తాగునీటి పథకాలకు నిధులు మంజూరు
ఎమ్మిగనూరు, గూడూరు నగర పంచాయతీలకు సంబంధించిన తాగునీటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై ఎంపీ బుట్టా రేణుక కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు కృతజ్ఙతలు తెలియజేశారు.
– కేంద్ర మంత్రికి ఎంపీ బుట్టా రేణుక కృతజ్ఙతలు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఎమ్మిగనూరు, గూడూరు నగర పంచాయతీలకు సంబంధించిన తాగునీటి పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై ఎంపీ బుట్టా రేణుక కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు కృతజ్ఙతలు తెలియజేశారు. ఈ రెండు నగర పంచాయతీల పరిధిలోని తాగునీటి సమస్యను తాను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించారన్నారు. మంగళవారం సాయంత్రం ఎంపీ తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి మస్తాన్‌వలి, నగరపాలక సంస్థ ఎంఈ రాజశేఖర్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తదితరులతో వివిధ పథకాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎమ్మిగనూరుకు రూ. 42 కోట్లు, గూడూరుకు రూ. 189 కోట్లు మంజూరయ్యాయన్నారు. కర్నూలు, ఆదోని నగరపాలక సంస్థల పరిధిలో అమృత్ పథకం నుంచి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆయా ప్రతిపాదనలను డీపీఆర్‌లను త్వరగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపాలని ఆ ప్రకటనలో కోరారు. కర్నూలు పంచాయతీ రాజ్ ఈఈ పాల్గొన్నారు.