
సాక్షి, హైదరాబాద్: అన్నారం బ్యారేజీ వద్ద నెలకొన్న పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కల్వకుంట్ల ‘స్కామేశ్వరం’లో మరో మైలురాయి అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ నిన్న మేడిగడ్డ.. నేడు అన్నారం అంటూ ‘ఎక్స్’వేదికగా వ్యాఖ్యానించారు. అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు అని విమర్శించారు.
‘ప్రాజెక్టు అంటే నీ ఫామ్ హౌస్‌కు ప్రహరీ గోడనుకున్నావో.. నీ మనవళ్లు ఆడుకునే ఇసుక గూళ్లు అనుకున్నావో.. రూ. లక్ష కోట్ల ప్రజల సొమ్మును మింగేసి, నాలుగు కోట్ల జనం నోట్లో మట్టిగొట్టావు’అని సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ‘వందేళ్లకు పైగా ఉండాల్సిన నిర్మాణాలు, ఇలా కండ్లముందే కొట్టుకుపోవడానికి కారణం.. మందేసి నువ్వు గీసిన ఆ పనికిమాలిన డిజైన్లు.. రూ. లక్ష కోట్ల అవినీతి’అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
కల్వకుంట్ల 'స్కామేశ్వరం'లో మరో మైలు రాయి..
— Revanth Reddy (@revanth_anumula) November 1, 2023
నిన్న మేడిగడ్డ .. నేడు అన్నారం..
అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు..
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు..
ప్రాజెక్టు అంటే నీ ఫామ్ హౌజ్ కు ప్రహరీ గోడనుకున్నావో..
నీ మనవళ్ళు ఆడుకునే ఇసుక గూళ్లు అనుకున్నావో..
రూ.లక్ష కోట్ల ప్రజల… pic.twitter.com/JC5NKgKaC4
Comments
Please login to add a commentAdd a comment