మూడు పాత్రల్లో బ్యాంకాక్ బ్రహ్మానందం | 'Bangkok Brahmanandam' in Three Role | Sakshi
Sakshi News home page

మూడు పాత్రల్లో బ్యాంకాక్ బ్రహ్మానందం

Published Thu, Jan 2 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM

మూడు పాత్రల్లో బ్యాంకాక్ బ్రహ్మానందం

మూడు పాత్రల్లో బ్యాంకాక్ బ్రహ్మానందం

 చాలా విరామం తర్వాత బ్రహ్మానందం హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘బ్యాంకాక్ బ్రహ్మానందం’. ‘అందాలరాముడు’ ఫేం పి.లక్ష్మీనారాయణ(దీప్తి) ఈ చిత్రానికి దర్శకుడు. రాజా కృష్ణభగవాన్, ముత్యాల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇది కుటుంబ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఫిలిం. ఇందులో బ్రహ్మానందంగారి పాత్ర మూడు డైమన్షన్లలో సాగుతుంది. పెళ్లిల్లలో సన్నాయి వాయించేవాడిగా, సంగీతం మాస్టారిగా, పాప్‌సింగర్‌గా మూడు రకాలుగా కనిపిస్తారాయన. 
 
 ఆయన నటనే ఇందులో హైలైట్. నా ‘అందాలరాముడు’ సినిమాను మించిన విజయాన్ని ఈ సినిమా సాధిస్తుందని నమ్మకంగా చెప్పగలను’’ అని చెప్పారు. రచయిత ఆర్‌కే భగవాన్ అందించిన కథ ఈ చిత్రానికి ప్రధాన బలమని, కుటుంబం మొత్తం హాయిగా నవ్వుకునేలా ఇందులో బ్రహ్మానందం కామెడీ ఉంటుందని సహ నిర్మాత ఐ.హరికృష్ణ చెప్పారు. రషస్ చూశాక సినిమా విజయంపై వందశాతం నమ్మకం ఏర్పడిందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: టి.సాయినాథ్, కథనం: గంగోత్రి విశ్వనాథ్, గోపి వెంకటేష్, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement