4.89 లక్షల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల
Published Wed, Oct 12 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
ధవళేశ్వరం :
గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కాటన్ బ్యారేజ్ వద్ద బుధవారం గోదావరి ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. దీంతో మిగులు జలాల విడుదలను పెంచారు. బుధవారం సాయంత్రం కాటన్ బ్యారేజ్ నుంచి 4,88,639 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద బుధవారం సాయంత్రం 9.60 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. తూర్పు డెల్టాకు 3,500 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2,200 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 6.49 మీటర్లు, పేరూరులో 8.07 మీటర్లు, దుమ్ముగూడెంలో 8.50 మీటర్లు, భద్రాచలంలో 31.30 అడుగులు, కూనవరంలో 11.13 మీటర్లు, కుంటలో 5 మీటర్లు, కొయిదాలో 15.10 మీటర్లు, పోలవరంలో 10.10 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.79 మీటర్లు చొప్పున గోదావరిలో నీటిమట్టం ఉందని అధికారులు వివరించారు.
Advertisement