సంగం : కష్ణా పుష్కరాలలో విధులు నిర్వహిస్తున్న సంగంకు చెందిన మహిళా హోంగార్డ్ వినీల బుధవారం మూగబాలుడి ప్రాణాలు కాపాడి పోలీసు రివార్డు ప్రజల ప్రశంసలు పొందారు.
సంగం హోంగార్డుకు ప్రశంసలు
Aug 17 2016 11:48 PM | Updated on Sep 4 2017 9:41 AM
సంగం : కష్ణా పుష్కరాలలో విధులు నిర్వహిస్తున్న సంగంకు చెందిన మహిళా హోంగార్డ్ వినీల బుధవారం మూగబాలుడి ప్రాణాలు కాపాడి పోలీసు రివార్డు ప్రజల ప్రశంసలు పొందారు. కష్ణా పుష్కరాల సందర్భంగా సంగం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డు వినీలను గుంటూరు జిల్లాలోని సీతానగర్‌ఘాట్ విధుల నిమిత్తం నియమించారు. బుధవారం గుడివాడకు చెందిన మురళీ (7) అనే మూగ బాలుడు కష్ణా నదిలో స్నానం చేస్తూ లోతుకి వెళ్లి మునిగిపోయాడు. ఇది గమనించిన వినీల నదిలోకి దూకి మురళీ ప్రాణాలను కాపాడింది. విషయం తెలిసుక్ను డీజీపీ నందూరి సాంబశివరావు ఆదేశాలతో గుంటూరు ఎస్పీ త్రిపాఠి వినీలకు నగదు రివార్డు అందజేశారు.
Advertisement
Advertisement