Vasavi Kanyaka Parameswari
-
ఘనంగా శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు !
హైదరాబాద్: ఆర్య వైశ్య సంఘం ఇసామియా బజార్ ఆధ్వర్యంలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు ఘనంగా శనివారం నిర్వహించారు. ఇది ఇసామియా బజార్‌లోని నరసింహాస్వామి ఆలయం దగ్గర జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయం ఫలహారం, అభిషేకం, సహస్త్ర నామార్చనతోపాటు హోమము నిర్వహించి అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిపారు. ఇక సాయంత్రం 5 గంటల నుంచి సంఘం సభ్యులందరికీ పగడి కట్టడం జరిపారు. ఈ సమయంలోనే సామూహిక కుంకుమార్చన సంఘంలోని మహిళ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమాల అనంతరం, అమ్మవారి ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో సంఘం సభ్యులంతా దాండియా ఆడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ కొమిరిశెట్టి అనిల్‌కుమార్, జనరల్ సెక్రటరీ ఆలంపల్లి రవికుమార్, ట్రెజరర్ ఎర్రం లక్ష్మణ్, ఐపిపి మ్యాడమ్ అశోక్. ప్రాజెక్ట్ కన్వీనర్ హరినాతినీ శ్రీనివాస్, ప్రాజెక్ట్ చైర్మన్ కల్వకుంట్ల శ్రీనివాస్. కోకన్వీనర్స్: పారెపల్లి మల్లేష్, పల్లెర్ల హరీష్ కుమార్, చీకటిమర్ల సంగయ్య. కో చైర్మన్: ముర్కి చంద్రమౌళి, రెగొండ చంద్రశేఖర్, నూనె నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు -
వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవికి రూ.కోటి నోట్లతో ప్రత్యేక అలంకరణ
సాక్షి, ప్రకాశం చౌక్: భీమవరం త్యాగరాజ భవనంలో ఆర్యవైశ్య వర్తక సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవికి రూ.కోటి నోట్లు, దండలతో ధనలక్ష్మిదేవిగా అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సభ్యులు బొండా కిషోర్, వబిలిశెట్టి రాజా, వబిలిశెట్టి కిషోర్, జూలూరి వెంకటేశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు. చదవండి: (దుర్గమ్మ సేవలో ఏపీ సీఎం) -
90 అడుగుల వాసవీ అమ్మవారి పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన
పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసవీ శాంతిధాం 102 రుషీగోత్ర స్తంభ మందిరంలో ఏర్పాటు చేసిన 90 అడుగుల శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన శుక్రవారం వైభవంగా జరిగింది. జీఎంఆర్ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు దంపతులు అమ్మవారి విగ్రహావిష్కరణ చేసి తొలి అభిషేకం చేశారు. వాసవీ శాంతి ధాంలో 700 రోజుల పాటు శ్రమించి 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకు 42 టన్నుల రాగి, 20 టన్నుల జింకు, 1.3 టన్నుల తగరం, 600 కేజీల వెండి, 40 కేజీల బంగారం కలిపి 65 టన్నుల విగ్రహాన్ని తయారు చేశారు. డిసెంబర్ 4న ప్రారంభమైన ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11 నుంచి హోమ క్రతువులు, నిత్య కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం 102 ఆర్యవైశ్యుల గోత్రీకులకు చిహ్నంగా 102 స్తంభాల రుషీగోత్ర మందిరాన్ని ప్రారంభించారు. అరుదైన మరకత శిలతో చెక్కించిన 3 అడుగుల మరకత శిలా విగ్రహాన్ని ప్రతిష్టించి అభిషేకాలు నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు ఆధ్వర్యంలో జరిగిన ఆర్యవైశ్యుల ఇలవేల్పు వాసవీ కన్యకాపరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించడానికి కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్యవైశ్యులు వేలాదిగా తరలి వచ్చారు. -
వాసవీ మాతా..! రక్షమాం..