ముస్లింలకు అండగా ఉంటా
– ఎంపీ బుట్టా రేణుక వెల్లడి
- ఆమె సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన ముస్లిం మహిళలు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కష్టసుఖాల్లో ముస్లింలకు అండగా ఉంటానని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక అనా్నరు. వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ, లేబర్‌కాలనీలకు చెందిన సయ్యద్ సలీమ, సయ్యద్ అల్తాఫ్ అహ్మద్, షేక్ ఖాజా, సమి, షేక్ నస్రీన్, షేక్ ముంతాజ్, నూర్ అహ్మద్, షేక్ షబానాతో పాటు మరో 100 మంది ముస్లిం మహిళలు ఎంపీ సమక్షంలో పార్టీలో చేరారు. మంగళవారం స్థానిక బాబా బృందావన్ నగర్‌లోని ఎంపీ కార్యాలయంలో చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ బుట్టారేణుక మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలుగా ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని తెలిపారు. హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీ నేతల దృష్టికి తీసుకోరావాలని కార్యకర్తలకు కోరారు. రెండేళ్లు కష్టపడి పనిచేస్తే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, నగర విద్యార్థి అధ్యక్షుడు గోపినాథ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ దాదామియ్య, గఫూర్ ఖాన్, సయ్యద్ షేక్షావలి, ఫారుక్ అలీ, మాలిక్ తదితరులు పాల్గొన్నారు.