అన్నదాతకు తెగుళ్ల బెడద
సంగం : ఆలస్యంగా వరి నాట్లు ప్రారంభించిన అన్నదాతలు తమ పంటకు మైక్స్ (ఆకునల్లి తెగులు) బెడద తగలడంతో ఆందోళన చెందుతున్నారు. మండలంలోని దువ్వూరు, మర్రిపాడు, ఎండాదిబ్బ, పడమటిపాలెం, మత్తాపురం, అల్లారెడ్డిపాలెం, సంగం, పొలామెర్లి, తరుకుడుపాడు, వెంగారెడ్డిపాడు గ్రామాల్లో ఈ సంవత్సరం ఆలస్యంగా 4వేల ఎకరాలకు పైగా వరిపంటను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఈ పంట పిలకకట్టే దశలో ఉంది. ఈ దశలో మైక్స్ చూపడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరిపంట ఆకులను మైక్స్ సోకి రసం మొత్తం పీల్చివేసి ఆకులను నిమ్మపండు రంగులోనికి తెస్తున్నాయి. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని అన్నదాతలు వాపోతున్నారు. మైక్స్ నివారణ కోసం పురుగు ముందల దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. ప్రతిఒక్కరు పొలాల్లో పురుగు మందులు పిచికారీ చేస్తూ బిజీగా ఉన్నారు.
నివారణ చర్యలు చేపట్టండి : శైలజాకుమారి వ్యవశాయశాఖాధికారి, సంగం
మండలంలో ఆలస్యంగా సాగుచేసిన వరి పంటకు మైక్స్ సోకుతోంది. దీని నివారణ కోసం నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేకుంటే లీటర్ నీటికి డైకోపాల్ ద్రావణాన్ని 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి.