ఈ నెల 12న తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య జడ్చర్లకు రానున్నారు. ఆర్యవైశ్య యువజన సంఘం సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో ....
జడ్చర్ల: ఈ నెల 12న తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య జడ్చర్లకు రానున్నారు. ఆర్యవైశ్య యువజన సంఘం సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ముఖ్యఅథితిగా విచ్చేయనున్నారు. బాదేపల్లి వాసవి కన్యకా పరమేశ్వరీ ఆలయంలో నిర్వహించే ఆర్యవైశ్య రజతోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు రోశయ్యను ఆహ్వానించారు. వేడుకల్లో పాల్గొనేందుకు వస్తానని ఆయన అంగీకరించినట్లు ఆర్యవైశ్య సంఘం నాయకులు సోమవారం మీడియాకు వివరించారు.