విరివిగా రుణాలు ఇవ్వండి
– కెనరా బ్యాంకు అధికారులతో ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు (ఓల్డ్‌సిటీ): వివిధ పథకాల ద్వారా ప్రజలకు విరివిగా రుణాలు అందించాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కెనరా బ్యాంకు అధికారులను కోరారు. ఎంపీ స్థానిక బాబా బృందావన్ నగర్‌లోని తన నివాసంలో మంగళవారం కెనరా బ్యాంకు రీజనల్, డివిజనల్ మేనేజర్ల, మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. నేషనల్ బీసీ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ), మైనారిటీల పథకాలు, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, జన్‌ధన్ యోజన, ముద్ర పథకాలను కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అర్హులందరికీ అందేలా చూడాలని ఎంపీ కోరారు. ఆయా పథకాల అమలుకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆర్‌ఎం తిరుపతయ్య, డివిజనల్ మేనేజర్లు బాల సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్ ఉన్నారు.