గాక మళ్లీ మట్టికట్టను సరిచేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్ పనులు చేయడం సవాల్‌గా మారింది. ఈ తీవ్ర ప్రతికూలతల్లోనూ బ్యారేజ్‌లో రెండు మీటర్ల మందంతో 57 పియర్లను ప్రభుత్వం పూర్తి చేసింది. 57 పియర్ల మధ్య పది మీటర్ల ఎత్తు, మూడు మీటర్ల వెడల్పుతో 43 గేట్లు, కోతకు గురై వచ్చిన మట్టిని దిగువకు పంపడానికి పది మీటర్ల ఎత్తు, 4.3 మీటర్ల వెడల్పుతో 8 గేట్లు (స్కవర్ స్లూయిజ్ గేట్లు) వెరసి 51 గేట్లను ఏర్పాటు చేసింది. గేట్లను ఎత్తడం, దించడానికి వీలుగా ఎలక్ట్రిక్ విధానంలో హాయిస్ట్‌ను ఏర్పాటు చేసింది. బ్యారేజ్‌కు 22 మీటర్ల ఎత్తులో 1.2 మీటర్ల మందం, 7.5 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని నిర్మించారు. సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువలకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌ను పూర్తి చేశారు. బ్యారేజ్‌లో 0.4 టీఎంసీలను నిల్వ చేయడానికి వీలుగా కుడి, ఎడమ కరకట్టలను పటిష్టం చేసేందుకు రూ.77.37 కోట్లను ఖర్చు చేశారు. నూతన అధ్యాయం.. నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కలను సాకారం చేస్తూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పనులు ప్రారంభిస్తే ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ బ్యారేజీని పూర్తి చేశారు. ఈనెల 6న నెల్లూరు బ్యారేజ్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేసి చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించనున్నారు. ఆయకట్టుకు సమృద్ధిగా నీటితోపాటు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. నెల్లూరు–కోవూరు మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది. – అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి పెరగనున్న భూగర్భ జలమట్టం.. నెల్లూరు బ్యారేజ్‌ను ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కరోనా, వరదలు లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పనులు కొనసాగాయి. సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాబు మార్గదర్శకాల మేరకు సవాల్‌గా తీసుకుని పెన్నా బ్యారేజ్‌ను పూర్తి చేశాం. ఆయకట్టుకు సమృద్ధిగా నీటి సరఫరాతోపాటు బ్యారేజ్‌లో నిత్యం 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలమట్టం పెరుగుతుంది. సాగు, తాగునీటి సమస్యకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారాన్ని చూపారు. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ. వరద ఉద్ధృతిలోనూ.. పెన్నా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో గత మూడేళ్లుగా భారీ వరదలు వచ్చాయి. మట్టికట్ట కొట్టుకుపోవడంతో దాన్ని సరిచేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్ పనులు పూర్తి చేయడం సవాల్‌గా మారింది. వరద ఉద్ధృతిని అధిగమించి సీఎం జగన్ నిర్దేశించిన గడువులోగా బ్యారేజ్‌ను పూర్తి చేశాం. ఈ బ్యారేజ్ పూర్తవ్వడంతో నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కల నెరవేరుతోంది. – హరినారాయణరెడ్డి, సీఈ, తెలుగుగంగ -
Sangam Barrage: చెప్పాడంటే.. చేస్తాడంతే..
