వైఎస్‌ జగన్‌కు ఆర్యవైశ్య మహాసభ ధన్యవాదాలు | Arya Vysya corporation says thanks to ys jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు ఆర్యవైశ్య మహాసభ ధన్యవాదాలు

Published Sun, Aug 6 2017 12:52 AM | Last Updated on Mon, Aug 20 2018 5:04 PM

Arya Vysya corporation says thanks to ys jagan

సాక్షి ప్రతినిధి, చెన్నై: అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటుచేస్తామని నంద్యాల బహిరంగ సభలో ప్రకటించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం రూ.1,000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు.

వైశ్యుల్లో బీదవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలే ఆదుకోవాలనే తమ ఆక్రందనకు అందరికంటే ముందుగా స్పందించిన జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలని అన్నారు. ఆర్య వైశ్యుల గురించి భారతదేశంలోనే తొలిసారిగా ఈ ప్రకటన చేసినందుకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరపున హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement