Hindu Society
-
మనసంతా భరతమాత
-
నిందలను లెక్క చేయం... ఉండేది ప్రేమ భావమే
ఈ దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలపటమే లక్ష్యం. మనసు నిండా ప్రేమ భావం నింపుకొని అందరిలో కలుస్తాం.. అందరినీ కలుపుకొంటాం.. దేశాన్ని ఉన్నతంగా నిలిపే దీక్షలో సమాజంతో మమేకమై ముందుకు నడుస్తాం. అందరి కోసం పనిచేస్తాం.. ఇదే సంఘ్ ఉద్దేశం. – మోహన్ భాగవత్ సాక్షి, హైదరాబాద్ : ‘పేరు కోసం పాకులాడం, స్వార్థం కనిపించదు. ధన్యవాదాలను కూడా ఆశించం. ఈ దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలపటమే లక్ష్యం. మనసు నిండా ప్రేమ భావం నింపుకొని అందరిలో కలుస్తాం.. అందరినీ కలుపుకొంటాం.. దేశాన్ని ఉన్నతంగా నిలిపే దీక్షలో సమాజంతో మమేకమై ముందుకు నడుస్తాం. అందరి కోసం పనిచేస్తాం.. ఇదే సంఘ్ ఉద్దేశం. ఈ ప్రయాణంలో మాపై ఎన్ని నిందలు వచ్చినా.. ఎన్ని విమర్శలు ఎగసిపడ్డా లెక్క చేయం. అప్పుడప్పుడూ వాటికి స్పందిస్తూ మేం కొన్ని మాటలు అనొచ్చు.. కానీ మనసులో మాత్రం ప్రేమ భావమే ఉంటుంది. అందులో భరతమాతే కన్పిస్తుంది’అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్, సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సమస్త హిందూ సమాజాన్ని బాగు చేసే లక్ష్యంతో సంఘ్ ముందుకు సాగుతోందని, ఇందులో ఎన్ని అవరోధాలు ఎదురైనా లెక్కచేయకుండా కాగడాను తలకిందులు చేసినా, అందులోని మంట ఊర్ధ్యముఖంగా ఉన్నట్లే ముందుకు సాగుతామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో మూడు రోజులపాటు జరిగే విజయ సంకల్ప శిబిరంలో భాగంగా రెండో రోజైన బుధవారం సరూర్‌నగర్ మైదానంలో నిర్వహించిన సార్వజనీన సమ్మేళనంలో ఆయన స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను స్పృశిస్తూ సంఘ్ మూల సూత్రాన్ని వివరిస్తూ వారికి దిశానిర్దేశం చేశారు. సార్వజనీన సమ్మేళనానికి భారీగా హాజరైన స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, వ్యక్తిగత క్రమశిక్షణ, నైతిక విలువలు, విద్య, శాఖల విస్తరణే లక్ష్యంగా పాతికేళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ ఈ సభ నిర్వహించింది. ఈ సభకు పద్మశ్రీ బీవీఆర్ మోహన్‌రెడ్డి, వివిధ శాఖల ముఖ్య ప్రచారక్‌లు దక్షిణామూర్తి, రామకృష్ణారావు, సుందరయ్య, పానగిరి సుబ్బారెడ్డి, కృష్ణప్రసాద్, మంగేశ్, సుహాసన్రావు, తిప్పే స్వామిజీ, సుధీర్జీ, శ్యామ్‌ప్రసాద్, సీఆర్ ముకుంద్జీలు హాజరయ్యారు. మనసు నిండా భరతమాతే.. తన కంటే సమాజమే ముఖ్యమని, దాన్ని ప్రగతి పథంలో ఉండాలని కోరుకునే వారి అవసరం ఇప్పుడు ఉందని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. స్వాభిమానంతో సంఘటితంగా ప్రపంచానికి ఆదర్శంగా ఉండే హిందూ సమాజాన్ని నిర్మించటమే సంఘ్ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ పయనంలో సత్ఫలితం సాధించినప్పుడే ఆర్ఎస్ఎస్ విజయం సాధించినట్టని చెప్పారు. ‘ఈ భూమి నాది.. దాని శ్రేయస్సే నా శ్రేయస్సు అన్న భావనతో.. ఎలాంటి భేదభావం లేకుండా సమస్త ప్రజలు నావాళ్లు అన్న అభిప్రాయంతో.. భరతమాతనే ఆరాధ్య దైవంగా భావించే వారు హిందువులు’అని తేల్చిచెప్పారు. చిన్నారులు, యువత, మహిళలు, పురుషులు ఎవరినైనా ఆదర్శంగా తీర్చిదిద్దటమే తమ ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. నిత్యం ఓ గంట పాటు సంఘ్ కార్యకలాపాల్లో ఉండటమే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని సమాజం కోసం అర్పిస్తూ స్వయం సేవకులు ముందుకు సాగుతున్నారని కితాబిచ్చారు. దేవీదేవతల పూజలు పక్కన పెట్టి కేవలం భరతమాత ఆరాధనతో మాతృభూమి కోసం పనిచేస్తేనే మన దేశం విశ్వగురువు స్థానంలో నిలుస్తుందన్న వివేకానంద మాటలను తు.చ. తప్పకుండా పాటించేందుకు, ఆ మార్గంలో తాము పయనిస్తున్నామని స్పష్టం చేశారు. హిందూ, ముస్లింలు కీచులాడుకుని నాశనమవుతారని దేశం విడిచి వెళ్లేటప్పుడు ఆంగ్లేయులు భావించారని, కానీ అలా ఎన్నటికీ జరగదని, ఎన్ని భేదాభిప్రాయాలున్నా ఏకత్వం వైపు సాగే ఉపాయాన్ని కనిపెడతారని ఆ ఉపాయం పేరే హిందుత్వమని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న మాటలను గుర్తుచేశారు. భారత్‌ను గొప్ప దేశంగా తీర్చిదిద్దటం ఏ రాజకీయ శక్తి వల్లో.. మరే శక్తి వల్లో సాధ్యం కాదని పేర్కొన్నారు. సమాజాన్ని ఏకత వైపు నడిపించేలా చేసినప్పుడే సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఆ శక్తులకు చోటులేదు సమాజంలో తామే సర్వం అనుకుంటూ ఇతరులను హింసిస్తూ, అప్పుడప్పుడూ తాము కష్టపడుతూ, తోటివారిని కష్టపెడుతూ సాధించే రాక్షస విజయాలు అవసరం లేదని పేర్కొన్నారు. అన్నీ తమకే కావాలంటూ ఇతరులను కష్టపెడుతూ తమ విజయం కోసం విధ్వంసాలకు తెగించే వారి ధన విజయాలూ తమకొద్దని, ఈ రెండు శక్తులకు హిందూధర్మంలో చోటు లేదని పేర్కొన్నారు. తమ కోసం కాకుండా ఇతరుల సౌఖ్యం కోసం పనిచేసే వారు సాధించే ధర్మ విజయాలు తమకు ముఖ్యమని, అలాంటి విజయాల కోసమే ఆర్ఎస్ఎస్ కష్టపడుతోందని స్పష్టం చేశారు. మనసులో తమోరజ గుణాల ప్రభావం ఉన్నా, ధర్మ భావంతో వాటిని జయిస్తున్నట్లు వెల్లడించారు. సమాజానికి ఈ లక్షణం చాలా అవసరమన్నారు. సమ్మేళనంలో కిషన్‌రెడ్డి, రాంమాధవ్, డీకే అరుణ తదితరులు రాజకీయాల ప్రస్తావనే లేకుండా.. ఆర్ఎస్ఎస్ చీఫ్ వేల మంది సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడుతున్నారంటే ఏవో రాజకీయపరమైన ఘాటు విమర్శలు వస్తాయన్న ఊహాగానాలు ఉన్నాయి. జాతీయ జనాభా జాబితా, జాతీయ పౌరుల జాబితా లాంటి అంశాల చుట్టూ రాజకీయాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో మోహన్ భాగవత్ మాట్లాడుతున్నారంటే దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ప్రత్యేక శ్రద్ధగా గమనించటం సహజం. కానీ వేలమందితో ఉన్న సభా వేదికమీదుగా దాదాపు అరగంట పాటు ప్రసంగించినా ఒక్కటంటే ఒక్క పదం కూడా రాజకీయ పార్టీలపై లేకపోవటం గమనార్హం. పరోక్షంగా కూడా ఏ పార్టీ వ్యవహారాన్ని ఎత్తిచూపకుండా కేవలం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలపైనే మాట్లాడటం విశేషం. సరిగ్గా ఆయన ప్రసంగ సమయానికే మత పెద్దల సమక్షంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంతనాలు జరిపారు. బహిరంగ సభలో పాల్గొన్న వారిలో ఈ అంశం ప్రస్తావన కూడా వినిపించింది. కానీ మోహన్ భాగవత్ మాత్రం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తప్ప మరో అంశం జోలికే వెళ్లలేదు. ఆర్ఎస్ఎస్ పైన వచ్చే విమర్శలను కూడా రేఖా మాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం విశేషం. సమ్మేళనంలో పాల్గొన్న విజయరామారావు, పెద్దిరెడ్డి, మురళీధర్‌రావు, లక్ష్మణ్, చింతల తదితరులు తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి: బీవీఆర్ మోహన్‌రెడ్డి విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు నిజాయితీ, క్షమాగుణం ఇలా అన్ని తన తల్లి వద్దే నేర్చుకున్నానని ప్రముఖ వ్యాపారవేత్త బీవీఆర్ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విలువలు మాత్రమే మనిషిని విజయపథం వైపు నడిపిస్తాయని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆదర్శంగా నిలవాలని, ఏది మంచో, ఏది చెడో తెలపాలని సూచించారు. మన ప్రవర్తనే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి నిత్యం ఏదో ఒకటి చదవాలని, పరిస్థితిని బట్టి, అర్థం చేసుకుని, అందుకనుగుణంగా నడుచుకుం టేనే విజయం సిద్ధిస్తుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే పెద్ద ఎన్జీవో అని, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు దేశ ప్రజల ఐక్యతను పెంపొందిస్తోందని పేర్కొన్నారు. సంఘ్సేవకులతో భాగవత్.. ఇబ్రహీంపట్నం రూరల్: సమాజం సంఘటితానికి సంఘ్ కార్యకర్తలు పనిచేయాలని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ స్వయం సేవకులకు సూచించారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగళ్‌పల్లి భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరం బుధవారం మధ్యాహ్నం వరకు జరిగింది. మంగళవారం రాత్రి శిబిరానికి చేరుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ భారత్ కాలేజీలోనే బస చేశారు. ఉదయం 4 గంటలకు సాధారణ కార్యకర్తలతో పాటే కరసేవ చేశారు. ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు శిబిరంలో 2 వేల మంది కార్యకర్తలతో సమావేశమయ్యారు. 10 గంటల నుంచి 11.30 గంటల వరకు యాదాద్రి శిబిరంలో మరో 2 వేల మంది సంఘ్ సేవకులతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సాధారణ కార్యకర్తలతో భాగ్యలక్ష్మినగర్ శిబిరంలో భోజనం చేశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని సభకు మంగళ్‌పల్లి శిబిరం నుంచి 196 బస్సుల్లో కార్యకర్తలు తరలిపోయారు. భారత్ కళాశాల నుంచి మోహన్ భాగవత్ 2.45 గంటలకు బయల్దేరారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, బ్లాక్ క్యాట్ కమాండోలతో పటిష్టమైన బందోబస్తు మధ్య సరూర్‌నగర్ స్టేడియానికి వెళ్లారు. కదం కదం కదుపుతూ.. స్వయం సేవకుల భారీ కవాతు.. సాక్షి, హైదరాబాద్/మీర్‌పేట: తెలుపు.. ఖాకీ రంగు దుస్తులు.. చేతిలో లాఠీలతో స్వయం సేవకులు భారీ కవాతు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, కిసాన్ సంఘ్, ఏబీవీపీలకు చెందిన 7705 మంది స్వయం సేవకులు హస్తినాపూర్, వనస్థలిపురం, సరూర్‌నగర్, ఇబ్ర ïహీంపట్నం ప్రధాన రహదారులపై కవాతు నిర్వహిస్తూ సాయంత్రం 4 గంటలకు ఎల్బీనగర్ చేరుకున్నారు. అటు నుంచి 5 గంటలకు సభాస్థలికి చేరుకున్నారు. ఈ సభకు తెలం గాణ జిల్లాల నుంచి స్వయం సేవకులతో పాటు పార్టీ కార్యకర్తలు భారీగా హాజరుకావడంతో సభాస్థలి కిక్కిరిసిపోయింది. స్వయం సేవకులు ప్రదర్శించిన దండవ్యాయామం, వీరవజ్రాసనం, ఉపనిష్ట వ్యాయామాలు సభలో హైలెట్‌గా నిలిచాయి. వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద, ఝాన్సీలక్ష్మీభాయ్, బీఆర్ అంబేడ్కర్ల భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
హిందూ సమాజం శక్తిమంతం కావాలి
ఇబ్రహీంపట్నం రూరల్: హిందూ సమాజం శక్తిమంతం కావాలని ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ ఆలె శ్యాంకుమార్ అన్నారు. హిందూ సమాజాన్ని జాగృతం చే యడానికి సేవక్‌లు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ ఎస్) విజయ సంకల్ప శిబిరం మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆ దిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగళ్‌పల్లి భా రత్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైంది. శిబిరానికి 8 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్యాంకుమార్ మాట్లాడుతూ.. హిందూ సమా జం వెయ్యేళ్లు బానిసత్వంలో గడపడానికి ప్రధాన కారణం హిందువుల అనైక్యతే అన్నారు. ప్రతి హిందువు ఈ భూమిని రక్షిస్తూ.. దర్మాన్ని కాపాడుకోవాలన్నారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ స హ్ కార్యవాహ్ ముకుందా, క్షేత్ర సహ సంఘ చాలక్ దూసి రామకృష్ణ, ప్రాంత సంఘ చాలక్ దక్షిణామూర్తి, ఎంపీలు బండి సంజయ్, అరి్వంద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ హాజరు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం సాయంత్రం శిబిరానికి హాజరయ్యారు. బుధవారం ఉదయం 5 గంటలకు స్వయం సేవక్‌ల పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారని ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. -
తల్లిదండ్రుల నుంచి విడదీయాలని చూస్తే విడాకులివ్వొచ్చు: సుప్రీం
న్యూఢిల్లీ: హిందూ సమాజంలో తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కొడుకు బాధ్యత అనీ, ఇందుకు భార్య అడ్డుపడుతుంటే ఆమెకు విడాకులు ఇవ్వచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఎల్.నాగేశ్వర రావుల బెంచ్ కర్ణాటక కు చెందిన ఒక వ్యక్తికి, పై కారణంతో భార్య నుంచి విడాకులిప్పిస్తూ ఈ తీర్పు చెప్పింది. ఏ భార్య అయినా తన భర్తను అతని తల్లిదండ్రుల నుంచి విడదీసి వేరు కాపురం పెట్టాలనుకోవడం మన సంస్కృతికి పరిచయం లేని చర్య అని కోర్టు వ్యాఖ్యానించింది. సదరు వ్యక్తికి 2001లోనే బెంగళూరు కుటుంబ కోర్టు విడాకులు మంజూరు చే సినా, కర్ణాటక హైకోర్టు వాటిని కొట్టేసింది. తాజాగా కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెడుతూ సుప్రీంకోర్టు విడాకులు ఇప్పించింది. -
హిందువుల ఐక్యతే దేశానికి రక్ష
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ అహ్మదాబాద్: హిందువుల ఐక్యతే దేశానికి రక్ష అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందూ సమాజం ప్రమాదంలో పడితే.. దేశమే ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. హిందూ దేశంగా భారత్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే హిందువులంతా ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆదివారమిక్కడ ముగిసిన మూడు రోజుల ఆరెస్సెస్ కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘హిందువులంతా ఏకతాటిపై నిలిచినట్లయితే దేశాభివృద్ధిని ఆపడం ఏ శక్తి తరమూ కాదు. గతంలో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తూ భారత్ విశ్వగురువుగా నిలిచింది. అప్పుడు ప్రపంచం శాంతియుతంగా ఉండేది. ఆ వైభవం మళ్లీ తీసుకురావాలంటే హిందువులంతా ఒక్కటి కావాలి’ అని పేర్కొన్నారు. ప్రజల్లో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు, జాతి నిర్మాణంలో సంఘ్ పరివార్ తన పాత్ర పోషిస్తోందని చెప్పారు. సంఘ్‌ను బయట్నుంచి చూడొద్దని, అది చేసే మంచి కార్యక్రమాలను గమనించి సంఘ్‌లో చేరాలని ప్రజలకు సూచించారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనియాడుతూ సమాజంలోని అన్ని వర్గాల పట్ల సమదర్శనం కలిగి ఉండాలన్నారు. ‘ఘర్ వాపసీ’పై మౌనం.. ఇతర మతాల్లోకి మారిన వారిని తిరిగి హిందూమతంలోకి తీసుకువచ్చేందుకు తలపెట్టిన వివాదాస్పద ‘ఘర్ వాపసీ’ కార్యక్రమంపై భాగవత్ మౌనం పాటించారు. పరమత సహనం కలిగి ఉండాలన్న విషయాన్ని హిందూ ధర్మం ఎన్నో ఏళ్లుగా చెబుతూనే ఉందన్నారు. ఇతర మతాల్లోని మంచిని కూడా చూసే గొప్పదనం హిందూ మతానికి ఉందని చెప్పారు. ఇతర మతాలను కూడా సమ్మతించాలన్న విషయాన్ని హిందూ మతం చెబుతోందన్నారు. ‘ఇతర మతాలను అనుసరించేవారు మంచివారు కాదని కొన్ని మతాల వారు చెబుతుంటారు. కానీ వారిపట్ల కూడా సహనం కలిగి ఉండాలని హిందూ మతం చెబుతోంది. ప్రతి ఒక్కరిలో దేవుడిని చూడాలని పేర్కొంటోంది. గోమాత, తులసి, గంగా నదిని మనం దేవుళ్లుగా చూస్తాం’ అని చెప్పారు. కిందటి నెల కోల్‌కతాలో మాట్లాడుతూ భాగవత్ ఘర్ వాపసీని గట్టిగా సమర్థించారు. తర్వాత ఘర్ వాపసీ జోరందుకోవడంతో రాజకీయ దుమారం రేగింది. కిందటి వారమే భగవత్.. ప్రధాని మోదీని కలిశారు. ఈ నేపథ్యంలో ఘర్ వాపసీపై భగవత్ కాస్త మెత్తబడడం గమనార్హం. ‘రేప్‌లకు ప్రభుత్వం బాధ్యత వహించదు’ కాన్పూర్: మహిళలపై అత్యాచారాలు జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించదని, సమాజమే ఇలాంటి ఘటనలకు బాధ్యత వహించాలని ఓ మహిళా మంత్రి అనడం విమర్శలకు దారితీసింది. ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో ఇటీవల ఓ బాలికపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రి అరుణ కోరి ఆదివారం మాట్లాడుతూ.. ‘ఈ అత్యాచారానికి ప్రభుత్వం బాధ్యత వహించదు.. చిన్నారులను వేధింపులకు గురి చేసే వారిపై వెంటనే కేసులు నమోదు చేస్తున్నాం. నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తున్నాం’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలు పార్టీల నేతలు, మహిళాసంఘాల నేతలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళలపై జరిగే అకృత్యాలకు అడ్డుకట్ట వేయకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. -
మత మార్పిడులను ప్రోత్సహించొద్దు