సంగం బ్యారేజీ.. జిల్లా రైతాంగానికి వరప్రసాదిని. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈప్రాజెక్ట్‌ను పూర్తిచేసి తన హయాంలో రైతాంగానికి అంకితం చేసేందుకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తపించారు. ఆ కల నెరవేరకుండానే దూరమయ్యారు. సంగం బ్యారేజీకి తన స్నేహితుడు, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా శాసనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. చదవండి: అదుపులోకి విద్యుత్ కొరత సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు నియోజవర్గంలోని సంగం బ్యారేజీకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నామకరణం చేస్తూ తెలుగుగంగ చీఫ్ ఇంజినీర్ ప్రత్యేక జీఓ జారీ చేశారు. ‘మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ’గా శాసనం అయింది. గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న అకాల మరణం చెందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అంత్యంత సన్నిహితుడు, సంగం బ్యారేజీ కోసం తపన పడిన గౌతమ్‌రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని భావించారు. చేస్తానని చెప్పాడు.. శాసనసభలో శాసనం చేశాడు. ఈ మేరకు ఇంజినీరింగ్ శాఖ అధికారులు ‘మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ’గా నామకరణం చేస్తూ మంగళవారం ప్రత్యేక జీఓ 13 జారీ చేశారు. సంగం బ్యారేజీ నిర్మాణం ఇలా సోమశిల జలాశయం నుంచి వచ్చే వృథా జలాలు సముద్రం పాలవకుండా సంగం వద్ద 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2014 లోపు దాదాపు 50 శాతం మేర పనులు పూర్తయ్యాయి. టీడీపీ హయాంలో బ్యారేజీ పనులు మందగించాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రాజెక్టుకు మోక్షం కలిగింది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సంగం బ్యారేజీ ఉండడంతో ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. త్వరలోనే సీఎంతో ప్రారంభోత్సవం సంగం బ్యారేజీ ఇప్పటికే దాదాపు 95 శాతం పూర్తి కావచ్చింది. కాంక్రీట్ వర్కు పూర్తి చేశారు. ఇక ఎర్త్ వర్క్ 3,461 క్యూబిక్ మీటర్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సరీ్వస్ గేట్స్ ఒకటి మాత్రమే పెండింగ్‌లో ఉంది. స్టాఫ్ లెగ్ గేట్స్ పైబ్రిగేషన్ పూర్తయింది, ఎరిక్సిన్ మాత్రం ఏడు పెండింగ్‌లో ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డితో ప్రారం¿ోత్సం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘సరస్వతీ’ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: సరస్వతి పంప్‌హౌస్‌లో నాణ్యత లేని పనులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ లేఖ రాశారు. అన్నారం సరస్వతి పంప్ హౌస్ నిర్మాణ వ్యయం ఎంత? ఎన్ని మోటార్లు అమర్చారు? అని లేఖలో ప్రశ్నించారు. పైపుల డ్యామేజీకి కారణాలేంటి? అని అడిగారు. నిబంధనలు పాటించని ఏజెన్సీపై.. పర్యవేక్షించాల్సిన ఇంజనీర్‌పై ఎలాంటి చర్యలు చేపట్టారు? అని నిలదీశారు. అన్నారం సరస్వతి పంప్ హౌస్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని రాజనర్సింహ డిమాండ్ చేశారు. -
సరదాగా బ్యారేజీ సందర్శనకు వెళ్లిన కుటుంబం.. అంతలోనే..
సాక్షి, మంథని(కరీంనగర్): తొలి పండుగ వేళ సరదా కోసం బంధువులతో కలిసి బ్యారేజీ సందర్శనకు వచ్చిన ఓ బాలుడు నదిలో మునిగి విగతజీవిగా మారడం ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీ దిగువ నీటిలో మునిగి హైదరాబాద్‌లోని లాల్గూడ మల్కాజ్‌గిరికి చెందిన నెరిమెట్ల సాయిష్(16) మృతి చెందాడు. మంథని ట్రైనీ ఎస్సై అజయ్ కథనం ప్రకారం గోదావరిఖనిలోని తన బంధువు ఇంట్లో శుభకార్యం ఉండడంతో సాయిష్ ఈనెల16న వచ్చాడు. ఏకాదశి సందర్భంగా తన బంధువులతోపాటు మరి 10మంది కలిసి మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీ సందర్శనకు వచ్చారు. ప్రాజెక్టు వద్ద కాసేపు కాలక్షేపం చేశారు. అయితే సాయిష్ బ్యారేజీ గేట్ల వైపు ఉన్న నీటిలో స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తు అందులోనే మునిగాడు. కాపాడేందుకు ప్రయత్నించగా నీటి గుంత కావడంతో ఫలితం లేకుండా పోయింది. అప్పటివరకు తమతోపాటు కలివిడిగా ఉన్న సాయిష్ విగత జీవిగా మారడంతో వెంట వచ్చిన వారి రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి అనిల్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. బ్యారేజీ దిగువన గుంతలున్న సమాచారం లేకపోవడంతో గతంలో కూడా పలువురు మృతి చెందారు. అటు వైపుగా వెళ్లకుండా భద్రతా సిబ్బంది నియంత్రించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి. -
జాతరను తలపిస్తున్న పార్వతి బ్యారేజి ప్రాంతం
-
అక్టోబర్ నాటికి సంగం బ్యారేజీ పనులు పూర్తి
సాక్షి, నెల్లూరు: అక్టోబర్ నాటికి సంగం బ్యారేజీ పనులను పూర్తి చేసి..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభిస్తామని మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం బ్యారేజీ పనులను మంత్రులను పరిశీలించారు. మంత్రులతో పాటు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాలెం సుధీర్‌కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
వైకుంఠాపురం బ్యారేజీ పనుల్లో అవినీతి వరద
-
వరదలతో నాణ్యత దెబ్బతిందా?
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీని శనివారం రాష్ట్ర క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ బి.వెంకటేశ్వర్లు పరిశీలించారు. 15 రోజులుగా కురిసిన వర్షాలకు భారీగా వరదలు రావడంతో బ్యారేజీ పిల్లర్ల వద్ద నీరు చేరి ఇసుక మేటలు వేసిన విషయం తెలిసిందే. వరదల కారణంగా బ్యారేజీ, గేట్ల నిర్మాణ పనుల్లో నాణ్యతకు ఏమైనా సమస్య తలెత్తిందా అనే అంశంపై ఇంజనీర్లతో చర్చించారు. ఎస్సారెస్పీ నిండితే ప్రవాహం ఇక్కడ పెరుగుతుంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.. అనే విషయాల గురించి తెలుసుకున్నట్లు సమాచారం. బ్యారేజీ నిర్మాణ ప్రాంతంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర కప్పి వేసిన ఇసుక మేటలను పరిశీలించి ఇంజనీర్లకు పలు సలహాలు, సూచనలు చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించి నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఆయన వెంట క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ శ్రీనివాసరావు, ఈఈ రఘురాం, ఇరిగేషన్ ఈఈ మల్లికార్జున్‌ప్రసాద్, డీఈఈ యాదగిరి, ప్రాజెక్టు మేనేజర్ శేఖర్‌దాస్ తదితరులు ఉన్నారు. -
కృష్ణమ్మ కట్టడికి మరో ఎత్తు!
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాలను ఎగువనే కట్టడి చేసేందుకు కర్ణాటక మరో ఎత్తు వేస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా వాడుకునేందుకు కొత్త బ్యారేజీలను నిర్మిస్తోంది. ఇప్పటికే గుజాల్ బ్యారేజీ నిర్మించిన ఆ రాష్ట్రం.. తాజాగా గుర్జాపూర్ బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టింది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ వంటి ప్రాజెక్టులు నిండితే కానీ దిగువకు నీళ్లు రాని పరిస్థితుల నేపథ్యంలో కొత్త బ్యారేజీలతో రాష్ట్రానికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే నాలుగు.. అదనంగా రెండు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు కృష్ణా జలాల్లో కర్ణాటకకు 734 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. కర్ణాటక ఇప్పటికే ఆ నీటిని దాదాపు పూర్తిగా వినియోగించుకుంటోంది. అదనంగా నీటిని వినియోగించుకునేందుకు పదేళ్ల కింద బీజాపూర్ జిల్లాలో బుధిహాల్–పీరాపూర్, రాయచూర్ జిల్లాలో నందవాడ్జి, రామత్తల్, భగల్‌కోట్ జిల్లాలోని తిమ్మాపూర్‌ల వద్ద కృష్ణా నదిపై నాలుగు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించింది. 21 టీఎంసీల నీటిని తీసుకుని 1.29 లక్షల హెక్టార్లకు అందించాలన్నది వాటి లక్ష్యం. అయితే ఆ ప్రాజెక్టుల పనులు చేపట్టినా వాటికి ఎలాంటి అనుమతులు, నీటి కేటాయింపులు లేకపోవడంతో నిర్వహణలోకి తేలేకపోయింది. కానీ పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అధికారిక అనుమతులు ఇచ్చిన వెంటనే తమ ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియను వేగిరం చేసింది. గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తూ పోలవరం చేపట్టిన వెంటనే ఎగువ రాష్ట్రాలకు 35 టీఎంసీల మేర వాటాలు దక్కుతాయని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో స్పష్టంగా ఉంది. ప్రస్తుతం ఏపీ పోలవరం చేపట్టడంతో కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు దక్కుతాయి. దీంతో తమకు దక్కే 21 టీఎంసీల వినియోగం కోసమే ఈ పథకాలను చేపట్టినట్లు చూపి ఇటీవలే కర్ణాటక అన్ని అనుమతులు తెచ్చుకుంది. తాజాగా నీటి వినియోగాన్ని కూడా మొదలుపెట్టింది. ఈ ఎత్తిపోతల పథకాలు పాలమూరు జిల్లాకు ఎగువనే ఉండటంతో ఇప్పటికే దిగువకు ప్రవాహాలు తగ్గాయి. ఇక ప్రధాన కృష్ణాలో గుజాల్ బ్యారేజీని నిర్మించి దీని ద్వారా నాలుగైదు టీఎంసీలు వినియోగించుకునేందుకు యత్నిస్తోంది. మరోవైపు రాయచూర్ జిల్లాలో కృష్ణా నీటిని వాడుకునేలా 1.2 టీఎంసీ సామర్థ్యంతో గుర్జాపూర్ బ్యారేజీ నిర్మిస్తోంది. దీని ద్వారా 5 నుంచి 6 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది. మొత్తంగా 10 నుంచి 11 టీఎంసీలను ఎగువనే అడ్డుకునేందుకు కర్ణాటక యత్నిస్తోంది. దీంతో జూరాలకు వచ్చే ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోతాయి. అదే జరిగితే జూరాలపై ఆధారపడిన కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పథకాలకు నీరు లేక అల్లాడాల్సిన పరిస్థితి తలెత్తనుంది. సీడబ్ల్యూసీకి ఫిర్యాదు కర్ణాటక బ్యారేజీలపై ఆలస్యంగా మేల్కొన్న రాష్ట్ర నీటి పారుదల శాఖ కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గురువారం ఈఎన్సీ మురళీధర్ సీడబ్ల్యూసీకి లేఖ రాశారు. హైడ్రాలజీ క్లియరెన్స్‌లు వచ్చే వరకు నీటి వినియోగం జరగకుండా చూడాలని, గుర్జాపూర్ బ్యారేజీ నిర్మాణం జరగకుండా ఆదేశాలివ్వాలని కోరారు. -
చనాఖా-కోరటా బ్యారేజీ సందర్శించిన సీఎం కేసీఆర్
-
బ్యారేజీ....డామేజీ....?
