ఆచరణ రూపంలో ‘హిందుత్వ’
ధనశక్తితో ప్రపంచాన్ని శాసించగలమని నమ్మే దేశాలు లోక కల్యాణానికి భంగం కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయస్థాయిలో మన వాణిని వినిపించగల నాయకత్వం నేడు అవసరం. అటువంటి నాయకత్వం హిందూ సమాజం నుండి రావాలని ప్రపంచం ఎదురు చూస్తోంది.
ఈ విజయదశమి నాడు ‘రాష్ట్రీయ స్వయం సేవక సంఘం’ (ఆర్‌ఎస్‌ఎస్) ఎనభై తొమ్మిదేళ్లను పూర్తి చేసుకొని తొంభైయ్యవ పడిలో ప్రవేశించనుంది. 1925లో నాగపూర్‌లో చిన్న సంస్థగా ప్రారంభమైన ‘సంఘం’ నేడు దేశ వ్యాప్త నిర్మాణంగా విస్తరించింది, దేశ హితం కోరే వారందరికి విశ్వాస కేంద్రమై నిలిచింది. ఒకప్పుడు సంఘం అంటే శాఖ. శాఖ అంటే కార్యక్రమం. నేడు అది దానికే పరిమితం కాలేదు.
మన సమాజ ధర్మం, సంస్కృతుల పట్ల శ్రద్ధ వహిస్తూ, హిందూ సమాజం తన సమస్యలను తానే పరిష్కరించుకోగలదనే విశ్వాసాన్ని పాదుకొల్పుతున్నది. హిందూ సమాజం తన సమస్యలకు ఎవరినో కార ణంగా చూపటం, దానిపై వాదోపవాదాలు చేయటం వల్ల ఉపయోగం లేదు. హిందువులంతా ఒకే విధంగా స్పందించి, పని చేయటం నేర్చుకోవాలి. ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకులు దేశమంతటా ఇలా ఒకే విధంగా స్పందించడం కనిపి స్తోంది. ఆ స్పందనే విశ్వాసాన్ని నిర్మిస్తున్నది. అందుకే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా అశేష ప్రజానీకం బాధితు లకు చేసే ధన, వస్తు రూప సహాయాన్ని స్వయం సేవకుల చేతుల్లో ఉంచుతోంది.
స్వాతంత్య్రం సిద్ధించి 67 ఏళ్లు పూర్తయినా దేశంలో రాజకీ య స్థిరత్వం నెలకొన లేదు. ప్రాంతీయ పార్టీల, భావనల ప్రభావం ప్రబలంగా ఉంటోంది. ఈ పరిస్థితిలో జాతీయ భావా లను బలోపేతం చేయాల్సి ఉంది. ‘‘జాతీయవాదులు కూడా దేశ హితానికి, సామ్రాజ్యవాదుల హితానికి మధ్య తేడాను సరిగా గుర్తించకపోవడం శోచనీయం... నేటి మన రాజకీయా లలో ఎన్నో లోపాలున్నాయి. వాటిని తొలగించుకోవడానికి సామూహిక ప్రయత్నం అవసరం’’ అని 1919 లోనే ఆర్‌ఎస్ ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ రావ్ బలిరామ్ హెగ్డేవర్ అన్నా రు. నాటికి, నేటికి మన జాతీయవాదుల తీరు పెద్దగా మారింది లేదు. వ్యక్తిగతమైన, మతపరమైన, పార్టీ పరమైన ప్రయోజనా లకు ప్రాధాన్యం ఇస్తూ జాతీయ ప్రయోజనాలను పట్టించుకోక పోయే ధోరణి బలంగా ఉంది.
నేటి రాజకీయాలలోని దిగజారు డుతనాన్ని అధిగమించగలగాలంటే రాజకీయ నేతలు ఆచి తూచి వ్యవహరించేలా చేయగల బలీయమైన ఒక సామాజిక శక్తి నిర్మాణం కావాలి. సామ్రాజ్యవాదులు నేడు ఏ దేశాన్ని పూర్తి వలసగా మార్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి 1. వాణిజ్య సంబం ధాలను పెంపొందింపజేసుకోవడం, 2. ఆయా దేశాలలో తమ వంధిమాగధులను తయారు చేసుకోవడం, 3). ప్రభుత్వాలపై రాజకీయ వత్తిడి పెంచటం వంటి పద్ధతులను అవలంబిస్తు న్నాయి. ఈ విషయంలో మనం జాగరూకత వహించడం అవ సరం. మతతత్వ శక్తుల ఎత్తుగడల ప్రభావంతో సెక్యులర్ మేధావులు, ఉదారవాదులు ఆర్‌ఎస్‌ఎస్‌ను మతతత్వ సంస్థగా చిత్రీకరిస్తుంటారు. రాజకీయ నాయకులు రాజకీయ లక్ష్యం గలి గిన సంస్థగా భావిస్తుంటారు.
ఇలా ఏర్పడిన గుడ్డి వ్యతిరేకతను ఎదుర్కొంటూనే సంఘం తనపనిని తాను చేసుకుంటూ ముం దుకుపోతోంది. సంఘం వ్యక్తులలో జాతీయ భావనను పెం పొందింపజేయడం మాత్రమే కాదు క్రమశిక్షణను పెంపొందిం పజేస్తోంది. వివేచన, కార్యదీక్షాదక్షతలను కలిగిన వేలాది మం ది కార్యకర్తలను దేశానికి అందిస్తోంది. అందుకే పలు సామా జిక, ధార్మిక, ఆధ్యాత్మికసంస్థలు సంఘంతో కలసిపనిచేయడా నికి ముందుకు వస్తున్నాయి. ఇది ఒక మంచి పరిణామం.
నేటి ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో భారత దేశమే కాదు.. యావత్ ప్రపంచం సామ్యవాద, పెట్టుబడిదారీ విధానాలకు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తోంది. అందుకే నేడు దీనదయాళ్‌జీ ‘ఏకాత్మతా మానవతావాదం’ విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. క్రీడాభారతి, విద్యాభారతి, ఆరోగ్య భారతి వంటి పలు సంస్థల ద్వారా చేస్తున్న కృషితో ఆర్‌ఎస్‌ఎస్ మన సమాజ మౌలిక వ్యవస్థలను, దేశాభివృద్ధిని, దేశ రక్షణను పటిష్టం చేయడానికి తన వంతు బాధ్యతలను నిర్వహిస్తోంది. దేశం బాధ్యత ప్రభుత్వాలది మాత్రమే కాదు, మనందరిది. ధన శక్తితో ప్రపంచాన్ని శాసించగలమని విశ్వసించే కొన్ని దేశాలు ప్రపంచ శాంతికి, లోక కల్యాణానికి భంగం కలిగిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో అంతరాత్జీయ స్థాయిలో మన వాణిని వినిపిం చగల నిర్ణయాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ రాజకీయ నాయకత్వం నేడు మనకు అవసరం. అటువంటి నాయకత్వం హిందూ సమాజం నుండి రావాలని కూడా ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితుల్లో సంఘం తన చారిత్రక కర్తవ్యాల పరిపూర్తికి మరింత దృఢదీక్షతో ముందుకు సాగాలనేదే ప్రజా హితం కోరే వారందరి కామన. నేడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 89వ వ్యవస్థాపక దినం.
(వ్యాసకర్త ‘సమాచార భారతి’ నిర్వాహకులు)
రాంపల్లి మల్లికార్జునరావు