
ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ‘డ్రాగన్’ (Dragon) సినిమాతో నటుడు రవీందర్ పేరు మరోసారి నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో ఫేక్ సర్టిఫికెట్లు సరఫరా చేసే వ్యక్తిగా ఆయన కనిపించాడు. ఆయన గతంలో పలు సినిమాలకు నిర్మాతగా కూడా ఉన్నారు. డ్రాగన్ సినిమా తనకు చాలా పేరు తీసుకొచ్చిందని సంతోషంలో ఉన్నారు. తాజాగా ఆయన సతీమణి మహాలక్ష్మితో పాటు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో పలు విషయాలను రవీందర్ పంచుకున్నాడు. తనకు పెళ్లి అయిన తర్వాత చాలామంది హేళన చేశారని వాపోయాడు. ఇంత అందమైన అమ్మాయితో పెళ్లి ఏంటి అంటూ కొందరు మెసేజ్‌లు కూడా చేశారని ఇలా చెప్పుకొచ్చాడు.

మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి తర్వాత చాలా విమర్శలు వచ్చినా కూడా భరించాము. కొద్దిరోజుల తర్వాత మేమిద్దరం విడాకులు తీసుకున్నామని, విడిపోయామని కూడా వార్తలు వచ్చాయి. అది చూసి నవ్వుకున్నాం. ఇంత అందమైన స్త్రీ ఇంత శరీరాకృతి ఉన్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంది..? ఈ పెళ్లి ఎన్ని రోజులు ఉంటుందిలే అంటూ అందరూ హేళన చేసే వాళ్లే కనిపించారు. కొందరైతే మేము విడాకులు తీసుకుని విడిపోయి వేరువేరుగా ఉంటున్నామని ప్రచారం చేశారు.
ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారీ.. మేం కలిసి ఉన్నాము అంటూ ఫోటోలు పోస్ట్ చేస్తూ రూమర్స్‌కు ముగింపు పలుకుతున్నాం. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. కొందరి చేస్తున్న హేళన తట్టుకోలేక ఎన్నోసార్లు ఫోటోలు షేర్ చేస్తూ బతుకుతున్నాం. చాలామందికి వారి జీవితం ఏమౌతుందో అనే కంటే ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.' అని ఆయన అన్నారు.

వెన్నుపోటు పొడిచారు: మహాలక్ష్మి
ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న మహాలక్ష్మి చెప్పుకొచ్చారు. 'నమ్మిన వ్యక్తులే మాకు వెన్నుపోటు పొడిచారు. మాతో సన్నిహితంగా ఉంటూనే అలాంటి పనిచేశారు. ఎప్పుడైతే మనం ఇతరులను సర్వస్వం అని నమ్ముతామే వాళ్లే వెన్నుపోటు పొడుస్తారు. శత్రువు కూడా అలాంటి పనిచేయడు. మనతో పాటు ఉన్నవాడు, మనకు బాగా తెలిసినవాడు మాత్రమే మన వెన్నులో పొడవగలడు. మన జీవితంలో అమ్మ, నాన్న, భర్త, పిల్లలు తప్ప ఎవరినీ నమ్మలేని పరిస్థితి ఉందని' ఆమె చెప్పింది. అయితే, వారికి నష్టం చేసిన వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు. కొద్దిరోజుల క్రితం ఆర్థిక లావాదేవీల విషయంలో రవీందర్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. నమ్మిన వ్యక్తి వల్లే తమకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆమె గతంలో కూడా ఒకసారి చెప్పింది.
కోలీవుడ్‌లో సన్ మ్యూజిక్‌లో హోస్ట్‌గా చేసిన మహాలక్ష్మి ఆపై సీరియల్స్‌తో మరింత పాపులర్ అయింది. ఆమెకు అనిల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ, ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. తదనంతరం, నిర్మాత రవీందర్‌ని ప్రేమించి ఆమె పెళ్లి చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment