Governor K. Rosaiah
-
12న జడ్చర్లకు తమిళనాడు గవర్నర్ రోశయ్య
జడ్చర్ల: ఈ నెల 12న తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య జడ్చర్లకు రానున్నారు. ఆర్యవైశ్య యువజన సంఘం సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ముఖ్యఅథితిగా విచ్చేయనున్నారు. బాదేపల్లి వాసవి కన్యకా పరమేశ్వరీ ఆలయంలో నిర్వహించే ఆర్యవైశ్య రజతోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు రోశయ్యను ఆహ్వానించారు. వేడుకల్లో పాల్గొనేందుకు వస్తానని ఆయన అంగీకరించినట్లు ఆర్యవైశ్య సంఘం నాయకులు సోమవారం మీడియాకు వివరించారు. -
సామాజిక బాధ్యతల్ని గుర్తెరిగి చిత్రాలు తీయాలి
సామాజిక బాధ్యతల్ని గుర్తెరిగి చిత్రాలు నిర్మించాలని అఖిల భారత సమా ఖ్య అధ్యక్షుడు డాక్టర్ సీఎం కే రెడ్డి హితవు పలికారు. నటుడు కిషోర్, హార్తిక జంటగా నటిస్తున్న చిత్రం కాదలి కానవిళై్ల. ఇం తకుముందు మనునీతి, కాసు ఇరుక్కుణం, ఎంగరాణి నల్లరాణి వంటి చిత్రాలను నిర్మించిన జీఆర్ గోల్డ్ ఫిలింస్ సంస్థ అధినేత ఆర్పీ పూరణి నిర్మిస్తున్న తాజా చిత్రం కాదలి కానవిళై్ల. రవిరాజా కథ, కథనం, మాట లు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రానికి దేవా సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చెన్నైలో జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ కె.రోశయ్య ముఖ్య అతిథిగా హాజరై ఆడియోను ఆవిష్కరించారు. ఆయనతో పాటు తెలుగు ప్రముఖులు డాక్టర్ సీఎంకే రెడ్డి, తెలుగు తెర అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ, సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ, నటుడు సుమన్, ప్రఖ్యాత గాయని పి.సుశీల హాజరయ్యారు. ముందుగా పి.సుశీల ప్రార్థనా గీతంతో కార్యక్రమం మొదలైంది. డాక్టర్ సీఎంకే రెడ్డి మాట్లాడుతూ సినిమాలో యువతను ప్రోత్సహించే లా ఉండాలన్నారు. ఇక సంగీతం విషయానికి వస్తే నాటి పాటలు ఇప్పటికీ ఎంతో మధురంగా ఉంటాయన్నారు. మంచి సంగీతంతో కూడిన పాటలు రూపొందించాలని అన్నారు. -
‘అగ్రి’ అవుట్
మంత్రి పదవి నుంచి కృష్ణమూర్తి తొలగింపు వ్యవసాయ ఇంజనీరు ఆత్మహత్యే కారణమా? సాక్షి, చెన్నై : వ్యవసాయ శాఖ మంత్రి అగ్రి కృష్ణమూర్తికి ఉద్వాసన పలికారు. సీఎం పన్నీరు సెల్వం సిఫారసుకు రాష్ర్ట గవర్నర్ కొణిజేటి రోశయ్య శనివారం రాత్రి ఆమోద ముద్ర వేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వ కేబినెట్లో తరచూ మార్పులు చేర్పులు సహజం. ఎలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినా, ఫిర్యాదులు వచ్చినా తక్షణం మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలకడం సాధారణం. ఈతతంగం అంతా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సీఎంగా ఉన్న సమయంలో సాగేది. అయితే, ఆమె అడుగుజాడల్లో సీఎం పన్నీరు సెల్వం ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతోంది. గత వారం రోజులకు పైగా వ్యవసాయశాఖ మంత్రి అగ్రి కృష్ణమూర్తిపై తీవ్ర ఆరోపణ మీడియాల్లో హల్చల్ చేస్తుండడం, ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుండడంతో ఆయనకు పదవీ గండం తప్పదన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, అందుకు తగ్గ ఎలాంటి చర్యల్ని సీఎం పన్నీరు సెల్వం తీసుకోలేదు. రెండు రోజుల క్రితం పార్టీ పరంగా ఉన్న పదవిని అగ్రి కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆయనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందన్నట్టుగా ప్రచారం బయలు దేరింది. వ్యవసాయ శాఖ ఇంజనీరు ఆత్మహత్యలో అగ్రి వ్యవహరించిన తీరే కారణమని తేలినట్టు సమాచారం. ఈ ఆత్మహత్యపై కాంగ్రెస్, పీఎంకేలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. మంత్రి ఒత్తిడి తాళలేక ఆ ఇంజనీరు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆరోపణలు గుప్పించారు. అలాగే, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ శనివారం ఈ వ్యవహారంపై స్పందించారు. మంత్రి తప్పు చేయనప్పుడు కేసును సీబీఐకు అప్పగించవచ్చుగా అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అగ్రి కృష్ణమూర్తికి ఉద్వాసన పలికే రీతిలో సీఎం పన్నీరు సెల్వం ఆగమేఘాలపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ర్ట గవర్నర్ కొణిజేటి రోశయ్యకు సిఫారసు చేశారు. సీఎం సిఫారసుకు ఆమోద ముద్రను గవర్నర్ తెలియజేయడంతో అగ్రి పదవి ఊడింది. ఆయన వద్ద ఉన్న వ్యవసాయ శాఖతో పాటుగా మరికొన్ని శాఖల్ని సీనియర్ మంత్రి వైద్యలింగంకు అదనంగా అప్పగించారు. పార్టీ పదవి, మంత్రి పదవి ఊడిన దృష్ట్యా, ఆ అధికారి ఆత్మహత్య వెనుక అగ్రి హస్తం ఉందన్న ప్రచారం బయలు దేరింది. ఆయనపై కేసు న మోదు చేసి అరెస్టు చేయాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
శాసనసభ రసాభాస
అసెంబ్లీని ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ కే రోశయ్య చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు బుధవారం జరిగిన శాసనసభ సమావేశాలు రసాభాసగా మారాయి. విపక్ష సభ్యులంతా అధికార పక్షంపై విరుచుకుపడడంతోగందరగోళం నెలకొంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17న ప్రారంభం కాగా గవర్నర్ రోశయ్య తన ప్రసంగంలో రాష్ట ప్రభుత్వ పథకాలను ప్రశంసించారు. దీనిపై సహజంగానే విపక్షాలు విమర్శలను గుప్పించాయి. గవర్నర్ హోదాలో ఉన్న రోశయ్య అన్నాడీఎంకే నేతలాగా వ్యవహరించారని డీఎంకే అధినేత కరుణానిధి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో సైతం డీఎంకే సభ్యులు అధికార పక్షాన్ని విమర్శలతో ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. ధన్యవాద తీర్మానంపై శాసనసభాపక్ష ఉపనేత పొల్లాచ్చి జయరామన్ మాట్లాడుతూ, జయ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. క ర్ణాటక జైలులో ఉన్నపుడు జయ ముఖార విందాన్ని ఎప్పుడు చూస్తామోనని ప్రజలు తపించారన్నారు. అందుకే ఆమె మాజీ ముఖ్యమంత్రికాదు ప్రజల ముఖ్యమంత్రిగా కీర్తినొందారని అన్నారు. జయను వరుసగా కీర్తించడంపై డీఎంకే సభ్యులు అడ్డుతగిలి ప్రసంగించబోగా స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో వారంతా స్పీకర్ పోడియంను కొద్దిసేపు చుట్టుముట్టారు. జయరామన్ ఒట్టి అమాయకుడని వ్యాఖ్యానించారు. 2011 తరువాత వచ్చిన ప్రతి ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించిందని అధికార పక్ష సభ్యులు చెప్పడంతో తాజావి మాత్రమేకాదు గతంలో జరిగిన ఎన్నికలను కూడా బేరీజు వేసుకోవాలని డీఎంకే సభ్యులు వైద్యలింగం వ్యాఖ్యానించారు. శ్రీలంక యుద్ధం సమయంలో అధికారంలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్ తమిళులకు వ్యతిరేకంగా వ్యవహరించాయని వ్యాఖ్యానించడంతో మళ్లీ పోడియంవైపు దూసుకొచ్చారు. అధికార విపక్షాల మధ్య రగడ సాగుతున్నా సభలోనే ఉన్న ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నోరుమెదపలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన డీఎంకే సభ్యులు సుమారు 15 నిమిషాలపాటూ సభలో నినాదాలు, కేకలతో బీభత్స వాతావరణం సృష్టించారు. డీఎంకే సభ్యుల వల్ల అసెంబ్లీ సమావేశాలకు ఆటంకం ఏర్పడుతున్నందున వెలుపలకు పంపేయాలని స్పీకర్ ధనపాల్ మార్షల్స్‌ను ఆదేశించారు. అనంతరం బయటకు వచ్చిన స్టాలిన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, అటవీ కళాశాల విద్యార్థులు ఆమరణ దీక్ష చేస్తున్నారని, రవాణా ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారని చెప్పారు. ఈ అంశాలను ప్రస్తావించే అవకాశం ఇవ్వకపోవడంతో తాము సభను నిలదీయాల్సి వచ్చిందని చెప్పారు. గత సభలో ప్రవేశపెట్టిన 645 తీర్మానాల్లో ఒక్కటికూడా నోచుకోలేదని, ఈ సమావేశాల్లో సైతం ఆశలు లేవని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు విజయధారణి తదితరులు వాకౌట్ చేశారు. -
పస లేని ప్రసంగం
కొత్తదనం లేకుండానే, ఉన్నట్టుగా చూపిస్తూ, గవర్నర్ కొణిజేటి రోశయ్య నోట పసలేని ప్రసంగాన్ని రాష్ర్ట ప్రభుత్వం పలికించిందంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్ అని గవర్నర్ కితాబు ఇవ్వడంతో, ఆయన ప్రసంగాన్ని బహిష్కరిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి. సభా పర్వాన్ని 4 రోజులకే పరిమితం చే స్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సాక్షి, చెన్నై : కొత్త సంవత్సరంలో తొలి అసెంబ్లీ సమావేశం అనగానే ప్రాధాన్యత నెలకొంటుంది. తొలి రోజు గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీ. ఈ ప్రసంగం ద్వారా ఏడాదిలో చేపట్టబోయే సరికొత్త పథకాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్ నోట పలికిస్తుంటారు. అయితే, ఈ ఏడాది అందుకు భిన్నంగా గవర్నర్ ప్రసంగాన్ని రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిందని చెప్పవచ్చు. తమ అమ్మ జయలలితకు ఎదురైన కష్టాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగాన్ని సైతం పస లేకుండా రూపొందించారన్న విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి సీఎం పన్నీరు సెల్వంకు నెలకొంది. సీఎంగా పన్నీరు సెల్వంకు కొత్త ఏడాదిలో తొలి సమావేశం ఇది. అలాగే, గవర్నర్ ప్రసంగంతో ఆరంభం అయ్యే సభా పర్వం కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఇందు కోసం ప్రభుత్వం జార్జ్ కోటలో ఏర్పాట్లు చేసింది. అయితే, మునుపటి వల్లే పలు రకాల పువ్వులతో అలంకరణలు లేవు. హంగు ఆర్భాటాలు లేవు. అలాగే, ప్రజలకు ఈ ఏడాది ఎలాంటి కొత్త ప్రగతి పథకాలు లేవన్నట్టుగా సభా పర్వం మంగళవారం ఉదయం 11.15 గంటలకు ఆరంభమైంది. అసెంబ్లీ ఆవరణలోకి వచ్చిన రోశయ్యకు స్పీకర్ ధనపాల్ ఆహ్వానం పలికారు. అసెంబ్లీలో సభ్యులందరూ గవర్నర్ రోశయ్యను మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. గత సమావేశాల్లో మంత్రుల వరుసలో కూర్చున్న సీఎం పన్నీరు సెల్వం ఈ సారి సీఎం సీటులో కూర్చోవడం విశేషం. దీంతో ఆ సీటుకు గౌరవాన్ని ఇస్తూ, డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ నమస్కారం చేయక తప్పలేదు. సభ ఆరంభం కాగానే, రోశయ్య ప్రసంగం ఆరంభమైంది. 45 నిమిషాల పాటుగా ఆయన ప్రసంగం సాగింది. అయితే, ఇందులో కొత్తదనం లేకపోవడంతోపాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్ అని గవర్నర్ కితాబు ఇవ్వడం డీఎంకే, సీపీఐ, పుదియ తమిళగంలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ, ఆయన ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ డుమ్మా కొట్టినా, డీఎండీకే సభ్యులు, సీపీఎం, ఎంఎంకే, ఎస్ఎంకే, పీఎంకే, కాంగ్రెస్ సభ్యులు సభలో ఆశీనులై గవర్నర్ రోశయ్య ప్రసంగాన్ని ఆలకించారు. ప్రసంగంలో మచ్చుకు కొన్ని తన ప్రసంగంలో కొన్ని నిర్ణయాలు, గతంలో ప్రభుత్వం చేసిన గొప్పలను ఎత్తి చూపుతూ గవర్నర్ రోశయ్య వ్యాఖ్యానించాల్సి వచ్చింది. అన్ని గ్రామాలకు ప్రజా సేవా కేంద్రాల విస్తరణ, అరసు కేబుల్ విస్తరణ, క్రీడాకారులకు ప్రోత్సాహం, పెట్టుబడి దారుల్ని ఆహ్వానించే విధంగా మేలో మహానాడు నిర్వహణ, జపాన్ బ్యాంక్ ద్వారా నిధుల్ని రాబట్టడమే లక్ష్యంగా కొన్ని ప్రకటనలు చేశారు. ఇక, కచ్చదీవుల స్వాధీనంతోనే జాలర్ల సమస్యకు పరిష్కారం సాధ్యమన్నారు. శ్రీలంక తమిళులకు కొత్త ప్రభుత్వంతో ఒరిగేది శూన్యమేనని విమర్శించారు. వారికి సకల ఏర్పాట్లు చేసినానంతరం శిబిరాల నుంచి వారి వారి స్వదేశాలకు ఈలం తమిళుల్ని పంపించే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీల ఏర్పాటులో తమిళనాడుకు ప్రాధాన్యత కల్పించాలని, రాష్ట్రంలోని కార్పొరేషన్లను ఆ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరారు. టెక్నాలజీని అంది పుచ్చుకుని అన్ని ప్రభుత్వ సేవల్ని ఆన్లైన్ ద్వారా అందిస్తున్న విధానం గురించి వివరించారు. కోయంబేడు - ఆలందూరు మధ్య త్వరలో మెట్రో రైలు సేవలు ఆరంభం కానున్నాయని పేర్కొన్నారు. తిరువొత్తియూర్ వరకు మెట్రో సేవల విస్తరణకు త్వరలో ఆమోదం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నదీ జలాల పరిరక్షణలో, మహిళా, శిశు సంరక్షణలో, వ్యవసాయ రంగం పటిష్టత , ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు. అలాగే, రాష్ట్రంలో శాంతి భద్రతల పనితీరుపై పోలీసు యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అమ్మ సిమెంట్ రికార్డుల్లోకి ఎక్కిందని పేర్కొంటూ, విజన్ -2023లోని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ ప్రసంగం చేశారు. కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నట్టు తెలిపారు. అలాగే, ముల్లై పెరియార్‌కు వ్యతిరేకంగా కేరళ, కావేరి జలాల్ని అడ్డుకునే రీతిలో కర్ణాటక కొత్త డ్యాంల నిర్మాణానికి చేస్తున్న ప్రయత్నాల్ని ఖండిస్తూ, అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. సభా పర్వం తొలి రోజు ముగియగానే, అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశమై సభను నాలుగు రోజులు నడిపించేందుకు నిర్ణయించారు. విమర్శలు : గవర్నర్ ప్రసంగంపై ప్రతి పక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. పస లేని ప్రసంగంలా సాగిందని మండి పడుతున్నాయి. వాకౌట్ అనంతరం బయటకు వచ్చిన డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ ప్రభుత్వ తీరుపై శివాలెత్తారు. వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. నోటుతో ఓట్లను కొనుగోలు చేసి శ్రీరంగంలో గెలిచారని విమర్శించారు. బినామీ పాలన రూపంలో ప్రజలకు అష్టకష్టాలు తప్పదని హెచ్చరించారు. పుదియ తమిళగం సభ్యుడు కృష్ణస్వామి, సీపీఐ సభ్యులు సైతం ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే అధినేత కరుణానిధి ఓ ప్రకటనలో గవర్నర్ ప్రసంగాన్ని ఎండమావిగా అభివర్ణించారు. ఎవరికి పనికి రాని ఈ ప్రసంగాన్ని ఎందుకు చదివి వినిపించారంటూ మండి పడ్డారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ పేర్కొంటూ, సంప్రదాయ బద్దంగా నమా అనిపించినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చదీవుల స్వాధీనంతో జాలర్ల సమస్యకు పరిష్కారం అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఐజేకే నేత పారివేందర్, ఎండీఎంకే నేత వైగో, పీఎంకే నేత రాందాసు, వీసీకే నేత తిరుమావళవన్, డీఎండీకే అధినేత విజయకాంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ తదితరులు గవర్నర్ రోశయ్య ప్రసంగంపై దుమ్మెత్తి పోశారు. సభను కేవలం నాలుగు రోజులకే పరిమితం చేయడం బట్టి చూస్తే, ఏ మేరకు ప్రజల మీద చిత్తశుద్ది ఉందో స్పష్టం అవుతోందన్నారు. గవర్నర్ ప్రసంగంలో పస లేని దృష్ట్యా, అసెంబ్లీ నిర్వహణ వృథా ప్రయాసేనని ధ్వజమెత్తారు. -
‘కొత్త’ వేడుకల కోలాహలం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు రాష్ట్రంలో అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ రోడ్లపైకొచ్చి చిందులేశారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలు రాగానే 2015కు ఘన స్వాగతం పలికారు. చెన్నై మెరీనాబీచ్ తీరం, ఫాంహౌస్‌లు, క్లబ్బులకు పేరుగాంచిన ఈసీఆర్ రోడ్డు జనంతో నిండిపోయూయి. స్టార్ హోటళ్లలో సందడి నెలకొంది. మెరీనాబీచ్ జనసంద్రంగా మారింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కరచాలనం చేసుకున్నారు. కేకులు కట్‌చేశారు. ఒక్కసారిగా రోడ్లపైకి దూసుకురావడంతో జనాన్ని అదుపుచేయడం పోలీసులకు కష్టమైంది. మద్యం మత్తలో జోగుతూ వాహనాలు నడిపేవారికి భారీ జరిమానా విధించారు. ఉట్టిపడిన ఆధ్యాత్మికత: చెన్నైలోని పార్థసారథి ఆలయం, తిరుచ్చీలోని శ్రీరంగనాథుని ఆలయంతో పాటు ఇతర ఆలయూల్లో వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ పార్థసారథి ఆలయంలో పూజలు చేయించారు. కిటకిటలాడిన శ్రీవారి ఆలయం చెన్నై టీనగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం కిటకిటలాడింది. శ్రీవారి భక్తులతో తిరుమలను తలపించింది. కొత్త ఏడాది, వైకుంఠ ఏకాదశి ఒకేసారి రావడంతో ఊహించని రీతిలో భక్తులు స్వామివారి సేవలో తరించారు. సహజంగా 12 గంటలు దాటగానే నిర్వహించే స్వామివారి దర్శనాన్ని తెల్లవారుజాము 4 గంటలకు మార్చినట్లు టీటీడీ స్థానిక సలహామండలి ప్రకటించింది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. అయినా భక్తులు బుధవారం రాత్రి 10 గంటల నుంచే క్యూ కట్టారు. ఆలయంలో స్వామివారికి చేపట్టిన ప్రత్యేక అలంకరణ ఆకట్టుకుంది. అనంతరం 3.30 గంటలకే సర్వదర్శనాన్ని ప్రారంభించారు. వీఐపీ భక్తుల కోసం పాస్‌లు జారీచేయగా ఆ క్యూసైతం పెరిగిపోయింది. సర్వదర్శనం క్యూ రెండు కిలోమీటర్ల దూరం దాటిపోయింది. భక్తులకు రూ.25 లడ్డూ, ప్రసాదంగా ఉచిత లడ్డూలను, పసుపు, కుంకుమలను పంపిణీ చేశారు. మధ్యాహ్నం గవర్నర్ కే రోశయ్య దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక సలహామండలి అధ్యక్షులు ఆనందకుమార్రెడ్డి, సభ్యులు కృష్ణారావు, మోహన్‌రావు, రవిబాబు, నారాయణగుప్త తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.