తిరుపతి సెంట్రల్: దక్షిణాది రాష్ట్రాల ఆర్యవైశ్యుల మహాసభను వచ్చే నెల 18న తిరుపతిలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మహాసభ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు, మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ ముంగటివార్ గురువారం మీడియాకు తెలిపారు. శ్రీవారిని దర్శించుకునేందుకు గురువారం తిరుపతికి చేరుకున్న సుధీర్‌కు వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ(వామ్) రాయలసీమ జోన్ చైర్మన్ దిండుకుర్తి నరసింహులు స్వాగతం పలికారు.