గజ్వేల్ : ఆర్యవైశ్యుల సంక్షేమానికి రూ.1,000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుంచి హైదరాబాద్ వరకు వైశ్యులు వేర్వేరుగా చేపట్టిన పాదయాత్రలను పోలీసులు అడ్డుకున్నారు. సరైన అనుమతులు లేవన్న కారణంతో అడ్డుకోవడంతో నిర్వాహకులు గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వైశ్య కార్పొరేషన్ సాధనకు సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ను కేంద్రంగా ఎంచుకొని ఆర్యవైశ్యులు సోమవారం ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు మహాపాదయాత్ర తలపెట్టారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ నేతృత్వంలో ఓ బృందం, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి (ఏసీపీఎస్) జాతీయ అధ్యక్షుడు ప్రేమ్‌గాంధీ నేతృత్వంలో మరో బృందం పాదయాత్రగా బయలుదేరింది. వీరికి వైఎస్సార్ సీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడక జగదీశ్వర్ గుప్తా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి మద్దతు ప్రకటించారు.
తొలుత కలిసి వెళదామనుకున్న వీరు..తరువాత విడివి డిగా పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ప్రేమ్‌గాంధీ పాదయాత్ర ముందుగా వెళ్లింది. ఆపై ఉప్పల శ్రీనివాస్ నేతృత్వంలో పాద యాత్ర వెళ్తుండగా ప్రజ్ఞాపూర్‌లోని ఐడీబీఐ బ్యాంకు వద్ద గజ్వేల్ ఇన్‌చార్జి సీఐ వెంకటేశ్, ఎస్సై కమలాకర్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆర్యవైశ్యులకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. ఈక్రమం లోనే ప్రేమ్‌గాంధీ నేతృత్వంలోని సభ్యులు రాజీవ్ రహదారిపై పాతూర్ కూరగాయల మార్కెట్‌ను దాటారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి వారినికూడా అడ్డుకు న్నారు.
దీంతో ప్రజ్ఞాపూర్ ఐడీబీఐ బ్యాంకు వద్ద పోలీసుల తీరును నిరసిస్తూ ఆర్యవైశ్యులు రాజీవ్ రహదారిపై బైఠాయించడంతో వాహ నాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఈ సందర్భంగా ఐవీఎఫ్ నేత ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైశ్య కార్పొరేషన్ సాధించే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. పాదయాత్ర విషయమై పోలీసు ఉన్నతాధికారుల తో రెండు మూడు రోజులనుంచే సంప్ర దింపులు జరిపామని, 5 వేల మందితో పాద యాత్ర చేపడతామని చెప్పగా వారు అంగీకరించారని గుర్తు చేశారు.
ఇప్పుడు పాద యాత్రను అడ్డుకోవడం ఎంత వరకు సమంజ సమని ప్రశ్నించారు. మరోవైపు ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై చర్యలు తీసు కోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గజ్వేల్‌లో బహిరంగసభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాస్తారోకోతో వాహనాల రాక పోకలు స్తంభించడంతో పాటు ఉద్రిక్తత నెల కొనడంతో పోలీసులు ఆందోళనకా రులను వెనక్కి పంపేశారు. కాగా, ప్రేమ్ గాంధీ నేతృ త్వంలో ఆయనతోపాటు ఒకరి ద్దరు మాత్రం పోలీసులను తప్పించుకొని రాత్రి వరకు పాదయాత్ర కొనసాగించినట్టు తెలిసింది. ఈ విషయమై గజ్వేల్ ఇన్‌చార్జి సీఐ వెంకటేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ, జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున పాద యాత్రను అడ్డుకున్నామన్నారు.