
ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయించండి
రోశయ్య డిమాండ్
కల్వకుర్తి: ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పా టు చేసి రూ.1000 కోట్లు కేటాయిం చాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన ఆర్యవైశ్యుల చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్యులు ఎదుర్కొం టున్న సమస్యలపై కేంద్రానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా కలసి వివరిస్తానని చెప్పారు.
ప్రధానంగా ఈబీసీ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.