ప్రస్తుతం టాలీవుడ్‌లో డివోషనల్ టచ్ ఉండే మూవీస్ హిట్స్ కొడుతున్నాయి. మరోవైపు హారర్ జానర్ అనేది ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసి తీసిన సినిమా 'కళింగ'. ధృవ వాయు హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. ప్రగ్యా నయన్ హీరోయిన్. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథేంటి?
కళింగ అనే ప్రాంతం. ఈ ఊరు పొలిమేర దాటి అడవిలోకి వెళ్లినోళ్లు ప్రాణాలతో తిరిగి రారు. ఇదే ఊరిలో ఓ అనాథ లింగ (ధృవ వాయు). అదే ఊరిలో ఉండే పద్దు (ప్రగ్యా నయన్) ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈమె తండ్రి వీళ్ల ప్రేమకు అడ్డుచెబుతాడు. ఊరిపెద్ద దగ్గరున్న పొలం తనఖా విడిపిస్తేనే పెళ్లి చేస్తానని అంటాడు. కొన్ని గొడవల కారణంగా ఊరికి దగ్గరలోని అడవిలోకి లింగ, అతడి స్నేహితుడు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ అడవిలో ఏముంది? చివరకు ఏమైందనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
కళింగ అనే సంస్థానం గురించి చెబుతూ సినిమాని మొదలుపెట్టారు. ఇక్కడ ప్రజలు వింతగా ప్రవరిస్తూ తమని తాము చంపుకొంటూ ఉంటారని, అడవిలోకి వెళ్లినోళ్లు తిరిగి రారని చెప్పి క్యూరియాసిటీ పెంచారు. ఆ తర్వాత లింగ-పద్దు లవ్ స్టోరీ.. ఊరిపెద్దతో లింగ తమ్ముడు గొడవ ఇలా స్టోరీ అంతా సెట్ చేసి ఫస్టాప్ నడిపించేశారు. తన పెళ్లి కోసం అడవిలోకి లింగ వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఇంటర్వెల్ పడుతుంది.
అడవిలో ఏముంది? లోపలికి వెళ్లిన వాళ్లు ఎందుకు తిరిగి రావట్లేదు? అనే ప్రశ్నలకు సమాధానాలని సెకండాఫ్‌లో చెప్పారు. చివర్లో అసురభక్షి పాంయిట్ కొత్తగా అనిపిచింది. అయితే సినిమా పరంగా చూసుకుంటే పాయింట్ బాగున్నప్పటికీ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. కళింగ కథని వాయిస్ ఓవర్‌తో చెప్పించేశారు. విజువల్‌గా చూపించి ఉంటే బాగుండేది. లవ్ స్టోరీ రొటీన్. కథ అక్కడక్కడ పక్కదారి పట్టిన ఫీలింగ్ కలుగుతుంది. హారర్ డోస్ కూడా కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది.
ఎవరెలా చేశారు?
హీరో కమ్ దర్శకుడిగా ధృవవాయు ఆకట్టుకున్నాడు. లింగ పాత్రలో పర్వాలేదనిపించాడు. డైరెక్టర్‌గా కొన్నిచోట్ల మాత్రం ఆశ్చర్యపరిచాడు. హీరోయిన్‌గా చేసిన ప్రగ్యా నయన్ గ్లామర్ పరంగా న్యాయం చేసింది. లక్ష‍్మణ్, ఆడుకాలం నరేన్, మురళీధర్ గౌడ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. బీజీఎం బాగుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment