సంగీతభరిత ప్రేమకథ | Prince' next with 'Andala Ramudu' director | Sakshi
Sakshi News home page

సంగీతభరిత ప్రేమకథ

Published Mon, Aug 25 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

సంగీతభరిత ప్రేమకథ

సంగీతభరిత ప్రేమకథ

 ‘అందాల రాముడు’ ఫేమ్ పి.లక్ష్మీనారాయణ దర్శకత్వంలో ఓ ప్రేమకథాచిత్రం రూపొందనుంది. ప్రిన్స్ కథానాయకునిగా నటించే ఈ సినిమాకు తాడి గనిరెడ్డి, కె.భువనేశ్వరి నిర్మాతలు. సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇదొక సంగీత భరిత ప్రేమకథ. గంగోత్రి విశ్వనాథ్ అద్భుతమైన కథ అందించారు. ప్రిన్స్ ఇమేజ్‌కి తగ్గట్టుగా సినిమా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘యువతరానికి కావాల్సిన అంశాలన్నీ ఈ కథలో ఉంటాయని, వైవిధ్యం కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథ, కథనాలు ఉంటాయని, అక్టోబర్ నుంచి చిత్రీకరణ మొదలు పెడతామని నిర్మాతలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement