Minister sidda
-
ఆర్యవైశ్యుల అభివృద్ధికి సహకరిస్తా
మంత్రి శిద్దా రాఘవరావు ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : ఆర్యవైశ్యుల అభివృద్ధి పూర్తి సహకారం అందిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖామంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. స్థానిక చెరుకూరి వీర్రాజు తోటలో వైశ్య హాస్టల్, వైఎంవీఏ, రాజమహేంద్రవరం ఆర్యవైశ్య సేవా సంస్థలతో శిద్ధా రాఘవరావు ఆత్మీయ గౌరవ సత్కారం, ఆర్యవైశ్యుల కార్తీక వన సమారాధన ఆదివారం జరిగింది. మంత్రి రాఘవరావు మాట్లాడుతూ కె.రోశయ్య చేతులమీదుగా సత్కరించడం మరుపురానిదన్నారు. మాజీ గవర్నర్ కె.రోశయ్య మాట్లాడుతూ రాజమహేంద్రవరం ప్రజల ఆదరాభిమానాలు మరువలేనివన్నారు. ఏపీఐసీసీ మాజీ చైర్మ¯ŒS శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మంత్రి జిల్లాను అభివృద్ధి చేయాలని కోరారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్సీలు రెడ్డిసుబ్రహ్మణ్యం, సోము వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, డాక్టర్ ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, వరుపుల సుబ్బారావు, జ్యోతుల నెహ్రూ, నగర మేయర్ పంతం రజనిశేషసాయి, మాజీ ఎంపీ హర్షకుమార్, డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ, రాష్ట్ర వైశ్య నాయకులు కాళ్ళకూరి నాగబాబు, ఆర్యాపురం బ్యాంకు చైర్మ¯ŒS చల్లా శంకరరావు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రమంత్రి శిద్ధా రాఘవరావు దంపతులను రోశయ్య చేతులమీదుగా ఆర్యవైశ్యులు సత్కరించారు. వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కం పూడి విజయలక్ష్మి, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, కాపు కార్పొరేష¯ŒS డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
రూ. 26 కోట్లతో కొత్తపట్నం రోడ్డు
మంత్రి శిద్దా వెల్లడి ఒంగోలు: నగరంలోని ఎఫ్‌సీఐ గోదాము నుంచి కొత్తపట్నం వరకూ రూ. 26 కోట్లతో రహదారి నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖామంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. స్థానిక ఆయన నివాసంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావుతో చర్చించిన అనంతరం శుక్రవారం మీడియాకు వివరాలు విడుదల చేశారు. కోర్నెట్ రోడ్ల పథకం కింద నిధులు మంజూరు చేయాలని నిర్ధారించామని తెలిపారు. చీమకుర్తి నుంచి బైపాస్ చివరి కాలువల వరకు సిమెంట్ రహదారి నిర్మాణానికి రూ. 21 కోట్లు, కరవది–గుండాయపాలెం రహదారి నిర్మాణానికి రూ. 26 కోట్లు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ రమేశ్‌బాబు, ఒంగోలు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
నూర్‌బాషాల సంక్షేమానికి కృషి చేస్తా
ఒంగోలు సెంట్రల్: నూర్‌బాషాల సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. స్థానిక ఉగ్గుల కుంట బీసీ ఆరామ క్షేత్రం వద్ద ఆదివారం నిర్వహించిన నూర్‌బాషా ప్రతిభా ప్రోత్సాహక అభినందన సభలో మాట్లాడారు. నూర్‌బాషాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నూర్‌బాషాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. అనంతపురం జెడ్పీ చైర్మన్ డి. చమన్ మాట్లాడుతూ రాజకీయంగా నూర్‌బాషాలకు రిజర్వేషన్లను కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులను నూర్‌బాషాలకు కేటాయించాలని కోరారు. డీఆర్ఓ నూర్‌బాషా ఖాశీం మట్లాడుతూ.. నూర్‌బాషాలు విద్యలో రాణించాలన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే నాగూర్ మీరా మాట్లాడుతూ రాష్ట్రంలో 25 లక్షల నూర్బాషాలున్నా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందించారు. ఎస్కే ఖాశీం, మీరా మొహిద్దీన్, ఎస్కే మీరావలి, ఎస్కే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి శిద్దాకు దివ్యాంగుల డెడ్‌లైన్
♦ 48 గంటల్లో సమస్యలు పరిష్కరించకుంటే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక ♦ 40 శాతంపైన వికలత్వం ఉన్న అందరికీ బస్సు పాసులు ఇవ్వాలని డిమాండ్ ♦ మ్యానిఫెస్టో ప్రకారం ప్రతి దివ్వాంగునికి రూ.1500 పింఛన్ ఇవ్వాల్సిందే ♦ రాజకీయ రిజర్వేషన్లు 7 శాతం ఇవ్వాలి.. లేకుంటే గుణపాఠం తప్పదు ♦ అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఒంగోలు : దివ్వాంగుల హక్కులు కాలరాయాలనుకుంటే సహించేది లేదని, 40 శాతం, ఆపైన వికలత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆర్టీసీ బస్సు పాసులు జారీ చేయాల్సిందేనని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక అంబేడ్కర్ భవన్లో జిల్లాలోని దివ్యాంగులతో ఆయన సమావేశమయ్యూరు. బస్సు పాసుల వ్యవహారంపై రవాణశాఖ మంత్రి శిద్దా రాఘవరావుకు 48 గంటల డెడ్‌లైన్ ఇస్తున్నామని, ఆ సమయంలోగా ఉత్తర్వులు జారీ చేయకుంటే ఇంటిని ముట్టడించడంతో పాటు అక్కడే తిని, అక్కడే పడుకుంటామని హెచ్చరించారు. చెవిటి, మూగ, అంధుల విషయంలో దొడ్డిదారిన ఆర్టీసీ యాజమాన్యం 100శాతం వికలత్వం ఉంటేనే బస్సు పాసులు జారీ చేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయకుంటే అనంతపురంలో పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఇంటిని సైతం ముట్టడించడం ఖాయమన్నారు. సదరం సర్టిఫికెట్ వికలత్వాన్ని చూపుతుంటే స్థానికంగా నివాసం ఉండడం లేదంటూ ప్రభుత్వం ఇంటి రుణం మంజూరుకు సైతం ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. సదరం సర్టిఫికెట్ల జారీకి సైతం నిధులు లేవంటూ ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణమన్నారు. రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు సేకరిస్తున్న ముఖ్యమంత్రి వికలాంగుల కార్యాలయం కోసం కనీసం 5 సెంట్ల స్థలం కూడా ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని కొల్లి విమర్శించారు. 2 వేల పింఛన్లు కట్ చేసిన జన్మభూమి కమిటీలు రాష్ట్ర అధ్యక్షుడు దూళిపాళ్ల మల్లికార్జునరావు మాట్లాడుతూ 3శాతం రిజర్వేషన్లు అంటున్నా కనీసం బ్యాంకు రుణాలు కూడా మంజూరు కావడం లేదన్నారు. టీడీపీ తన మ్యానిఫెస్టోలో వికలాంగులకు రూ.1500లు పింఛన్ ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక 80శాతంపైన వికలత్వం ఉన్న వారికే పింఛన్ ఇస్తామనడం మోసం చేయడమేనన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో జిల్లాలో 2 వేల మందికిపైగా వికలాంగుల పెన్షన్లు రద్దు చేశారని ఆగ్రహించారు. ఆగస్టు 15వ తేదీలోగా సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణం పేరుతో ఎన్ని దేశాలు తిరిగినా తాము అభ్యంతరం పెట్టమని, కాకుంటే ముందుగా రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సమస్యలను పరిష్కరించేందుకు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండువ వెంకట్రావు, జిల్లా అధ్యక్షుడు వనిపెంట గురవారెడ్డి, అంబటి చవరబాబు, చెన్నుబోయిన సుబ్బారావు, కాలేషా, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మహబూబ్‌బాషా, జిల్లా కార్యదర్శి సోమయ్య, కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి వై.మైనర్‌బాబు పాల్గొన్నారు.