అనంతపురం కల్చరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారు కాగానే ఆర్యవైశ్యులు ఎంపీ దివాకర రెడ్డి ద్వారా అమ్మవారి శాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేలా ఒప్పించారు. అందుకు భారీగానే ఏర్పాట్లు చేసుకున్నారు. గుడి ముందు భారీ ఫ్లెక్సీలతో పాటు, సమావేశం నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. కానీ సోమవారం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం అమ్మవారి గుడికి రాకుండా నేరుగా ఆర్ అండ్ బీ గౌస్టుహౌసుకు వెళ్లిపోయారు.
వాస్తవానికి రూ.లక్షల విలువ చేసే వజ్రాల చీరను వాసవిమాతకు సీఎం చేతుల మీదుగా సమర్పిస్తారని ఎంపీ వర్గీయులు జోరుగా ప్రచారం సాగించారు. అందుకు వారం రోజుల నుండి విరామం లేకుండా కష్టపడ్డారు. అయితే చంద్రబాబు రాకపోవడంతో నిరాశ చెందారు. విజయవాడలో విచక్షణ లేకుండా ఆలయాలు కూల్చివేసిన ప్రభుత్వానికి భగవంతుని పట్ల భయభక్తులు ఉంటాయనుకోవడం పొరపాటేనని కొందరు వాపోయారు.
ఆర్యవైశ్యులను నిరాశ పరిచిన ముఖ్యమంత్రి
Published Mon, Aug 15 2016 11:33 PM | Last Updated on Mon, Aug 20 2018 5:04 PM
Advertisement