నూర్‌బాషాల సంక్షేమానికి కృషి చేస్తా
నూర్‌బాషాల సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. స్థానిక ఉగ్గుల కుంట బీసీ ఆరామ క్షేత్రం వద్ద ఆదివారం నిర్వహించిన నూర్‌బాషా ప్రతిభా ప్రోత్సాహక అభినందన సభలో మాట్లాడారు.
ఒంగోలు సెంట్రల్: నూర్‌బాషాల సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. స్థానిక ఉగ్గుల కుంట బీసీ ఆరామ క్షేత్రం వద్ద ఆదివారం నిర్వహించిన నూర్‌బాషా ప్రతిభా ప్రోత్సాహక అభినందన సభలో మాట్లాడారు. నూర్‌బాషాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నూర్‌బాషాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. అనంతపురం జెడ్పీ చైర్మన్ డి. చమన్ మాట్లాడుతూ రాజకీయంగా నూర్‌బాషాలకు రిజర్వేషన్‌లను కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులను నూర్‌బాషాలకు కేటాయించాలని కోరారు. డీఆర్‌ఓ నూర్‌బాషా ఖాశీం మట్లాడుతూ.. నూర్‌బాషాలు విద్యలో రాణించాలన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే నాగూర్ మీరా మాట్లాడుతూ రాష్ట్రంలో 25 లక్షల నూర్‌బాషాలున్నా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందించారు. ఎస్‌కే ఖాశీం, మీరా మొహిద్దీన్, ఎస్‌కే మీరావలి, ఎస్‌కే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.