‘స్వచ్ఛంద’ వేదిక అభినందనీయం
‘స్వచ్ఛంద’ వేదిక అభినందనీయం
Published Wed, Sep 28 2016 10:33 PM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM
– కేఎన్‌ఎన్ జిల్లా సమావేశంలో ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు (ఓల్డ్‌సిటీ): సామాజిక సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు (ఎన్జీవోలు) కీలక పాత్ర పోషిస్తున్నాయని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పేర్కొన్నారు. కర్నూలు ఎన్జీవోస్ నెట్‌వర్క్(కేఎన్‌ఎన్) మొట్టమొదటి జిల్లా సమాశాన్ని బుధవారం స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా బుట్టా రేణుక మాట్లాడుతూ ఎన్జీవోలు ఒకే వేదికపైకి రావడం అభినందనీయమన్నారు. అందరూ కలిస్తే రాష్ట్ర వ్యాప్త సేవలుఅందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎన్జీవోలందించే సేవల పట్ల ఎవరైనా అధికారులు పట్టించుకోకపోతే తన దష్టికి తేవాలన్నారు. తాను నేరుగా కేంద్ర ప్రభుత్వ దష్టికి తీసుకెళతానని చెప్పారు.
వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. తమ ట్రస్టు ద్వారా ప్రజలకు విద్య, వైద్యపరమైన ఉచిత సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 132 సంస్థలు కలిశాయని కేఎన్‌ఎన్ జిల్లా చైర్మన్ మోహన్‌రాజ్ తెలిపారు. ప్రభుత్వం వెళ్లలేని చోటకు సేవా సంస్థలు వెళతాయన్నారు. కన్వీనర్ పాల్ రాజారావు మాట్లాడుతూ.. కరవు కాటకాలు వచ్చినా, సామాజిక సమస్యలు ఉత్పన్నమైనా ఎన్జీవోలు ముందుంటారన్నారు. అనంతరం ఎంపీ బుట్టా రేణుకను సన్మానించారు. కార్యక్రమంలో హఫీజ్ ఖాన్ ట్రస్టు వ్యవస్థాపకుడు ఎం.ఎ.మోయీజ్ ఖాన్, వైఎస్‌ఆర్‌సీపీ మైనారిటీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జహీర్ అహ్మద్ ఖాన్, కేఎన్‌ఎన్ కర్నూలు డివిజన్ అధ్యక్షుడు మద్దిలేటి, నంద్యాల మురళీకష్ణ, ఆదోని ఓంకారాచారితో పాటు ప్రసాద్, శైలజ, త్యాగరాజు, రాయపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement