రాష్ట్రానికి అమరజీవి పొట్టిశ్రీరాములు అందించిన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. అమరజీవి 62వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కోవెలకుంట్లలోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండేకంటి సుబ్రమణ్యం మాట్లాడుతూ... తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి త్యాగశీలి అయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించకపోవడం విచారకరమన్నారు.