మోడల్ వయోజన విద్య కేంద్రం ప్రారంభం
మోడల్ వయోజన విద్య కేంద్రం ప్రారంభం
Published Wed, Jul 20 2016 7:35 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
సంగం : మండలంలోని సిద్దీపురానికి మంజూరైన మోడల్ వయోజన విద్యాకేంద్రాన్ని ఎంపీపీ దగుమాటి కామాక్షమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు దేవసహాయంలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జయరామయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం మోడల్ వయోజన విద్యాకేంద్రాలను ఏర్పాటుచేసిందన్నారు. జిల్లాకు ఆరు కేంద్రాలు మంజూరు కాగా అందులో సిద్దీపురం ఒకటన్నారు. ఈ కేంద్రానికి రూ.2.50 లక్షలతో కంప్యూటర్, కుర్చీలు, వయోజనులకు అవసరమైన ఆటవస్తువులు, వేయింగ్ మిషన్, కుట్టుమిషన్ తదితర వస్తువులను అందజేశారన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ నిరక్ష్యరాసులపై సాక్షరభారత్ కో–ఆర్డినేటర్లు ప్రత్యేకశ్రద్ధ పెట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకుని సిద్దీపురం గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అనంతరం జెడ్పీటీసీ, అన్నారెడ్డిపాళెం సాగునీటి సంఘం అధ్యక్షుడు సూరా శ్రీనివాసులురెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైస్ ప్రెసిడెంట్ వెంగళరెడ్డి, వెంగారెడ్డిపాళెం మాజీ సర్పంచ్ ఆనం ప్రసాద్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement