వాటిని మించేలా... | kalinga movie Started | Sakshi
Sakshi News home page

వాటిని మించేలా...

Published Thu, Jun 11 2015 10:42 PM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

వాటిని మించేలా...

వాటిని మించేలా...

 ఎల్లో లైన్ పిక్చర్స్ పతాకంపై ‘రఘపతి వెంకయ్యనాయుడు’ వంటి ఉత్తమ చిత్రాన్ని నిర్మించిన శాంతి శ్రీ మండవ నిర్మిస్తున్న ‘కళింగ’ హైదరాబాద్‌లో ఆరంభమైంది. సతీశ్‌బాబు, పావని జంటగా బేబి నిత్యసాయి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి కేయస్ నాగేశ్వరరావు దర్శకుడు. ముహూర్తపు దృశ్యానికి ఫొటోగ్రాఫర్ మధు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత సి. కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ స్క్రిప్ట్ అందించారు. కేయస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘‘మంచి కుటుంబ కథకు, యాక్షన్, కామెడీ జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రెండు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేశాం’’ అన్నారు. శ్రీహరితో పోలీస్, దేవా, సాంబయ్య వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కేయస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉందని, వాటిని మించేలా ఈ సినిమా వుంటుందని సతీశ్‌బాబు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement