Raghupathi Venkaiah Naidu
-
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇన్నేళ్ల ఒంటరి జీవితానికి కారణమేంటి?
హీరోయిన్ కనక.. తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడుకు మని మనమరాలు. లెజెండరీ హీరోయిన్ దేవికకు ఏకైక కూతురు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో దేవిక చివరిగా నటించారు. 2002లో ఆమె మరణించారు. అప్పటి వరకు స్టార్ హీరోయిన్గా ఉన్న ఆమె కూతురు కనక ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఆ సమయం వరకు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 60కి పైగా చిత్రాల్లో కనక నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్, కార్తీక్, ప్రభు, మోహన్‌లాల్, మమ్ముట్టి, జయరామ్, రాజేంద్ర ప్రసాద్, భాను చందర్ వంటి స్టార్స్‌తో పలు సినిమాల్లో కనిపించిన ఆమె లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకుంది. కానీ తల్లి మరణం తర్వాత కనీసం ఒక్క సినిమాలో కూడా నటించలేదు. చివరకు వివాహం కూడా చేసుకోకుండా బాహ్య ప్రపంచానికి దూరంగా ఒంటరి జీవితాన్ని ఇప్పటి వరకు గడుపుతుంది. (కనిక- దేవిక) 80,90 దశకంలో కనకకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తమిళ చిత్ర సీమలో ఆమె చెరగని ముద్ర వేశారు. తల్లి దేవిక మరణం తర్వాత ఆమె ఒంటరి అయిపోయారు. దీంతో ఆమె వ్యక్తిగత జీవితం గురించి రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఆమెను ఎవరో పెళ్లి చేసుకుని వదిలేశారని వార్తలు వచ్చాయి. బాహ్యప్రపంచానికి దూరంగా ఉన్న ఆమె.. వీటిని పట్టించుకోలేదు. అప్పుడప్పుడూ ఇంటి నుంచి బయటకు వచ్చే కనకకు అటెండర్ ఒక్కరే ఉంటారని కొందరు చెబుతున్న మాట. ఇప్పటి వరకు కనక ఏకాంతంగానే గడుపుతుండగా ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదని కొందరిలో ప్రశ్న మొదలైంది. కనక గురించి కొందరు సీనియర్ జర్నలిస్ట్‌లు చెబుతున్న ప్రకారం.. ఆమె అప్పట్లోనే బీఏ చదివారని.. తల్లితో పాటుగా సినిమా షూటింగ్స్ వెళ్తున్న క్రమంలో వారి కుటుంబానికి రామచంద్రన్ అనే వ్యక్తి దగ్గర కావడం జరిగిందని చెబుతారు. అతనే ఆ కుటుంబానికి అండగా ఉంటూ వారిద్దరి మంచిచెడులు చూసేవాడని సమాచారం. కొంత కాలానికి కనక ప్రేమలో పడిన రామచంద్రన్ ఆ కుటుంబానికి మరింత దగ్గరయ్యాడు. అయితే ఓ దశలో రామచంద్రన్‌ను కనక అపార్థం చేసుకుందని దీంతో వారిద్దరి మధ్య విభేదాలు రావడం వల్ల అతన్ని ఇంటి నుంచి కనక పంపేసినట్లు చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత తల్లి మరణం ఆపై రామచంద్రన్ కూడా మరణించడం జరిగిపోయాయి. రామచంద్రన్ మరణం తర్వాత తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో కనకకు తెలిసింది. దీంతో గుండెలవిసేలా రోదించిన కనక.. తనకు సినిమాలేవీ అక్కర్లేదని, ఒంటరిగా జైలు జీవితాన్ని కోరుకున్నట్లు అక్కడి మీడియా చెబుతుంది. అయితే సుమారు పదేళ్ల తర్వాత కనకను సంప్రదించిన కోలీవుడ్ ప్రముఖ జర్నలిస్ట్ కుట్టి పద్మిని ఒక కాఫీ షాప్‌లో కలిశారు. పదేళ్లపాటు బయటిప్రపంచంలో కనక కనిపించకపోవడంతో అందరూ చనిపోయిందని అనుకున్నారు. ఏకంగా ప్రముఖ పత్రికలు కూడా ఆ వార్తను ప్రచురించాయి. దీంతో కొందరు మీడియా వారు ఆమె ఇంటికెళ్లేసరికి అక్కడ ఎదురుగా కనక కనిపించారు. తాను బతికేవున్నానని, వదంతులకు వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది. అలా తల్లి మరణం తర్వాత కనక జీవితం ఒక్కసారిగా మారిపోయింది. 41 ఏళ్ల వయసులో ఆమె ఒంటరిగానే ఒక పాత ఇంటిలో జీవిస్తుంది. -
ఆ అవార్డు అందుకున్న హీరో ఎవరు?
తెలుగు సినీ పరిశ్రమకు పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు. సోమవారం (మార్చి 15) ఆయన వర్థంతి. 1869 అక్టోబరు 15న మచిలీపట్నంలో జన్మించారు రఘుపతి. 17వ ఏట ఫొటోలు తీయడం ఆరంభించారు. 1912లో ‘గెయిటీ’అనే సినిమా థియేటర్ని నిర్మించారు. దర్శక–నిర్మాత కూడా. తెలుగు సినిమాకు సేవలందించిన రఘపతి వెంకయ్య నాయుడు 1941 మార్చి 15న కన్నుమూశారు. ఆయన జీవిత విశేషాలతో క్విజ్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1661349877.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1671349877.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రఘుపతి వెంకయ్య నాయుడు ఫిల్మ్ నగర్‌గా మార్చాలి
‘‘తెలుగు సినిమా పరిశ్రమ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రఘుపతి వెంకయ్య నాయుడు పేరును ఫిల్మ్‌నగర్‌కి చేర్చి ‘రఘుపతి వెంకయ్యనాయుడు ఫిల్మ్ నగర్’గా మార్చాలి’’ అని ‘రఘుపతి వెంకయ్య అకాడమీ’ సభ్యులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ ఎదుట ఉన్న రఘుపతి వెంకయ్య నాయుడు విగ్రహం వద్ద ఆయన 79వ వర్ధంతిని ‘రఘుపతి వెంకయ్య అకాడమీ’ ఆధ్వర్యంలో నిర్వహించారు. ‘‘ఇక నుంచి ప్రతి సంవత్సరం మార్చి 15న రఘుపతి వెంకయ్యగారి వర్ధంతిని, అక్టోబర్ 15న జయంతిని ఘనంగా జరుపుతాం’’ అని ‘రఘుపతి వెంకయ్య అకాడమీ’ సభ్యులు పేర్కొన్నారు. ‘‘ఫిల్మ్‌చాంబర్ వద్ద రఘుపతి వెంకయ్య నాయుడుగారి విగ్రహాన్ని బాగు చేయించి, దాని చుట్టూ ఫెన్సింగ్, గొడుగు, నిచ్చెనలాంటి వాటిని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందిస్తా’’ అని మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘రఘుపతి వెంకయ్య అకాడమీ’ నూతన అధ్యక్షుడు యన్.గోపాలకృష్ణ, ఉపాధ్యక్షుడు పి.విజయ వర్మ, ప్రధాన కార్యదర్శి జె.వి. మోహన్ గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బాబ్జీ, సహాయ కార్యదర్శి యస్.ఏ.ఖుద్దూస్, కోశాధికారి తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కమిటీ సభ్యులు గాంధీ, జమా, హనుమంతరావు తదితరులు వెంకయ్యనాయుడి సేవలను కొనియాడారు. -
మళ్లీ మళ్లీ రాని అవకాశం
తెలుగు చలనచిత్ర పితామహునిగా పిలుచుకునే రఘుపతి వెంకయ్యనాయుడు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రఘుపతి వెంకయ్యనాయుడు’. టైటిల్ పాత్రలో సీనియర్ నటుడు వీకే నరేష్ నటించారు. ఎల్లో లైన్ పిక్చర్స్ పతాకంపై మండవ సతీష్ బాబు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ– ‘‘రఘుపతి వెంకయ్యనాయుడిగారి పాత్రలో నటించడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఇది. తెలుగు సినిమా బతికి ఉన్నంతవరకు ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు. ‘‘రఘుపతి వెంకయ్యగారు చేసిన కృషిని గుర్తు చేయడానికి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశాం’’ అన్నారు బాబ్జీ. తనికెళ్ల భరణి, మహర్షి, వాహిని, సత్యప్రియ, భావన తదితరులు నటించిన ఈ సినిమాకు శ్రీ వెంకట్ సంగీతం అందించారు. -
వాటిని మించేలా...
ఎల్లో లైన్ పిక్చర్స్ పతాకంపై ‘రఘపతి వెంకయ్యనాయుడు’ వంటి ఉత్తమ చిత్రాన్ని నిర్మించిన శాంతి శ్రీ మండవ నిర్మిస్తున్న ‘కళింగ’ హైదరాబాద్‌లో ఆరంభమైంది. సతీశ్‌బాబు, పావని జంటగా బేబి నిత్యసాయి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి కేయస్ నాగేశ్వరరావు దర్శకుడు. ముహూర్తపు దృశ్యానికి ఫొటోగ్రాఫర్ మధు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత సి. కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ స్క్రిప్ట్ అందించారు. కేయస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘‘మంచి కుటుంబ కథకు, యాక్షన్, కామెడీ జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రెండు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేశాం’’ అన్నారు. శ్రీహరితో పోలీస్, దేవా, సాంబయ్య వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కేయస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉందని, వాటిని మించేలా ఈ సినిమా వుంటుందని సతీశ్‌బాబు తెలిపారు. -
మూలన మిగిలిపోయిన తెలుగు సినిమా మూల పురుషుడు
సందర్భం రఘుపతి వెంకయ్యనాయుడు జయంతి రఘుపతి వెంకయ్యనాయుడు 1869 అక్టోబరు 15న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించెను. 1941 జూలై 1న పరమపదించెను. ఏదో పాఠం చదివినట్టుగా... చరిత్ర అంటే ఇదేనా? జనన, మరణాల చిట్టాయేనా? ఆ వ్యక్తి తాలూకు దృక్కోణాన్ని, సాహసాన్ని, కాలంలోకి తొంగి చూసే ఒడుపుని, దూరదృష్టిని ఒడిసిపట్టుకోనవసరం లేదా? పాఠాలు నేర్చుకోనవసరం లేదా? కనీసం జయంతి, వర్థంతిని కూడా చిత్ర పరిశ్రమ స్మరించుకోని పరిస్థితి రఘుపతి వెంకయ్యది. తెలుగు సినిమా మూల పురుషునికి ఇదేనా మనమిచ్చే నివాళి? అసలు రఘుపతి వెంకయ్యను ఎందుకు స్మరించుకోవాలి? ఈ జనరేషన్‌కి ఎంతమందికి తెలుసు ఆయన? వాళ్లకు తెలుసుకునే ఆసక్తి ఉండొచ్చూ ఉండకపోవచ్చును. కానీ తెలియజెప్పాల్సిన అవసరం మాత్రం సినీ పరిశ్రమకు ఉంది. వెంకయ్య ఓ స్టిల్ ఫొటోగ్రాఫర్. బందరు నుంచి వెళ్లి మద్రాసులో ఫొటో స్టూడియో పెట్టాడు. ఫొటో తీస్తే అతనే తీయాలన్నంత పేరు తెచ్చుకున్నాడు. గుర్రపు బగ్గీలో తిరిగేంత సంపాదించుకున్నాడు.ప్రయోగశీల మనస్తత్వం... వ్యాపార దక్షత... సాహసిక లక్షణం... ఈ మూడూ వెంకయ్యలో పుష్కలం. అవే వెంకయ్యను సినిమా ఫీల్డ్‌లోకి ఎంటర్ చేశాయి. ‘క్రోనో మెగాఫోన్’ గురించి పేపర్లో వార్త చదివాడు. దాని విలువ 40 వేలు. అంత డబ్బు తన దగ్గర లేదు. ఫొటో స్టూడియో తాకట్టు పెట్టి మరీ కొన్నాడు దాన్ని. ఫస్ట్ ప్రదర్శన హిట్. రెండో ప్రదర్శన సూపర్‌హిట్.కాలికి క్రోనో మెగాఫోన్ కట్టుకుని దేశమంతా తిరిగాడు. సరిహద్దులు కూడా దాటాడు.అప్పట్లో డేరాలు కట్టి సినిమాలు ఆడే పద్ధతి. ఛత్... ఇది కాదు పద్ధతి అనుకున్నాడు వెంకయ్య. మద్రాసులో ఫస్ట్ పర్మినెంట్ థియేటర్ ‘గెయిటీ’ (1913) వెలిసింది. ఆ మరుసటి ఏడాదే ‘క్రౌన్’ థియేటర్... ఆ వెంటనే ‘గ్లోబ్’ థియేటర్. ఇవన్నీ కాదు. వెంకయ్య అసలు స్టెప్... కొడుకు ఆర్.ఎస్. ప్రకాశ్‌ను ఫారిన్ పంపడం. కేవలం సినిమా టెక్నిక్ నేర్చుకోవడం కోసం. ఆ రోజుల్లో ఫారిన్ పంపడమే ఎక్కువనుకుంటే, భవిష్యత్తు ఉంటుందో, లేదో తెలియని సినిమా టెక్నిక్ నేర్చుకోవడానికంటే ఎంత రిస్కో ఓసారి ఊహించుకోండి. కొడుకు ఫారిన్ నుంచి రాగానే లక్ష రూపాయలు ఖర్చుపెట్టి ‘స్టార్ ఆఫ్ ది ఈస్ట్’ అంటూ గ్లాస్ స్టూడియో కట్టాడు వెంకయ్య. వరుసపెట్టి కొడుకు డెరైక్షన్‌లో మూకీలు తీశాడు. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు. దివాళా తీసేదాకా వచ్చింది పరిస్థితి. ఆయన తగ్గాడు కానీ, ఆయన సంకల్పం మాత్రం వటవృక్షమైంది. సినిమా మీద ఆయన ప్రేమ, నమ్మకం అన్నీ ఫలించాయి. ఆ ఫలాల్నే ఇప్పుడు మనం ఆస్వాదిస్తున్నాం. అదండీ... క్లుప్తంగా వెంకయ్య కథ. రఘుపతి వెంకయ్య... మన తొలి ఎగ్జిబిటర్! మన తొలి నిర్మాత! మన తొలి స్టూడియో అధినేత! మన తెలుగు సినిమాకు దారి చూపిన దీపస్తంభం! ఇంత ఇచ్చిన ఆయనకు మనమేం చేశాం? అబ్బో... చాలా చేశాం. ఫిలిమ్‌నగర్ సెంటర్లో దుమ్ము కొట్టుకుపోయిన శిలా విగ్రహం ఆయనదే కదూ! అయినా... దీని కోసం ఎన్నాళ్లు కష్టపడాల్సి వచ్చింది. ప్రభుత్వాన్ని బతిమాలుకుంటే నాలుగేళ్ల క్రితం అలా విసిరిపారేసిన వరం అది. ఇక దాంతోనే మనం సంతృప్తి పడాలి. అప్పుడెప్పుడో బంజారాహిల్స్... కేన్సర్ హాస్పటల్ చౌరస్తాలో వెంకయ్య కాంస్య విగ్రహమన్నారు. అతీగతీ లేదు. ప్రముఖ జర్నలిస్ట్ ఇంటూరి వెంకటేశ్వరరావు, ఎంతో పోరాడితే - రఘుపతి వెంకయ్య నాయుడు పేర ఓ అవార్డు వెలిసింది. 1981 నుంచి హేమాహేమీలకు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన పరిస్థితిలో, ఇకపై ఈ పురస్కారం భవిష్యత్తు ఏంటో మరి!? వెంకయ్య ఎప్పుడు పుట్టారో, ఎప్పుడు పోయారో ఎక్కడా కరెక్ట్ డేటా లేదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో తరహా. పుట్టింది అక్టోబర్ 15నే కానీ, ఇయర్ మాత్రం 1869 అని, 1873 అని చెబుతుంటారు. మరణం కూడా అంతే. కొందరేమో 1941 జూలై 1 అంటారు, ఇంకొందరు 1941 మార్చి 15 అని చెబుతారు. మరికొందరు 1943 అంటారు. ఇంతకూ ఏది కరెక్టో? అసలు మన తెలుగు సినిమా పితామహుడు గురించి ఇంతవరకూ ఓ మోనోగ్రాఫ్ లేకపోవడం దారుణం. వెంకయ్య నాయుడు గురించి పరిశోధన చేయించి, చరిత్ర రాయించాలని ఆరుద్రలాంటి వాళ్లు కూడా వాపోయినా, పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికైనా నిర్మాతల మండలో, వాణిజ్య మండలో పూనుకుని చేస్తే బాగుంటుంది. రఘుపతి వెంకయ్య నాయుడు, ఆయన కొడుకు ఆర్.ఎస్. ప్రకాశ్ తర్వాత ఆ కుటుంబం నుంచి ఇంకెవరూ సినిమా ఫీల్డ్కొచ్చినట్టు లేదు. ఒకవేళ వచ్చినా రాణించలేదా? అసలు వీళ్ల వారసులెక్కడున్నారు? ఎవ్వరికీ తెలీదు. కనీసం తెలుగు సినిమా వజ్రోత్సవాల సమయంలో కూడా ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. చీకట్లో చిరుదీపం లాగా... రఘుపతి వెంకయ్య నాయుడిపై ఓ సినిమా తయారైంది. సీనియర్ ‘నరేశ్’ వెంకయ్య పాత్ర చేశారు. ‘నల్లపూసలు’ ఫేమ్ బాబ్జీ డెరైక్టర్. మండవ సతీశ్ ప్రొడ్యూసర్. ఫస్ట్ కాపీతో సహా సినిమా రెడీ. ఇప్పుడున్న ట్రెండ్‌లో వెంకయ్యను ఎవరు పట్టించుకుంటారు చెప్మా? ల్యాబ్‌లో... సారీ... హార్డ్‌డిస్క్‌లో ఈ సినిమా ఆపసోపాలు పడుతోంది. ప్రభుత్వం రాయితీ ఇవ్వడమో, పరిశ్రమ ఏదొక రీతిలో సాయం చేయడమో చేస్తే తప్ప, ఈ సినిమా బయటకు రాదు. ఆ ప్రయత్నమైనా చేస్తే, రఘుపతి వెంకయ్యకు ఓ మంచి నివాళి అవుతుంది. ముక్తాయింపు: ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ సినిమా చూసి ఇంప్రెస్ అయిన దాసరి నారాయణరావు, ఈ సినిమాను తానే సొంతంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజంగా... గుడ్ న్యూసే! - పులగం చిన్నారాయణ -
రఘుపతి వెంకయ్యనాయుడు విషయంలో ప్రభుత్వానికి ఎందుకీ వివక్ష - దాసరి
‘‘అల్లూరి సీతారామరాజు’ పేరులో ‘రాజు’ అనే రెండక్షరాలు తీసేసి చూడలేం. ‘భగత్‌సింగ్’లో సింగ్ అనే అక్షరాలను తీసేసి పలకలేం. అలాగే ‘రఘుపతి వెంకయ్యనాయుడు’ పేరు కూడా. ప్రారంభంలో ‘రఘుపతివెంకయ్య నాయుడు’ పేరిట పురస్కారాన్ని ప్రారంభించిన మన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ‘రఘుపతి వెంకయ్య పురస్కారం’గా అందజేస్తున్నారు. ఆయన పేరులో నాయుడు అనే అక్షరాలను ఎందుకు తొలగించారు. బీఎన్‌రెడ్డి పురస్కారం మాత్రం అదే పేరుతో కొనసాగుతోంది. ఎందుకీ వివక్ష? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను’’ అని దాసరి నారాయణరావు అన్నారు. దక్షిణాది సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడు చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రఘుపతి వెంకయ్యనాయుడు’. సీనియర్ నటుడు నరేష్ టైటిల్‌రోల్ చేసిన ఈ చిత్రానికి బాబ్జీ దర్శకుడు. మండవ సతీష్‌బాబు నిర్మాత. శ్రీవెంకట్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దాసరి ఆడియో సీడీని ఆవిష్కరించి, సీనియర్ గాయని రావు బాలసరస్వతికి అందించారు. దాసరి మాట్లాడుతూ -‘‘నిజానికి దాదాసాహెబ్ఫాల్కేకు సమానమైన గౌరవం రఘుపతి వెంకయ్య నాయుడుకు దక్కాలి. ఫాల్కే కంటే ముందే ఫొటోలతో సినిమా తయారు చేసి ప్రదర్శించిన ఘనత ఆయన సొంతం. కేంద్రం నుంచి వెంకయ్యనాయుడుకు గౌరవం దక్కలేదు. చివరకు మన రాష్ట్రం కూడా ఆయన్ను ఆలస్యంగానే గుర్తించింది. ఇది నిజంగా బాధాకరం’’ అని దాసరి చెప్పారు. కృష్ణవేణి, కృష్ణ, విజయనిర్మల తదితరులు మాట్లాడారు.