తల్లిదండ్రుల నుంచి విడదీయాలని చూస్తే విడాకులివ్వొచ్చు: సుప్రీం
న్యూఢిల్లీ: హిందూ సమాజంలో తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కొడుకు బాధ్యత అనీ, ఇందుకు భార్య అడ్డుపడుతుంటే ఆమెకు విడాకులు ఇవ్వచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఎల్.నాగేశ్వర రావుల బెంచ్ కర్ణాటక కు చెందిన ఒక వ్యక్తికి, పై కారణంతో భార్య నుంచి విడాకులిప్పిస్తూ ఈ తీర్పు చెప్పింది. ఏ భార్య అయినా తన భర్తను అతని తల్లిదండ్రుల నుంచి విడదీసి వేరు కాపురం పెట్టాలనుకోవడం మన సంస్కృతికి పరిచయం లేని చర్య అని కోర్టు వ్యాఖ్యానించింది. సదరు వ్యక్తికి 2001లోనే బెంగళూరు కుటుంబ కోర్టు విడాకులు మంజూరు చే సినా, కర్ణాటక హైకోర్టు వాటిని కొట్టేసింది. తాజాగా కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెడుతూ సుప్రీంకోర్టు విడాకులు ఇప్పించింది.