Dhruva Vaayu
-
ఓటీటీలో హారర్, థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కళింగ' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. టాలీవుడ్లో 'కిరోసిన్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ధృవ వాయు ఇందులో హీరోగా నటించాడు. అయితే, కళింగ చిత్రానికి దర్శకుడిగా కూడా ధృవ వాయు పనిచేశారు. ప్రగ్యా నయన్ హీరోయిన్గా నటించిగా మీసాల లక్ష్మణ్, ఆడుకాలం నరేన్, బలగం సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.హారర్ ఎలిమెంట్స్‌కు కాస్త ఫాంటసీ అంశాలను చేర్చి ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. సెప్టెంబర్ 13న విడుదలైన కళింగ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు సుమారు రూ. 5కోట్ల మేరకు కలెక్షన్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ కూడా ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఓటీటీలోకి కళింగ విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 2 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందన ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.కథేంటి..?కళింగ అనే ప్రాంతం. ఈ ఊరు పొలిమేర దాటి అడవిలోకి వెళ్లినోళ్లు ప్రాణాలతో తిరిగి రారు. ఇదే ఊరిలో ఓ అనాథ లింగ (ధృవ వాయు). అదే ఊరిలో ఉండే పద్దు (ప్రగ్యా నయన్) ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈమె తండ్రి వీళ్ల ప్రేమకు అడ్డుచెబుతాడు. ఊరిపెద్ద దగ్గరున్న పొలం తనఖా విడిపిస్తేనే పెళ్లి చేస్తానని అంటాడు. కొన్ని గొడవల కారణంగా ఊరికి దగ్గరలోని అడవిలోకి లింగ, అతడి స్నేహితుడు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ అడవిలో ఏముంది? చివరకు ఏమైందనేదే స్టోరీ. -
'కళింగ' సినిమా రివ్యూ
ప్రస్తుతం టాలీవుడ్లో డివోషనల్ టచ్ ఉండే మూవీస్ హిట్స్ కొడుతున్నాయి. మరోవైపు హారర్ జానర్ అనేది ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసి తీసిన సినిమా 'కళింగ'. ధృవ వాయు హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. ప్రగ్యా నయన్ హీరోయిన్. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?కళింగ అనే ప్రాంతం. ఈ ఊరు పొలిమేర దాటి అడవిలోకి వెళ్లినోళ్లు ప్రాణాలతో తిరిగి రారు. ఇదే ఊరిలో ఓ అనాథ లింగ (ధృవ వాయు). అదే ఊరిలో ఉండే పద్దు (ప్రగ్యా నయన్) ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈమె తండ్రి వీళ్ల ప్రేమకు అడ్డుచెబుతాడు. ఊరిపెద్ద దగ్గరున్న పొలం తనఖా విడిపిస్తేనే పెళ్లి చేస్తానని అంటాడు. కొన్ని గొడవల కారణంగా ఊరికి దగ్గరలోని అడవిలోకి లింగ, అతడి స్నేహితుడు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ అడవిలో ఏముంది? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?కళింగ అనే సంస్థానం గురించి చెబుతూ సినిమాని మొదలుపెట్టారు. ఇక్కడ ప్రజలు వింతగా ప్రవరిస్తూ తమని తాము చంపుకొంటూ ఉంటారని, అడవిలోకి వెళ్లినోళ్లు తిరిగి రారని చెప్పి క్యూరియాసిటీ పెంచారు. ఆ తర్వాత లింగ-పద్దు లవ్ స్టోరీ.. ఊరిపెద్దతో లింగ తమ్ముడు గొడవ ఇలా స్టోరీ అంతా సెట్ చేసి ఫస్టాప్ నడిపించేశారు. తన పెళ్లి కోసం అడవిలోకి లింగ వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఇంటర్వెల్ పడుతుంది. అడవిలో ఏముంది? లోపలికి వెళ్లిన వాళ్లు ఎందుకు తిరిగి రావట్లేదు? అనే ప్రశ్నలకు సమాధానాలని సెకండాఫ్‌లో చెప్పారు. చివర్లో అసురభక్షి పాంయిట్ కొత్తగా అనిపిచింది. అయితే సినిమా పరంగా చూసుకుంటే పాయింట్ బాగున్నప్పటికీ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. కళింగ కథని వాయిస్ ఓవర్‌తో చెప్పించేశారు. విజువల్‌గా చూపించి ఉంటే బాగుండేది. లవ్ స్టోరీ రొటీన్. కథ అక్కడక్కడ పక్కదారి పట్టిన ఫీలింగ్ కలుగుతుంది. హారర్ డోస్ కూడా కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?హీరో కమ్ దర్శకుడిగా ధృవవాయు ఆకట్టుకున్నాడు. లింగ పాత్రలో పర్వాలేదనిపించాడు. డైరెక్టర్‌గా కొన్నిచోట్ల మాత్రం ఆశ్చర్యపరిచాడు. హీరోయిన్గా చేసిన ప్రగ్యా నయన్ గ్లామర్ పరంగా న్యాయం చేసింది. లక్ష్మణ్, ఆడుకాలం నరేన్, మురళీధర్ గౌడ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. బీజీఎం బాగుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. -
Kalinga : టీజర్ అదిరింది.. బిజినెస్ పెరిగింది
కంటెంట్ కొత్తగా ఉంటే చాలు.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాను హిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో ప్రయోగాత్మక చిత్రాలు వరుసగా వస్తున్నాయి. అలా డిఫరెంట్ కంటెంట్‌తో తెరకెక్కిన తాజా చిత్రమే ‘కళింగ’. కిరోసిన్ హిట్‌తో పేరు తెచ్చుకున్న ధృవ వాయు మరోసారి విభిన్నమైన కథతో... వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న కళింగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన ప్రతి అప్డేట్ మంచి అటెన్షన్‌ను డ్రా చేసింది. ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా బిజినెస్ కూడా ఊపందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం ఓవర్సీస్ హక్కులను, ఇప్పటి వరకు పలు బిగ్ ప్రాజెక్ట్ చిత్రాలను పంపిణీ చేసిన పీహెచ్ఎఫ్ ఎల్ఎల్సీ సంస్థ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా హిందీ రైట్స్ కోసం కూడా పలు సంస్థలు పోటీపడుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ 'నేటి ట్రెండ్‌కు తగ్గ కథాంశంతో.. ఫిక్షనల్ డ్రామా విత్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రూపొందుతున్న సినిమా ఇది. ముఖ్యంగా ఈ చిత్రానికి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే అనేది బిగ్గెస్ట్ ప్లస్ అవుతుంది. ఆడియన్స్ ని ప్రతి సన్నివేశంలో థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది. ముఖ్యంగా టీజర్లో ఉన్న సంభాషణలు, హీరో ధృవ వాయి నటన, స్క్రీన్ ప్రెజెన్స్.. విజువల్స్, ఆర్ఆర్ ఎంతో బజ్‌ను తీసుకొచ్చాయి. ఇది కేవలం టీజర్ మాత్రమే.. ఇక సినిమాలో కొన్ని సన్నివేశాలు ఆడియన్సకు గూజ్ బంప్స్ తీసుకొస్తాయి. చిత్ర ప్రమోషన్స్‌ను కూడా అగ్రెసివ్‌గా చేస్తున్నాం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి' అన్నారు. -
ఆసక్తి రేపుతున్న ‘కళింగ’ ఫస్ట్ లుక్
‘కిరోసిన్’ ఫేమ్ ధృవ వాయు మరో కొత్త కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కళింగ’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. లెజెండరీ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి టీమ్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.కళింగ అనే టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది. పోస్టర్లో హీరో, అతని వెనకాల లక్ష్మీ నరసింహా స్వామి ఉగ్ర రూపంలో ఉన్న విగ్రహం, హీరో చేతిలోని ఆ కాగడ.. మొత్తం ఆ సెటప్‌ను చూస్తుంటే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తుండగా, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.