
‘కిరోసిన్’ ఫేమ్ ధృవ వాయు మరో కొత్త కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కళింగ’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

లెజెండరీ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి టీమ్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
కళింగ అనే టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది. పోస్టర్‌లో హీరో, అతని వెనకాల లక్ష్మీ నరసింహా స్వామి ఉగ్ర రూపంలో ఉన్న విగ్రహం, హీరో చేతిలోని ఆ కాగడ.. మొత్తం ఆ సెటప్‌ను చూస్తుంటే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తుండగా, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment