ఐటీఐ నిర్మాణం చేపట్టాలని ధర్నా | constuct iti college | Sakshi
Sakshi News home page

ఐటీఐ నిర్మాణం చేపట్టాలని ధర్నా

Published Wed, Jul 27 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

constuct iti college

 
 
సంగం : మండల కేంద్రమైన సంగం తిరుమనకొండ కాశీ విశేశ్వరస్వామి సమేత రాజరాజేశ్వరిదేవి ఆలయ సమీపంలో ఐటీఐ నిర్మాణపనులను ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్‌ నుంచి బస్టాండ్‌ సెంటర్‌ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు ప్రసాద్‌ మాట్లాడుతూ కళాశాలకు స్థలం కేటాయించి నాలుగేళ్లయినా ఇంకా నిర్మాణం చేపట్టకపోవడం దారుణమన్నారు. పలుమార్లు దీనిపై అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండాపోయిందన్నారు. ధర్నాతో నెల్లూరు – ముంబై రోడ్డుపై ఇరువైపులా రాకపోకలు స్థంభించాయి. పోలీసుల చొరవతో ధర్నా విరమించారు. నాయకులు వెంకటరమణ, హరి, వెంకటేష్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement