ఏసు ప్రేమ | Jesus love Solution | Sakshi
Sakshi News home page

ఏసు ప్రేమ

Jul 31 2015 1:05 AM | Updated on Sep 3 2017 6:27 AM

ఏసు ప్రేమ

ఏసు ప్రేమ

నేటి సమాజంలో నెలకొంటున్న సమస్యలకు ఏసు ప్రేమే పరిష్కారం అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘సంగమం’.

నేటి సమాజంలో నెలకొంటున్న సమస్యలకు ఏసు ప్రేమే పరిష్కారం అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘సంగమం’. రాజ్ ప్రధాన పాత్రలో సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జె. జాన్‌బాబు దర్శకత్వంలో టి. సుధాకర్ నిర్మిస్తున్నారు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘ప్రస్తుతం జీసస్ పాత్ర కోసం నటుణ్ణి ఎంపిక చేస్తున్నాం.
 
 అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే చిత్రం ఇది. సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలోనే జరుగుతుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్.పి. పట్నాయక్, కథ-మాటలు: టి. ప్రభుకిరణ్, కథా సహకారం: వి.ఎమ్.ఎమ్. ప్రవీణ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement