చెన్నైలో ఘనంగా సత్యదేవుని సామూహిక వ్రతాలు | satyadeva vrathalu in chennai | Sakshi
Sakshi News home page

చెన్నైలో ఘనంగా సత్యదేవుని సామూహిక వ్రతాలు

Published Fri, Apr 14 2017 11:41 PM | Last Updated on Mon, Aug 20 2018 5:04 PM

satyadeva vrathalu in chennai

  • సత్యదేవుని నామస్మరణతో ప్రతిధ్వనించిన టి.నగర్‌
  • ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వ్రతాలు నిర్వహణ
  • వ్రతాలు ఆచరించిన 600 జంటలు 
  • అన్నవరం : 
    తమిళనాడు రాజధాని చెన్నై టి.నగర్‌ శుక్రవారం సత్యదేవుని నామంతో ప్రతిధ్వనించింది. రత్నగిరిపై కొలువైన సత్యదేవుని సామూహిక వ్రతాలను శుక్రవారం అక్కడ నిర్వహించారు. చెన్నైలోని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈ వ్రతాలు జరిగాయి. అన్నవరం దేవస్థానం స్పెషల్‌గ్రేడ్‌ వ్రత పురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ ఆధ్వర్యంలో పదిమంది పురోహితులు ఈ వ్రతాలు నిర్వహించారు. గత నెలలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు దేవస్థానం చైర్మ¯ŒS రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావును వ్రతాల నిర్వహణ చెన్నై నిర్వహించాలని కోరడంతో ఈ కార్యక్రమం అక్కడ నిర్వహించారు. అన్నవరం పండితులు వ్రతసామగ్రి, సత్యదేవుని రాగి మాడాలను, నమూనా విగ్రహాలను తీసుకుని చెన్నై బయల్దేరి వెళ్లారు. 
    ఉదయం నుంచి రాత్రి వరకూ 600 వ్రతాల నిర్వహణ
    చెన్నై టి.నగర్‌ ఉస్మా¯ŒSరోడ్‌లోని రామకృష్ణా స్కూల్‌ ఆడిటోరియంలో   ఉదయం ఏడు గంటలకు సత్యదేవుడు, అమ్మవారు, శంకరుల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి అన్నవరం స్పెషల్‌గ్రేడ్‌ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, తదితర పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయం 7:30  గంటలకు స్వామివారి వ్రతాల నిర్వహణ ప్రారంభించారు.   వ్రతాల అనంతరం సత్యదేవుని ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. నాలుగు బ్యాచ్‌లుగా నిర్వహించిన ఈ వ్రతాల్లో మొత్తం 600  జంటలు పాల్గొన్నాయి.
    మా జన్మ ధన్యమైంది: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ
    సత్యదేవుని వ్రతాల lనిర్వహణతో  మా జన్మ ధన్యమైనట్టుగా భావిస్తున్నామని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ అన్నారు. అన్నవరం స్వామి చెంతకు వచ్చి వ్రతాలు ఆచరించే వీలు లేని వారి కోసం ఈ సామూహిక వ్రతాల కార్యక్రమం ఏర్పాటు చేశామని వివరించారు.  స్వామి, అమ్మవార్ల  నమూనా విగ్రహాలతో పండితులు వచ్చి ఇక్కడ వ్రతాలు చేయించడం  గొప్ప విషయమన్నారు.  కాగా, అభ్యర్థించిన వెంటనే సత్యదేవుని వ్రతాల నిర్వహణకు పండితులను పంపించిన దేవస్థానం ౖచైర్మ¯ŒS రోహిత్,  ఈఓ కే నాగేశ్వరరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నవరం పండితులను ఘనంగా సత్కరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement