
ఆర్యవైశ్యుల్లో ఐక్యత తెచ్చిన ఐలయ్య: రోశయ్య
ముఖ్య అతిథిగా హాజరైన రోశయ్య మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతినేలా ప్రొఫెసర్ కంచ ఐలయ్య పుస్తకాన్ని రాయటంతో పాటు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయటంతో ఆర్యవైశ్యుల్లో ఐక్యత పెరిగిందని చెప్పారు. అందువల్లే ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఐలయ్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే హుందాగా ఉంటుందన్నారు.