పులివెందుల: పులివెందుల పట్టణంలోని పీబీసీ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీమహాలక్ష్మి ఆలయంలోనూ, ఆర్యవైశ్య కాలనీ సమీపంలో ఉన్న శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో సోమవారం అర్థరాత్రి దొంగలు పడ్డారు. మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి తాళిబొట్లు 2, గిన్నెబాట్లు 2, లక్ష్మీకాసులు 2, తీర్థం గిన్నెలు దోచుకెళ్లారు. మొత్తం నాలుగు తులాల బంగారు అపహరణకు గురైంది. అలాగే హుండీలను పగులగొట్టి అందులోని నగదును కూడా ఎత్తుకెళ్లారు. ఆర్యవైశ్య కాలనీలోని శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయంలో విలువైన వస్తువులు దొరకకపోవడంతో హుండీని పగులగొట్టి అందులోని నగదును మాత్రమే తీసుకెళ్లారు. ఒకే రోజు పట్టణంలోని రెండు ఆలయాల్లో దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పులివెందుల అర్బన్ సీఐ ప్రసాద్‌తోపాటు కడప నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించారు.