సామాజిక బాధ్యతల్ని గుర్తెరిగి చిత్రాలు తీయాలి
సామాజిక బాధ్యతల్ని గుర్తెరిగి చిత్రాలు నిర్మించాలని అఖిల భారత సమా ఖ్య అధ్యక్షుడు డాక్టర్ సీఎం కే రెడ్డి హితవు పలికారు. నటుడు కిషోర్, హార్తిక జంటగా నటిస్తున్న చిత్రం కాదలి కానవిళై్ల. ఇం తకుముందు మనునీతి, కాసు ఇరుక్కుణం, ఎంగరాణి నల్లరాణి వంటి చిత్రాలను నిర్మించిన జీఆర్ గోల్డ్ ఫిలింస్ సంస్థ అధినేత ఆర్‌పీ పూరణి నిర్మిస్తున్న తాజా చిత్రం కాదలి కానవిళై్ల. రవిరాజా కథ, కథనం, మాట లు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రానికి దేవా సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చెన్నైలో జరిగింది.
కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ కె.రోశయ్య ముఖ్య అతిథిగా హాజరై ఆడియోను ఆవిష్కరించారు. ఆయనతో పాటు తెలుగు ప్రముఖులు డాక్టర్ సీఎంకే రెడ్డి, తెలుగు తెర అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ, సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ, నటుడు సుమన్, ప్రఖ్యాత గాయని పి.సుశీల హాజరయ్యారు. ముందుగా పి.సుశీల ప్రార్థనా గీతంతో కార్యక్రమం మొదలైంది. డాక్టర్ సీఎంకే రెడ్డి మాట్లాడుతూ సినిమాలో యువతను ప్రోత్సహించే లా ఉండాలన్నారు. ఇక సంగీతం విషయానికి వస్తే నాటి పాటలు ఇప్పటికీ ఎంతో మధురంగా ఉంటాయన్నారు. మంచి సంగీతంతో కూడిన పాటలు రూపొందించాలని అన్నారు.