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కోల్‌కతా: మత మార్పిడులకు వ్యతిరేకంగా సంఘ్ పరివార్ ప్రచారం నిర్వహించటాన్ని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ గట్టిగా సమర్థించారు. మత మార్పిడుల నిరోధక బిల్లుకు మద్దతివ్వాలని విపక్షాలను డిమాండ్ చేశారు. హిందువులను బలవంతంగా మతం మార్చవద్దని మైనార్టీలకు సూచించారు. బలమైన హిందూ సమాజం నిర్మాణం కోసం తాము కృషి చేస్తున్నటు చెప్పారు. ఇతర మతాలకు మళ్లిన హిందువులంతా ఇష్టప్రకారం కాకుండా బలవంతంగా, ప్రలోభాలతో మతం మార్చుకున్నారని చెప్పారు. శనివారమిక్కడ ఆయన హిందూ సమ్మేళన్‌లో మాట్లాడారు. హిందూమతంలోకి మార్పిడులను వ్యతిరేకించే వారు హిందువులను కూడా ఇతర మతాల్లోకి మార్చవద్దని డిమాండ్ చేశారు. హిందూమతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారంతా తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాలంటూ ఉత్తరాదిలో సంఘ్ పరివార్ చేపట్టిన ‘ఘర్ వాపసీ’ కార్యక్రమం వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతరులను అణగదొక్కటంపై హిందూ సమాజానికి నమ్మకం లేదన్నారు. నూరు తప్పుల తరువాత ఇక ఉపేక్షించవద్దని భగవంతుడు సైతం చెప్పాడని గుర్తు చేశారు. హిందువులు ఎక్కువ మంది లేకపోవటం వల్లే పాకిస్థాన్ ప్రశాంతంగా ఉండలేకపోతోందని వ్యాఖ్యానించారు. -
ఆచరణ రూపంలో ‘హిందుత్వ’
ధనశక్తితో ప్రపంచాన్ని శాసించగలమని నమ్మే దేశాలు లోక కల్యాణానికి భంగం కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయస్థాయిలో మన వాణిని వినిపించగల నాయకత్వం నేడు అవసరం. అటువంటి నాయకత్వం హిందూ సమాజం నుండి రావాలని ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ విజయదశమి నాడు ‘రాష్ట్రీయ స్వయం సేవక సంఘం’ (ఆర్ఎస్ఎస్) ఎనభై తొమ్మిదేళ్లను పూర్తి చేసుకొని తొంభైయ్యవ పడిలో ప్రవేశించనుంది. 1925లో నాగపూర్‌లో చిన్న సంస్థగా ప్రారంభమైన ‘సంఘం’ నేడు దేశ వ్యాప్త నిర్మాణంగా విస్తరించింది, దేశ హితం కోరే వారందరికి విశ్వాస కేంద్రమై నిలిచింది. ఒకప్పుడు సంఘం అంటే శాఖ. శాఖ అంటే కార్యక్రమం. నేడు అది దానికే పరిమితం కాలేదు. మన సమాజ ధర్మం, సంస్కృతుల పట్ల శ్రద్ధ వహిస్తూ, హిందూ సమాజం తన సమస్యలను తానే పరిష్కరించుకోగలదనే విశ్వాసాన్ని పాదుకొల్పుతున్నది. హిందూ సమాజం తన సమస్యలకు ఎవరినో కార ణంగా చూపటం, దానిపై వాదోపవాదాలు చేయటం వల్ల ఉపయోగం లేదు. హిందువులంతా ఒకే విధంగా స్పందించి, పని చేయటం నేర్చుకోవాలి. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు దేశమంతటా ఇలా ఒకే విధంగా స్పందించడం కనిపి స్తోంది. ఆ స్పందనే విశ్వాసాన్ని నిర్మిస్తున్నది. అందుకే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా అశేష ప్రజానీకం బాధితు లకు చేసే ధన, వస్తు రూప సహాయాన్ని స్వయం సేవకుల చేతుల్లో ఉంచుతోంది. స్వాతంత్య్రం సిద్ధించి 67 ఏళ్లు పూర్తయినా దేశంలో రాజకీ య స్థిరత్వం నెలకొన లేదు. ప్రాంతీయ పార్టీల, భావనల ప్రభావం ప్రబలంగా ఉంటోంది. ఈ పరిస్థితిలో జాతీయ భావా లను బలోపేతం చేయాల్సి ఉంది. ‘‘జాతీయవాదులు కూడా దేశ హితానికి, సామ్రాజ్యవాదుల హితానికి మధ్య తేడాను సరిగా గుర్తించకపోవడం శోచనీయం... నేటి మన రాజకీయా లలో ఎన్నో లోపాలున్నాయి. వాటిని తొలగించుకోవడానికి సామూహిక ప్రయత్నం అవసరం’’ అని 1919 లోనే ఆర్ఎస్ ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ రావ్ బలిరామ్ హెగ్డేవర్ అన్నా రు. నాటికి, నేటికి మన జాతీయవాదుల తీరు పెద్దగా మారింది లేదు. వ్యక్తిగతమైన, మతపరమైన, పార్టీ పరమైన ప్రయోజనా లకు ప్రాధాన్యం ఇస్తూ జాతీయ ప్రయోజనాలను పట్టించుకోక పోయే ధోరణి బలంగా ఉంది. నేటి రాజకీయాలలోని దిగజారు డుతనాన్ని అధిగమించగలగాలంటే రాజకీయ నేతలు ఆచి తూచి వ్యవహరించేలా చేయగల బలీయమైన ఒక సామాజిక శక్తి నిర్మాణం కావాలి. సామ్రాజ్యవాదులు నేడు ఏ దేశాన్ని పూర్తి వలసగా మార్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి 1. వాణిజ్య సంబం ధాలను పెంపొందింపజేసుకోవడం, 2. ఆయా దేశాలలో తమ వంధిమాగధులను తయారు చేసుకోవడం, 3). ప్రభుత్వాలపై రాజకీయ వత్తిడి పెంచటం వంటి పద్ధతులను అవలంబిస్తు న్నాయి. ఈ విషయంలో మనం జాగరూకత వహించడం అవ సరం. మతతత్వ శక్తుల ఎత్తుగడల ప్రభావంతో సెక్యులర్ మేధావులు, ఉదారవాదులు ఆర్ఎస్ఎస్ను మతతత్వ సంస్థగా చిత్రీకరిస్తుంటారు. రాజకీయ నాయకులు రాజకీయ లక్ష్యం గలి గిన సంస్థగా భావిస్తుంటారు. ఇలా ఏర్పడిన గుడ్డి వ్యతిరేకతను ఎదుర్కొంటూనే సంఘం తనపనిని తాను చేసుకుంటూ ముం దుకుపోతోంది. సంఘం వ్యక్తులలో జాతీయ భావనను పెం పొందింపజేయడం మాత్రమే కాదు క్రమశిక్షణను పెంపొందిం పజేస్తోంది. వివేచన, కార్యదీక్షాదక్షతలను కలిగిన వేలాది మం ది కార్యకర్తలను దేశానికి అందిస్తోంది. అందుకే పలు సామా జిక, ధార్మిక, ఆధ్యాత్మికసంస్థలు సంఘంతో కలసిపనిచేయడా నికి ముందుకు వస్తున్నాయి. ఇది ఒక మంచి పరిణామం. నేటి ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో భారత దేశమే కాదు.. యావత్ ప్రపంచం సామ్యవాద, పెట్టుబడిదారీ విధానాలకు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తోంది. అందుకే నేడు దీనదయాళ్జీ ‘ఏకాత్మతా మానవతావాదం’ విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. క్రీడాభారతి, విద్యాభారతి, ఆరోగ్య భారతి వంటి పలు సంస్థల ద్వారా చేస్తున్న కృషితో ఆర్ఎస్ఎస్ మన సమాజ మౌలిక వ్యవస్థలను, దేశాభివృద్ధిని, దేశ రక్షణను పటిష్టం చేయడానికి తన వంతు బాధ్యతలను నిర్వహిస్తోంది. దేశం బాధ్యత ప్రభుత్వాలది మాత్రమే కాదు, మనందరిది. ధన శక్తితో ప్రపంచాన్ని శాసించగలమని విశ్వసించే కొన్ని దేశాలు ప్రపంచ శాంతికి, లోక కల్యాణానికి భంగం కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అంతరాత్జీయ స్థాయిలో మన వాణిని వినిపిం చగల నిర్ణయాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ రాజకీయ నాయకత్వం నేడు మనకు అవసరం. అటువంటి నాయకత్వం హిందూ సమాజం నుండి రావాలని కూడా ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితుల్లో సంఘం తన చారిత్రక కర్తవ్యాల పరిపూర్తికి మరింత దృఢదీక్షతో ముందుకు సాగాలనేదే ప్రజా హితం కోరే వారందరి కామన. నేడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 89వ వ్యవస్థాపక దినం. (వ్యాసకర్త ‘సమాచార భారతి’ నిర్వాహకులు) రాంపల్లి మల్లికార్జునరావు