ఖైరతాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు టికెట్ ఇవ్వని ప్రాంతాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి తమ సత్తా చాటడంతో పాటు సీటు ఇచ్చిన ప్రాంతాల్లో అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం చింతలబస్తీలోని ఆర్యవైశ్య మహాసభలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీల తరపున నలుగురు, ఇండిపెండెంట్‌గా ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు.
వీరి విజయానికి మహాసభ కృషి చేస్తుందన్నారు. పొలిటికల్ చైర్మన్ చింతల రవికుమార్ మాట్లాడుతూ జంటనగరాల్లోని వంద సంఘాలతో సమావేశమై ఆయా పార్టీల అభ్యర్థులను గెలిపిస్తామని, తమకు టికెట్ ఇవ్వని ప్రాంతాల్లో ఆర్యవైశ్యుల సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, కొండ్లె మల్లికార్జున్, యాద అశోక్‌గుప్త, ఉప్పల శారద తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుతాం
Published Sun, Jan 24 2016 1:39 AM | Last Updated on Mon, Aug 20 2018 5:04 PM
Advertisement
Advertisement