ఏసు ప్రేమ
నేటి సమాజంలో నెలకొంటున్న సమస్యలకు ఏసు ప్రేమే పరిష్కారం అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘సంగమం’. రాజ్ ప్రధాన పాత్రలో సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జె. జాన్‌బాబు దర్శకత్వంలో టి. సుధాకర్ నిర్మిస్తున్నారు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘ప్రస్తుతం జీసస్ పాత్ర కోసం నటుణ్ణి ఎంపిక చేస్తున్నాం.
అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే చిత్రం ఇది. సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలోనే జరుగుతుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్.పి. పట్నాయక్, కథ-మాటలు: టి. ప్రభుకిరణ్, కథా సహకారం: వి.ఎమ్.ఎమ్. ప్రవీణ్.