ధవళేశ్వరం ఆనకట్ట భద్రత గాలికి నిషేధాజ్ఞలున్నా భారీ వాహనాల రాకపోకలు చెక్ పోస్టులున్నా ’చెకింగ్’ శూన్యం శ్లాబు పెచ్చులూడి గోతులు ప్రశ్నార్ధకమవుతున్న బ్యారేజీ పటిష్టత మర్మమతులు చేయని ప్రభుత్వం 1982 బ్యారేజీ కం బ్రిడ్జి ప్రారంభం ధవళేశ్వరం వద్ద బ్యారేజీ కం బ్రిడ్జిని 1982 అక్టోబర్ 29న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జాతికి అంకితం చేశారు. 1969లో దీని నిర్మాణ వ్యయం రూ.26.59 కోట్లు కాగా తర్వాత అది రూ.70 కోట్లకు పెరిగింది. బ్యారేజీ పనులు పూర్తయ్యే సమయానికి (ఆనకట్టతో కలుపుకుని) రూ.150 కోట్లకు చేరింది. 500 పనిచేసిన ఇంజినీర్లు ముంబాయికి చెందిన నేషనల్ ప్రాజెక్ట్సు కనస్ట్రక్షన్ కంపెనీ (ఎన్పీïసీసీ) ఆ«ధ్వర్యంలో నిర్మాణం జరిగింది. సెంట్రల్ వాటర్ కమిషన్ న్యూఢిల్లీ, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ హైదరాబాద్‌లు కన్సటెంట్స్గా వ్యవహరించాయి. అప్పట్లో ఐదువందల మంది ఇంజినీర్లు, 1,500 మంది టెక్నికల్ సిబ్బంది పనిచేశారు. 300 వంతెనపై రోజుకు తిరిగే వాహనాలు 2001 నుంచి బ్యారేజీ భద్రతను దృష్టిలో ఉంచుకుని భారీ వాహనాల రాకపోకలు నియంత్రించారు. ప్రస్తుతం కార్లు, బస్సులు, ఇతర మినీ వాహనాలు రోజుకు సుమారు మూడు వందల వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. 10.13 లక్షలు ఆయకట్టు ఎకరాలలో భారీ వాహనాల రాకపోకల పూర్తి నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. లేకపోతే బ్యారేజీ బేరింగ్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బ్యారేజీ భద్రత ఎంతో ముఖ్యం. ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపకపోతే జాతీయ కట్టడం శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉంది. కొవ్వూరు: ఉభయ గోదావరి జిల్లాలకు తలమానికంగా ఉన్న ధవళేశ్వరం బ్యారేజీ పటిష్టత ప్రశ్నార్థకంగా మారింది. సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టను స్వాతంత్య్రానికి పూర్వమే నిర్మించిన విషయం తెలిసిందే. ఆనకట్టను అనుకుని 1982లో బ్యారేజీ కం బ్రిడ్జిని నిర్మించారు. దశాబ్దాలుగా సేవలందిçస్తున్న ఈ వారధిపై భారీ వాహనాల రాకపోకలకు నిషేధాజ్ఞలు ఉన్నా ఆచరణకు నోచుకోవడం లేదు. 2001లో ఈ బ్యారేజ్‌ను సందర్శించిన నిపుణుల కమిటీ ఇది అత్యంత ప్రమాదకరంగా ఉందని నిర్ధారించింది. కాంక్రీట్ నిర్మాణం కూడా పలుచోట్ల పెచ్చులు ఊడుతున్నట్టు గుర్తించారు. దాంతో ఈ బ్యారేజీపై నుంచి భారీ వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. నీటిపారుదల శాఖ అధికారులు ఆనకట్టకు రెండు వైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సిబ్బందిని కాపలా పెట్టారు. అయితే సిబ్బంది చేతివాటంతో రాత్రి పూట భారీ వాహనాలు గుట్టుచప్పుడు కాకుండా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇటీవల ధవళేశ్వరం వైపు అధిక సంఖ్యలో వెళుతున్న భారీ వాహనాలను గుర్తించి మద్దూరులంక గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో బండారం బయట పడింది. బ్యారేజీపై పదిటన్నుల సామర్ధ్యం మించిన వాహనాలకు అనుమతి లేదు. అయినప్పటికీ కొందరు అధికారులు, సిబ్బంది సహకారంతో యాభై, ఆరవై టన్నుల సామర్ధ్యం కలిగిన భారీ వాహనాలు పట్టపగలు వెళుతుండడాన్ని గుర్తించి స్ధానికులు అడ్డుకున్నారు. నీటి పారుదలశాఖ పనులు నిమిత్తం వస్తున్న లారీలు కావడంతో అనుమతించినట్టు అధికారులు సమర్ధించుకుంటున్నారు. నిడదవోలుకి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధికి చెందిన భారీ వాహనాలు బ్యారేజీపై నుంచే నిత్యం రాకపోకలు సాగిస్తున్నట్టు సమాచారం. కాకినాడ నుంచి వచ్చే వారి వాహనాలకు ఈ మార్గం దగ్గరగా ఉండడంతో అధికారులను బెదిరించి మరీ రాకపోకలు సాగిస్తున్నట్టు చెబుతున్నారు. మరమ్మతులకు నోచుకోని బ్యారేజీ: సీతంపేట నుంచి ధవళేశ్వరం వరకు ఎనిమిది కిలో మీటర్లు దూరం ఏర్పాటు చేసిన రోడ్డు పలు చోట్ల దెబ్బతింది. 3.5 కిలో మీటర్లు పొడవున నాలుగు అంచెలుగా బ్యారేజి మీదుగా రాకపోకలు సాగించేందుకు ఏర్పాటు చేíసిన రహదారి భారీ వాహనాలతో దెబ్బతింతోంది. రెండేళ్ల కిత్రం పుష్కరాల సమయంలో పూర్తిగా దెబ్బతిన్న బ్యారేజీపై రోడ్డును పునర్ నిర్మాణం చేశారు. ప్రస్తుతం పలుచోట్ల శ్లాబు పెచ్చులూడి గోతులు పడుతున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో ఈ గోతులు మరింత పెద్దవి కావడమే కాకుండా బ్యారేజీ పటిష్టత దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతోంది. ప్రయివేటు సెక్యూరిటీ ఏర్పాటు: భారీ వాహనాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. బ్యారేజీ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏడాదిపాటు పనిచేసే ఒప్పందంతో ప్రయివేటు సెక్యూరిటీని నియమించాం. ఆనకట్టకు ఇరువైపులా చెక్‌పోస్టులు నిర్వహిస్తాం. ఆగష్టు మొదటి వారం నుంచి ప్రయివేటు సెక్యూరిటీ అందుబాటులోకి వస్తుంది. బ్యారేజీ రోడ్డు దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేయిస్తాం. పలు చోట్ల మరమ్మతులతో పాటు కాంక్రీటు వేయాల్సి ఉంది. దీనికి రూ.4 లక్షలు కేటాయించాం. ఎన్.కృష్ణారావు, ఈఈ, గోదావరి హెడ్‌వర్స్,ధవళేశ్వరం -
4.89 లక్షల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల
ధవళేశ్వరం : గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కాటన్ బ్యారేజ్ వద్ద బుధవారం గోదావరి ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. దీంతో మిగులు జలాల విడుదలను పెంచారు. బుధవారం సాయంత్రం కాటన్ బ్యారేజ్ నుంచి 4,88,639 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద బుధవారం సాయంత్రం 9.60 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. తూర్పు డెల్టాకు 3,500 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2,200 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 6.49 మీటర్లు, పేరూరులో 8.07 మీటర్లు, దుమ్ముగూడెంలో 8.50 మీటర్లు, భద్రాచలంలో 31.30 అడుగులు, కూనవరంలో 11.13 మీటర్లు, కుంటలో 5 మీటర్లు, కొయిదాలో 15.10 మీటర్లు, పోలవరంలో 10.10 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.79 మీటర్లు చొప్పున గోదావరిలో నీటిమట్టం ఉందని అధికారులు వివరించారు. -
2017 నాటికి బ్యారేజ్‌లు పూర్తి
చీఫ్ ఇంజనీరు సుధాకర్‌బాబు సంగం : 2017 మార్చి నాటికి నెల్లూరు, సంగం బ్యారేజీ నిర్మాణాలను పూర్తిచేసి జిల్లా రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీరు ఇచ్చి ఆదుకుంటామని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చీఫ్ ఇంజనీరు సుధాకర్‌బాబు తెలిపారు. మండల కేంద్రమైన సంగం పెన్నానదిలో నిర్మాణం జరుగుతున్న సంగం బ్యారేజీ, కనుపూరుకాలువ హెడ్‌రెగ్యులేటర్‌ను మంగళవారం ఆయన జిల్లా ఎస్ఈ కోటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యారేజీ మ్యాప్‌ను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట ఈఈ రమణ, బ్యారేజ్ ఇంజనీరు బాలాజీ సింగ్ ఉన్నారు.