
సాక్షి, ప్రకాశం చౌక్: భీమవరం త్యాగరాజ భవనంలో ఆర్యవైశ్య వర్తక సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవికి రూ.కోటి నోట్లు, దండలతో ధనలక్ష్మిదేవిగా అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సభ్యులు బొండా కిషోర్, వబిలిశెట్టి రాజా, వబిలిశెట్టి కిషోర్, జూలూరి వెంకటేశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు.
చదవండి: (దుర్గమ్మ సేవలో ఏపీ సీఎం)