ట్యాంకర్‌ను ఢీకొన్న టిప్పర్
తప్పిన ప్రమాదం
సంగం : సంగం చెక్‌పోస్ట్ మలుపులో ముందువెళ్తున్న సిమెంట్ ట్యాంకర్‌ను టిప్పర్ ఢీకొని బోల్తా పడి ప్రమాదం తప్పిన సంఘటన సోమవారం జరిగింది. వివరాలు.. సంగం చెక్‌పోస్ట్ సెంటర్‌లో ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్‌ను గ్రావెల్‌తో సిద్దీపురం వెళ్తున్న టిప్పర్ ఢీకొంది. దీంతో టిప్పర్ బోల్తాపడింది. సిమెంట్ ట్యాంకర్ స్వల్పంగా ధ్వంసమైంది. టిప్పర్ ట్యాంకర్‌ను ఢీకొన్న సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది.