రేపు వైఎస్‌ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం
రేపు వైఎస్‌ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం
Published Sat, Nov 19 2016 12:27 AM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM
– పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించనున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. సమావేశానికి పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుకతో పాటు కమలాపురం శాసన సభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా పరిశీలకులు అనంత వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వివరించారు. ఆ ప్రకటనలో సమావేశాల షెడ్యూలును కూడా విడుదల చేశారు. షెడ్యూలు దిగువ పేర్కొన్న విధంగా ఉంది.
కర్నూలు నియోజకవర్గ సమావేశం..
కర్నూలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం రాయల్ ఫంక్షన్ హాల్‌లో జరుగుతుంది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు: 1 మొదలు 5వరకు వార్డులు, 10 గంటల నుంచి 11 గంటల వరకు: 6 నుంచి 10 వార్డులు, 11 గంటల నుంచి 12 వరకు: 11 నుంచి 15 వార్డులు, మధ్యాహ్నం 12 నుంచి 1.00 గంట వరకు 16, 17, 18, 22, 23 వార్డులు, 1.30 గంటల నుంచి 2.30 వరకు: 24, 25, 41, 42, 43 వార్డులు, 2.30 నుంచి 3.30 గంటల వరకు: 44 నుంచి 48 వార్డులు, సాయంత్రం 3.30 నుంచి 4 గంటల వరకు 49 నుంచి 51 వార్డుల సమావేశాలుంటాయి.
పాణ్యం, కోడుమూరు నియోజకవర్గ (కార్పొరేషన్) సమావేశం..
కర్నూలు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే పాణ్యం, కోడుమూరు వార్డుల విస్తృతస్థాయి సమావేశం బిర్లా కాంపౌండ్‌లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సాయంత్రం 4.30 నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తారు.
సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు: 19, 20, 21, 26, 27 వార్డులు, సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు: 28 నుంచి 32 వరకు వార్డులు, సాయంత్రం 6.30 నుంచి 8.00 గంటల వరకు: 33 నుంచి 40వ వార్డు వరకు
Advertisement
Advertisement