Laxmi Narayan
-
ట్రాన్స్ జెండర్‌కు అక్షయ్ థాంక్స్
మనుషులు అందరూ ఒకలా ఉండనట్లే, అందరి దగ్గరగా ఒకేలా ఉండరు. తమ కన్నా పైనున్న వాళ్ల దగ్గర ఒక మెట్టు కిందికి దిగి నిలబడతారు. తమకన్నా కింద ఉన్నవాళ్ల దగ్గర ఒక మెట్టు పైకి ఎక్కి కుర్చుంటారు. మనిషి స్వభావం. తన మెట్టు ఒకటి ఉంటుంది కదా, అక్కడైతే ఎప్పుడూ ఉండడు మనిషి. అభినందనలు స్వీకరించడంలో కూడా ఎక్కడం దిగడం ఉంటుంది. స్వీకరించడానికి మెట్లను చూసుకోనక్కర్లేదు. ఐనా కానీ పైనున్న వాళ్ల అభినందన మోయలేని పూలగుచ్ఛమై వెన్ను సంతోషంగా కృంగిపోతుంది. కింద ఉన్న వాళ్ల అభినందన చూసి కూడా కాళ్లతో తొక్కేసుకుంటూ వెళ్లిన పువ్వు అవుతుంది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టభద్రుడు మనిషి పుట్టుకతోనే! డాన్ బాస్కో హై స్కూల్లో చదివి గురునానక్ కాలేజ్‌లో చదవలేక మానేసిన అక్షయ్ కుమార్ లా మెట్టు ఎక్కకుండా, మెట్టు దిగకుండా ఒకే చోట మనిషిలా ఉండిపోయే మనుషులు కూడా కొందరు ఉంటారు. శుక్రవారం అక్షయ్ కొత్త సినిమా ‘లక్ష్మీ బాంబ్’ ట్రైలర్ రిలీజ్ అయింది. లారెన్స్ డైరెక్టర్. పిక్చర్ నవంబర్ 9 న డిస్నీ హాట్ స్టార్‌లో వస్తోంది. బాంబులా పేలింది ట్రైలర్. హార్రర్ క్యామెడీ. ‘ఎక్స్‌ప్లోజివ్’ అని లక్ష్మీ నారాయణ త్రిపాఠీ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. లక్ష్మి ట్రాన్స్‌జెండర్ ఉమన్. అక్షయ్‌కి, అక్షయ్ టీమ్‌కి ఆమె అభినందనలు, ధన్యవాదాలు రెండూ తెలిపారు. అక్షయ్ ముఖం ఇంతయింది. అసలే ఎప్పుడూ ఇంతయింది ఉంటుంది, అది కొంచెం మరికొంత అయింది. ఏ గట్టునున్నాడో, ఏ మెట్టునున్నాడో చూసుకోకుండా.. ‘మీ అభినందన మాకు ఎంతగానో అవసరం అయినది. ఒక లక్ష్మి చేతుల మీదుగా ఇంకొక లక్ష్మికి ప్రశంసల హారం’ అంటూ తనూ ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో అక్షయ్‌కి దయ్యం పడుతుంది. జీవితంలో ఎప్పుడూ ఆయనకు ఎక్కువ తక్కువల దెయ్యం పట్టలేదు. మోదీతో ఎలా ఉన్నారో, ముంబై మురికివాడల్లోని వాళ్లతోనూ అంతే గౌరవంగా, మర్యాదగా ప్రతిస్పందితుడై ఉన్నారు. -
గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుతాం
ఖైరతాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు టికెట్ ఇవ్వని ప్రాంతాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి తమ సత్తా చాటడంతో పాటు సీటు ఇచ్చిన ప్రాంతాల్లో అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం చింతలబస్తీలోని ఆర్యవైశ్య మహాసభలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీల తరపున నలుగురు, ఇండిపెండెంట్‌గా ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు. వీరి విజయానికి మహాసభ కృషి చేస్తుందన్నారు. పొలిటికల్ చైర్మన్ చింతల రవికుమార్ మాట్లాడుతూ జంటనగరాల్లోని వంద సంఘాలతో సమావేశమై ఆయా పార్టీల అభ్యర్థులను గెలిపిస్తామని, తమకు టికెట్ ఇవ్వని ప్రాంతాల్లో ఆర్యవైశ్యుల సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, కొండ్లె మల్లికార్జున్, యాద అశోక్‌గుప్త, ఉప్పల శారద తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం పెక్కెర్ల గ్రామంలో ట్రాక్టర్‌పై నుంచి పడి చిన్నారి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. జెవిడి పవన్ (11) ట్రాక్టర్ మట్టితో వెళుతున్న ట్రాక్టర్‌పై కూర్చున్నాడు. మూలమలుపు వద్ద జారి కింద పడిపోవడంతో అతడి తలపై నుంచి ట్రాక్టర్ ముందుకు వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో డ్రైవర్ లక్ష్మీనారాయణ అక్కడి నుంచి పరారై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారం అందించాడు. పవన్ విజ్ఞాన భారత్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు. -
వాటిని మించేలా...
ఎల్లో లైన్ పిక్చర్స్ పతాకంపై ‘రఘపతి వెంకయ్యనాయుడు’ వంటి ఉత్తమ చిత్రాన్ని నిర్మించిన శాంతి శ్రీ మండవ నిర్మిస్తున్న ‘కళింగ’ హైదరాబాద్‌లో ఆరంభమైంది. సతీశ్‌బాబు, పావని జంటగా బేబి నిత్యసాయి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి కేయస్ నాగేశ్వరరావు దర్శకుడు. ముహూర్తపు దృశ్యానికి ఫొటోగ్రాఫర్ మధు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత సి. కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ స్క్రిప్ట్ అందించారు. కేయస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘‘మంచి కుటుంబ కథకు, యాక్షన్, కామెడీ జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రెండు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేశాం’’ అన్నారు. శ్రీహరితో పోలీస్, దేవా, సాంబయ్య వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కేయస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉందని, వాటిని మించేలా ఈ సినిమా వుంటుందని సతీశ్‌బాబు తెలిపారు. -
8న డీసీసీబీ చైర్మన్ ఎన్నిక
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌ను ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 8న చైర్మన్ ఎన్నికను నిర్వహించాలని రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ హైదరాబాద్ వారు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. 8వ తేదీన ఒక్కరోజే ఎన్నికల ప్రక్రియ మొత్తం చేపట్టాలని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి ప్రక్రియ మొదలు పెట్టి సాయంత్రం 6 గంటల వరకు పూర్తిచేయాలని కోరారు. కాగా, ఎన్నికల అధికారిగా జిల్లా సహకార ఆడిట్ అధికారి లక్ష్మీనారాయణను నియమించారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీసీసీబీ చైర్మన్ యెడవెల్లి విజయేందర్‌రెడ్డి ఈనెల 15వ తేదీన తన రాజీనామాను కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రార్‌కు అందజేశారు. చైర్మన్ రాజీనామాను ఆమోదించిన అధికారులు వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు ఇన్చార్జ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. డీసీసీబీ పాలకమండలిలో 21మంది డెరైక్టర్లు ఉన్నారు. అక్టోబర్8న జరగబోయే ఓటింగ్‌లో డెరైక్టర్లందరూ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. -
సంగీతభరిత ప్రేమకథ
‘అందాల రాముడు’ ఫేమ్ పి.లక్ష్మీనారాయణ దర్శకత్వంలో ఓ ప్రేమకథాచిత్రం రూపొందనుంది. ప్రిన్స్ కథానాయకునిగా నటించే ఈ సినిమాకు తాడి గనిరెడ్డి, కె.భువనేశ్వరి నిర్మాతలు. సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇదొక సంగీత భరిత ప్రేమకథ. గంగోత్రి విశ్వనాథ్ అద్భుతమైన కథ అందించారు. ప్రిన్స్ ఇమేజ్‌కి తగ్గట్టుగా సినిమా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘యువతరానికి కావాల్సిన అంశాలన్నీ ఈ కథలో ఉంటాయని, వైవిధ్యం కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథ, కథనాలు ఉంటాయని, అక్టోబర్ నుంచి చిత్రీకరణ మొదలు పెడతామని నిర్మాతలు తెలిపారు. -
సీబీఐ వలలో అవినీతి అధికారి
తమ పని తాము చేయడానికీ లంచం తీసుకుంటున్న ఇద్దరు అవినీతి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. గిద్దలూరులో సిక్‌లీవ్ తీసుకున్న గ్యాంగ్‌మెన్‌ను మళ్లీ విధుల్లోకి చేర్చుకునేందుకు రూ.5 వేలు లంచం తీసుకుంటున్న రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ లక్ష్మీనారాయణను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. అదేవిధంగా కందుకూరు తహశీల్దార్ కార్యాలయంలో 10వన్ అడంగుల్లో తప్పుగా పడిన పేరును సరిచేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఆర్ఐ దాదా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గిద్దలూరు రూరల్: గ్యాంగ్‌మెన్ నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీరు బి.లక్ష్మీనారాయణ సీబీఐకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన గిద్దలూరు రైల్వే సెక్షన్ ఇంజినీర్ కార్యాలయంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకెళితే గ్యాంగ్‌మెన్ జరీన్బాషా అనారోగ్యంతో వారం రోజులు సెలవు పెట్టాడు. మళ్లీ విధుల్లో చేరాలంటే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ లక్ష్మీనారాయణ అనుమతి కావాలి. అనుమతిచ్చేందుకు ఆయన రూ.5 వేలు లంచం అడిగాడు. అంత ఇచ్చుకోలేనని చెప్పినా వినకపోవడంతో జరీన్బాషా సీబీఐ అధికారులకు ఫోన్లో సమాచారం అందించాడు. మంగళవారం రాత్రి గ్యాంగ్‌మెన్..సెక్షన్ ఆఫీసర్‌కు డబ్బులిస్తున్న సమయంలో విశాఖపట్టణానికి చెందిన సీబీఐ అధికారుల బృందం సభ్యులు జీవన్భరత్, శ్రీనివాసరావు లంచం తీసుకుంటున్న లక్ష్మీనారాయణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం లక్ష్మీనారాయణ కార్యాలయంలోనూ, ఆయన నివాస గృహంలోనూ రికార్డులను పరిశీలించి అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. ట్రాక్‌పై పనులు చేసేందుకు రైల్వేశాఖ గ్యాంగ్మెన్లకు ఉచితంగా అందించే గునపం, గోళం తదితర వస్తువులను వారికిచ్చేందుకు లక్ష్మీనారాయణ నగదు వసూలు చేస్తుండేవాడని సమాచారం. సెలవులు మంజూరు చేయాలన్నా, బదిలీలు చేయాలన్నా గ్యాంగ్మెన్ల నుంచి వేలకు వేల రూపాయలు దండుకుంటున్నాడన్న ఆరోపణలున్నాయి. లక్ష్మీనారాయణను అరెస్టు చేసి విశాఖపట్నం సీబీఐ కార్యాలయానికి తరలించారు. -
మద్యంపై సమరభేరి
ఉన్నవ (యడ్లపాడు), న్యూస్‌లైన్ :స్వాతంత్య్ర సమరంలోనూ ఉన్నవ గ్రామం స్ఫూర్తిదాయక పాత్ర పోషించింది. ఉన్నవ వెంకటప్పయ్య, వంకాయలపాటి శేషావతారం వంటివారు స్వరాజ్యం కోసం ఉద్యమించి జైలుశిక్షను అనుభవించారు. పల్నాటి పుల్లరి సత్యాగ్రహ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి మహానుభావులను కన్న నేల ఇది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ గ్రామ ప్రస్తుత జనాభా సుమారు ఏడు వేల మంది. ఐదేళ్లుగా గ్రామాన్ని మద్యం రక్కసి పీక్కుతింటోంది. దీంతో యువత మద్యరహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించింది. అందుకు చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ అండగా నిలిచారు. ఆ వీధిలోకి వెళ్లాలంటేనే హడల్... ఉన్నవ బస్టాండ్ సెంటర్లోని ప్రధాన రోడ్డు పక్కన మూడు బెల్టుషాపులు ఉన్నాయి. రద్దీగా ఉండే ఈ వీధిలో సాయంత్రమైతే మందుబాబులు చేరతారు. పొలం పనులు, మిల్లుల నుంచి వచ్చే మహిళా కూలీలు, పాల కేంద్రానికి వెళ్లేవారు, విద్యార్థినులు మందుబాబుల వికృత చేష్టలతో ఆ వీధిలో వెళ్లాలంటేనే హడలిపోయే పరిస్థితి. గ్రామంలో మరో రెండు బెల్టుషాపులు ఉన్నాయి. మద్యానికి బానిసలైన కొందరి వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మానసికంగా, ఆర్థికంగా చితికిపోతున్నాయి. గతంలో రచ్చబండ, ప్రజాపథం, రెవెన్యూ గ్రామ సదస్సుల్లో బెల్టుషాపులను తొలగించాలని మహిళలు కోరినా ఫలితం కనిపించలేదు. యువత నిరాహారదీక్ష.. మూడు నెలల కిందట గ్రామానికి చెందిన యువకులు బెల్టుషాపుల నిలిపివేతకు ఉద్యమం చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. సంక్రాంతి పండగను ఎంచుకుని ఈ నెల 12 నుంచి 14 వరకు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ముందుగానే ఫేస్బుక్ వంటి సామాజిక వెబ్సైట్లో పెట్టి సలహాలు, సూచనలు స్వీకరించారు. అన్ని ప్రాంతాల్లో ఉన్న ఉన్నవ వాసులు మద్దతు పలకడంతో దీక్షకు శ్రీకారం చుట్టారు. గ్రామ యువకులు కుర్రా ప్రతాప్‌కుమార్, కాకుమాను విజయ్‌కాంత్, కుంచనపల్లి కుమార్‌బాబులు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టగా.. స్థానిక మహిళలకు మనోధైర్యాన్ని ఇచ్చారు. యువత ఉద్యమంతోనే తీర్మానాలు.. యువకుల పట్టుదలకు మెచ్చి మద్యం అమ్మకాలను గ్రామపరిధిలో చేయరాదంటూ పంచాయతీ పాలకమండలి, మర్రిపాలెం ప్రాథమిక సహకార సంఘం డెరైక్టర్, సభ్యులు అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి మద్యరహిత గ్రామంగా చేయాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సంతకాలను తీసుకుని శాశ్వతంగా తొలగించేలా చూడాలంటూ తీర్మానం చేశారు. దీంతో బెల్టుషాపులు మూతపడ్డాయి. పార్టీలకు, వర్గాలకతీతంగా తీసుకున్న తీర్మానంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను దగ్గరగా చూశాను.. మద్యానికి బానిసైనవారి కుటుంబాలను చాలా దగ్గరగా చూశాను. యువకులు మద్యనిషేధం కోసం దీక్షచేస్తుంటే పంచాయతీ మెంబర్లను అడిగాను. పార్టీలకతీతంగా మద్దతు పలికి తీర్మానం చేసేందుకు సహ కరించారు. తోటి మహిళల బాధలను అర్థం చేసుకోవడం గ్రామ ప్రథమ పౌరురాలిగా నాబాధ్యత అనిపించింది. - పత్తిపాటి బసవమ్మ, సర్పంచి -
‘బ్యాంకాక్ బ్రహ్మానందం’ సినిమా స్టిల్స్
-
మూడు పాత్రల్లో బ్యాంకాక్ బ్రహ్మానందం
చాలా విరామం తర్వాత బ్రహ్మానందం హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘బ్యాంకాక్ బ్రహ్మానందం’. ‘అందాలరాముడు’ ఫేం పి.లక్ష్మీనారాయణ(దీప్తి) ఈ చిత్రానికి దర్శకుడు. రాజా కృష్ణభగవాన్, ముత్యాల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇది కుటుంబ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఫిలిం. ఇందులో బ్రహ్మానందంగారి పాత్ర మూడు డైమన్షన్లలో సాగుతుంది. పెళ్లిల్లలో సన్నాయి వాయించేవాడిగా, సంగీతం మాస్టారిగా, పాప్సింగర్గా మూడు రకాలుగా కనిపిస్తారాయన. ఆయన నటనే ఇందులో హైలైట్. నా ‘అందాలరాముడు’ సినిమాను మించిన విజయాన్ని ఈ సినిమా సాధిస్తుందని నమ్మకంగా చెప్పగలను’’ అని చెప్పారు. రచయిత ఆర్కే భగవాన్ అందించిన కథ ఈ చిత్రానికి ప్రధాన బలమని, కుటుంబం మొత్తం హాయిగా నవ్వుకునేలా ఇందులో బ్రహ్మానందం కామెడీ ఉంటుందని సహ నిర్మాత ఐ.హరికృష్ణ చెప్పారు. రషస్ చూశాక సినిమా విజయంపై వందశాతం నమ్మకం ఏర్పడిందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: టి.సాయినాథ్, కథనం: గంగోత్రి విశ్వనాథ్, గోపి వెంకటేష్, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్.